దళిత లెక్చరర్ జక్రయ్య ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యే

– ఎయిడెడ్ పై వైసీపీ ప్రభుత్వ విధానమే జక్రయ్యను పొట్టన పెట్టుకుంది
– మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

జగన్ ప్రభుత్వం ఓ వైపు ఉపాధి కోల్పోయేలా చేస్తూ మరో వైపు ప్రత్యామ్నాయాలు లేకుండా చేస్తుంది. వ్యవస్థలను జగన్ రెడ్డి ఎంతగా నాశనం చేసిందో చెప్పడానికి దళిత లెక్చరర్ జక్రయ్య ఆత్మహత్య నిదర్శనం. జక్రయ్య హత్య ఒక వ్యవస్థీకృత ప్రభుత్వ హత్య. ఎయిడెడ్ పై వైసీపీ ప్రభుత్వ విధానమే జక్రయ్యను పొట్టనపెట్టుకుంది. జగన్ చర్యలతో ఎయిడెడ్ జూనియర్, డిగ్రీ కాలేజీలలో దాదాపు 2 వేల మంది లెక్చరర్లు, పాఠశాలలోని 7 వేల మంది టీచర్లు రోడ్డున పడుతారని ఆనాడే హెచ్చరించాం.

వైసీపీ ప్రభుత్వ అడ్డగోలు విధానాలతో ఉపాధ్యాయులు, లెక్చరర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. నేడు లెక్చరర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. జక్రయ్యకు మూడు నెలలు జీతాలు లేవు. కొత్త పోస్టింగ్ ఎక్కడనే క్లారిటీ లేదు. ఇబ్బందులతో రోడ్డునపడి చివరకు ఆర్ధిక బలవన్మరణానికి పాల్పడ్డారు. దీనికంతటికే ప్రభుత్వమే కారణం.

తూర్పుగోదావరి జిల్లా కె. గంగవరం మండలం, బ్రహ్మపురి గ్రామం పాఠశాలలో దళిత విద్యార్ధులపై చూపిన ఘటన అందరిని కలచివేసింది. దళిత వర్గాల విద్యార్ధులను, అగ్రవర్గాల విద్యార్ధులను వేరు చేస్తూ కుల వివక్షత పాటించారు. ఈ ఘటన బాధ్యులుపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో వైసీపీ నాయకుల ఒత్తిడితో గిరీష్ బాబు అనే దళిత యువకుడిపై అక్రమ కేసు బనాయించి బలవన్మరణానికి పాల్పడేలా చేశారు. విజయనగరం జిల్లాలో కొత్త సంవత్సరం నాడు ఇద్దరు గిరిజన బాలికలపై అత్యాచారం జరిగింది. అయినా ఎటువంటి చర్యలు లేవు. ఇలాంటి సంఘటనలు గత రెండున్నరేళ్ల జగన్ పాలనలో 4950 నేరాలు జరిగాయి. ఒక్క దానిలో కూడా సరైన న్యాయం జరగలేదు.

దళిత లెక్చరర్ జక్రయ్య సూసైడ్ నోటును పోలీసులు తారుమారు చేయాలని చూస్తున్నారు. పోలీసులు చెబుతున్నట్లు జక్రయ్య అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకుంటే నోటును వెంటనే బయటపెట్టాలి. జక్రయ్య ఘటనతో రాష్ట్రంలో కాల్ మనీ నాగులు విచ్చలవిడిగా పేద, మధ్య తరగతి ప్రజలను దోచుకుంటున్నారు. జక్రయ్య మరణంపై సమగ్ర విచారణ చేపట్టి జక్రయ్య కుటుంబానికి న్యాయం చేయాలి.

Leave a Reply