సంక్రాంతికి నడిపే ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీల వసూలు దుర్మార్గం

– ప్రజలపై ధరల భారం మోపడం తప్ప జగన్ రెడ్డి పాలనలో ఒరిగిందేమీ లేదు
– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష

సంక్రాంతి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ జగన్ రెడ్డి ప్రజలపై భారం మోపుతున్నారు. పండుగకు నడపనున్న ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అందనపు ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం. తక్షణమే అదనపు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. తెలంగాణలో ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే బస్సులు నడుపుతుండగా.. ఏపీలో మాత్రం జగన్ రెడ్డి నిత్యం ప్రజలపై ఏదో ఒక రూపంలో ధరల భారం మోపుతూనే ఉన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పేదలు సంక్రాంతి పండుగను జరుపుకోలేని పరిస్థితి. చంద్రబాబు గారు ఇచ్చిన సంక్రాంతి, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలను నిలిపివేశారు. సినిమా టికెట్ల ధరలను తగ్గించిన ప్రభుత్వం.. ఆర్టీసీ ఛార్జీలను మాత్రం ఎందుకు పెంచింది?

దేశంలో ఎక్కడా లేనివిధంగా పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఏపీలోనే ఉన్నాయి. ఆస్తి పన్ను, మున్సిపల్ పన్ను, చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జీల పెంపు, భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంపు, రేషన్ సరుకుల ధరలు పెంపు, వాహనాల రిజిస్ట్రేషన్ ధరలు పెంపు, వృత్తి పన్ను పెంపు, కరోనాలో సైతం పన్నులు పెంపుతో జగన్ రెడ్డి ప్రజలపై మోయలేని భారం మోపారు. ఇసుక రేట్లు పెంచారు, మద్యం ధరలు పెంచారు, ఇప్పుడు సిమెంట్ ధరలు కూడా పెంచారు.

రాష్ట్రంలో హోల్ సేల్ దోపిడీకి తెరలేపిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన సొంత కంపెనీ భారతి సిమెంట్స్ పేరుతో రాష్ట్ర ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే భారతి సిమెంట్ రేట్లు భారీగా పెంచేసి వివిధ రకాల ప్రాజెక్ట్ లకు తమ సిమెంటును సరఫరా చేస్తూ సరికొత్త దోపిడీ పర్వానికి తెరలేపారు. రాష్ట్రంలో భారతి సిమెంట్ బస్తా ధర ప్రస్తుతం రూ.450 లు ఉండగా, చెన్నయ్ లో 365, హైదరాబాద్ లో 370, బెంగుళూరులో 390 రూపాయలకు విక్రయిస్తున్నారు. రెండున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో ప్రజలపై భారం మోపడం తప్ప ఒరిగిందేమీ లేదు. తక్షణమే పెంచిన ఆర్టీసీ అదనపు ఛార్జీలను తగ్గించాలి.

Leave a Reply