బీజేపీ కి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారట

-తెలంగాణలో బీజేపీని బహిష్కరించాలి
-దేవుడు గుడిలో ఉండాలి… భక్తి గుండెల్లో ఉండాలి
-కేసీఆర్ కారు తూకానికి వెళ్లింది
-బండి పోతే బండి ఇస్తామని బండి సంజయ్ చెప్పిండు
-బండి రాలే గుండు రాలేదు
-కానీ ఇప్పుడు అరగుండు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు
-ఎల్బీనగర్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఆనాడు మీరు నన్ను ఆదరించడంవల్లే.. మీ ఆశీర్వాదంతో ఈనాడు ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చా. ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. సునీత మహేందర్ రెడ్డి ని గెలిపిస్తే మీ సమస్యలను పరిష్కరించేందు కృషి చేస్తారు. ఆనాడు నన్ను ఆశీర్వదించినట్లే… ఎల్బీ నగర్ నుంచి సునీతమ్మకు 30వేల మెజారిటీ ఇవ్వండి.

హయత్ నగర్ వరకు మెట్రోను విస్తరించే బాధ్యత నాది. వరద ముంపు సమస్యను పరిష్కరించే బాధ్యత నాది. ఈటెల రాజేందర్ ఏనాడైనా మీ సమస్యలను అడిగేందుకు ఇక్కడికి వచ్చారా? వరదలు వచ్చినప్పుడు బండి పోతే బండి ఇస్తామని బండి సంజయ్ చెప్పిండు. బండి రాలే గుండు రాలేదు.. కానీ ఇప్పుడు అరగుండు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు.

తెలంగాణను నిండా ముంచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు..బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు.. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ మనకు నిధులు ఇవ్వలేదు.. పరిశ్రమలు ఇవ్వలేదు… బీజేపీ కి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారట. ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తారో జవాబు చెప్పాకే మోదీ తెలంగాణకు రావాలి.

విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాకే మోదీ తెలంగాణకు రావాలి. అందుకే తెలంగాణలో బీజేపీని బహిష్కరించాలి… ఈ ఎన్నికల్లో బీజేపీని పడగొట్టాలి. దేవుడి పేరు చెప్పుకుని కొందరు బిచ్చమెత్తినట్లు… రాముడి పేరుతో ఓట్లు దండుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి.

కేసీఆర్ కారు తూకానికి వెళ్లింది.. ఇక తిరిగి రాదు.ఉద్యోగం ఊడిందనే కేసీఆర్ బస్సు యాత్ర పేరుతో కొంగ జపం చేస్తున్నారు. ఈ కొంగకు ఓటేస్తే పరోక్షంగా బీజేపీకి ఓటు వేసినట్లే.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం.పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో సునీతక్కను గెలిపించండి.మూసీని ప్రక్షాళన చేసే బాధ్యత నాది.118 జీవో సమస్యను పరిష్కరించే బాధ్యత నాది. ఎల్బీనగర్ ను అభివృద్ధి చేసే బాధ్యత నాది.

Leave a Reply