సైకో ప్రచారాన్ని నమ్మవద్దు

-జగన్ రెడ్డి ఇచ్చిందేమీ లేదు.. కొట్టేసిందే ఎక్కువ
-ఐదేళ్లలో దోపిడీలు చేసి ఖజానాలు నింపుకున్నారు
-విభజన తర్వాత కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించా
-రాయలసీమను నిర్వీర్యం చేశారు
-నా ఎస్సీలంటూ దళితుల్ని మోసం చేసిన వ్యక్తి జగన్
-అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగు దేశం
-ప్రజల అభివృద్దే నా ధ్యేయం
-ముస్లిం అభివృద్ధి టీడీపీతోనే
-కోడుమూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

కోడుమూరు: ఒకవైపు రాష్ట్రాన్ని నాశనం చేస్తూ, మరో వైపు ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, గ్రవెల్ దోపిడీ భూసంపద దోపిడీ చేసి జగన్ రెడ్డి బాగు పడ్డాడు. మీరు కొంచెమయినా బాగుపడ్డారా. జగన్ రెడ్డి పాలనలో ఏ కులానికైనా, మతానికైనా, వర్గానికైనా న్యాయం జరిగిందా? ఐదు సంవత్సరాల పాలన 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లింది. డ్రైవింగ్ తెలిసిన వాళ్లు డ్రైవింగ్ చేస్తే మీ జీవితాలు సేఫ్, డ్రైవింగ్ తెలియని వాళ్లు బస్సు ఎక్కి రివర్స్ డ్రైవింగ్ చేస్తున్నారు.

అతను అహంకారి కాబట్టి ఎవరి మాట వినకుండా ఇష్టానుసారంగా ఈ రాష్ట్రానికి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి సైకో జగన్. మీరంతా తెలంగాణ పక్కనే ఉన్నారు. హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది ఎవరో మీకు తెలుసు. అది అభివృద్ధి చేసింది తెలుగు జాతి కోసం సమైఖ్యంధ్రప్రదేశ్ లో హైటెక్ సిటీ నిర్మించా ఇప్పుడు అక్కడ సంపద సృష్టిస్తున్నారు.

విభజన తర్వాత కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించా
ఎప్పుడూ కూడా మాటలతో ఆదాయం పెరగదు. బటన్ నొక్కడం వల్ల ఆదాయం పెరగదు. పనులు చేసి, దూరదృష్టితో ఆలోచిస్తే ఆదాయం వస్తుంది. 2014 లో విభజన జరిగినప్పుడు మీతో పాటు నేను కూడా చాలా బాధపడ్డాను. ఆపడానికి ప్రయత్నాలు చేశాను కానీ, ఎవరూ వినలేదు. రాష్ట్రాన్ని హేతుబద్దంగా విభజన చేశారు. ఆరోజు మీ అందరూ ఆలోచించారు. జీతాలు ఇవ్వగలుతారా, పింఛన్లు ఇస్తారా అని ఆలోచించారు.

ఐదు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేశా. హైదరాబాద్ తెలంగాణకు వెళ్లినప్పుడు నేను నిద్రలేని రాత్రులు గడిపి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న50 శాతం తెలుగు వారిని అభివృద్ధి చేయాలని ఆలోచించా. అమరావతి, , రోడ్లు, పోలవరం, పరిశ్రమలు అన్ని తీసుకొచ్చా. విభజన జరిగినప్పుడు తెలంగాణకు, మనకు రూ. 35 వేలు తలసరి ఆదాయం చాలా తక్కువ ఉండేది. అంటే తెలంగాణలో 135 ఉంటే మనకు 100 వచ్చేది. నేనప్పుడు ఆలోచించాను. మీరు కూడా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. రూ. 135 నుంచి రూ.127 కి తగ్గించాను.

2019 లో సైకో వచ్చాడు. ఇప్పుడు వ్యత్యాసం చూస్తే 145 కు పెరిగింది. ఈ సైకో ముఖ్యమంత్రి బటన్ నొక్కా అని చెప్తాడు బటన్ నొక్కడం వల్ల ఎవరికి లాభం వచ్చింది. బటన్ నొక్కి మీకిచ్చింది రూ.10 లు కానీ మీ మీద భారం పడింది రూ.100 ఎడమ చేత్తో రూ.10 ఇచ్చి కుడి చేత్తో రూ.100 లాగేసుకుంటున్న దుర్మార్గుడు ఈ జగన్. కానీ, ఆయన దోపిడి చూస్తే మద్యం, ఇసుక, గ్రావెల్, భూ ఖనిజ సంపద అన్నింట్లో రూ.1000 దోచేస్తున్నాడు. పక్క రాష్ట్రం తెలంగాణలో ఇలాంటి కష్టాలు లేవు ఈ చేతగాని ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం సర్వనాశనమైంది. ఎప్పుడైనా ఒక మంచి పరిపాలన ద్వారా జీవితాలు బాగుపడతాయి. చెత్త పరిపాలన ఉంటే జీవితాలు నాశనమవుతాయి. ఇప్పుడు అదే జరిగింది.

రాయలసీమను నిర్వీర్యం చేశారు
రాయలసీమలో 50 సీట్లు ఉంటే 49 గెలిపించారు. పాదయాత్ర చేశాడు. నేను రాయలసీమ బిడ్డను అని చెప్పాడు నేను కూడా రాయలసీమ బిడ్డనే. కానీ, మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చిన జగన్ రాయలసీమ బిడ్డ కాదు రాయలసీమ క్యాన్సర్ అడ్డ. నమ్మి మీరంతా ఓట్లు వేస్తే మిమ్మల్ని మోసం చేశాడు. మంచిగా పాలిచ్చే ఆవుని వదిలేసి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. ఎన్నికల తర్వాత బాదుడే బాదుడు. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు.

ఒక్క తాగునీటి కుళాయి కూడా ఇవ్వలేదు. ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదు. ఈ ముఖ్యమంత్రికి నీటి విలువ తెలియదు, రైతుల కష్టాలు తెలియదు, తాగునీరు ఇవ్వాలనే బుద్ది కూడా లేదు. రాయలసీమ ద్రోహి ఈ జగన్ రెడ్డి. మళ్లీ ఇలాంటి దుర్మార్గుడు వస్తే రాయలసీమ ఎడారిగా మారుతుంది. ఇప్పటికే వలసలు వెళుతున్నారు తర్వాత ఊరంతా ఖాళీ అయ్యే పరిస్తితి వస్తుంది. టీడీపీ హయాంలో సీమ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ కింద 90 శాతం ఇచ్చాను. ఆ స్కీమును ఇప్పుడు రద్దు చేశాడు.

నా ఎస్సీలంటూ దళితుల్ని మోసం చేసిన వ్యక్తి జగన్
మరోపక్క నా ఎస్సీలు అంటూ దళితులను మోసం చేశాడు. రూ.25 వేల కోట్ల సబ్ ప్లాన్ ను రద్దు చేశాడు. 27 పథకాలు నేను ఇస్తే వాటన్నింటినీ నిలిపివేశాడు ఈ జగన్ రెడ్డి. ఎస్సీలంటూనే ఎస్సీలపై అట్రసిటీలు పెట్టిస్తాడు. సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేశారు. మాస్క్ అడిగాడని ఒక డాక్టర్ ని పిచ్చివాడిగా ముద్రేసి చంపేశారు. చీరాలలో మాస్కు పెట్టుకోలేదని ఒక దళితున్ని కొట్టి చంపేశారు. ఇలా చాలామంది దళితుల్ని పొట్టన పెట్టుకున్న వ్యక్తి సైకో జగన్. టీడీపీ హయాంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఇన్నోవా, అంబేద్కర్ విద్య అన్నీ దళితులకు దూరం చేశాడు. ఇప్పుడు దళితుల్లో కూడా తిరుగుబాటు వచ్చింది. దళితుల్లో కూడా ఎబిసిడి అనే కేటగిరీ లు పెట్టాను. 1996-97లోనే వర్గీకరణ తీసుకొచ్చాను. మాదిగలకు కూడా న్యాయం జరిగింది. మళ్లీ మన ప్రభుత్వంలో ఎబిసిడి కేటగిరీలు పెట్టి మాదిగలకు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నా.

అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగు దేశం
సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీ తెలుగు దేశం. ఇక్కడ నిలబెట్టిన వ్యక్తి దస్తగిరి మాదిగ కకులానికి చెందిన వ్యక్తి. కొన్ని ప్రాంతాల్లో మాలలకు కూడా సీట్లు కేటాయించాం. కర్నూలు పార్లమెంట్ లో కురబ సంఘానికి సంబంధించిన పంచలింగాల నాగరాజును నిలబెట్టాను. మంత్రాలయంలో బోయ, ఆదోని డెంటల్ పార్థసారధికి ఇచ్చాం, ఆలూరులో లింగాయత్ కి ఇచ్చి, కోడుమూరు ఎస్సీ, ప్రత్తిపాడు ఈడీగా కులంలో వెనుకబడిన వర్గానికి ఇచ్చాం, కర్నూలు వైశ్యా కి ఇచ్చాం, నంద్యాలలో ముస్లీంకి ఇలా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. కానీ, సైకో జగన్ మాత్రం ముగ్గురిని ఒకే కులం వారిని నిలబెట్టారు. మీరు కర్నూలు ను గెలిపించుకుంటే మనకు ఇంకా తిరుగులేదు.

ప్రజల అభివృద్దే నా ధ్యేయం
సైకో జనగ్ రెడ్డి మాటలు చెప్పి మోసం చేస్తాడు. నేను చెప్పిందే చేసి చూపిస్తా. 40 ఏళ్లు నన్ను ఆదరించిన మిమ్మల్ని దేశంలోనే నెం.1 గా చేయాలని ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇక్కడ మైనారిటీ ముస్లీం సోదరులు ఉన్నారు మీరు కూడా ఆలోచించాలి. రేపు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీకు పింఛన్లు ఇవ్వాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. రైతుని ఆదుకోవాలి, అభివృద్ది సంక్షేమాన్ని చేయాలి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా జగన్ ను ఇంటికి పంపాలని ముందుకు వచ్చారు. ఈరోజు మూడు పార్టీలు కలిసింది కూడా రాష్ట్రాన్ని బాగుచేయడం కోసమే. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా 14 సంవత్సారాలు పనిచేశాను.

ముస్లిం అభివృద్ధి టీడీపీతోనే
గతంలో కూడా నేను ఎన్టీయే లోనే ఉన్నాను. ముస్లీంలకు ఏమైనా అన్యాయం చేశానా? ముస్లీంల కోసం హైదరాబాద్ లో వాజ్‌పాయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేశా. ఆజ్రైస్ కట్టి హైదరాబాద్ నుంచి మక్కాకు పంపిన పార్టీ టీడీపీ. మైనార్టీలకు అవసరమైన ఉర్దూ రెండో భాష కింద 13 జిల్లాల్లో అభివృద్ధి చేశా. విభజన తర్వాత దుకాన్ ఔర్ మకాన్ ఇచ్చాం, దుల్హాన్ ద్వారా 36 వేల మంది ఆడబిడ్డలకు పెళ్లి చేశాం. 136 కోట్లు ఖర్చు పెట్టి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేశాం. రంజాన్ తోఫా ఇచ్చాం.

ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం, వక్ఫ్ భూములు కాపాడాం. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కాపాడే బాధ్యత మాది. 4 శాతం రిజర్వేషన్ అంశాన్ని సుప్రీంకోర్టులో మంచి లాయర్లు పెట్టి కాపాడుకుంటా. మసీదులు నిర్మించిన పార్టీ టిడిపి. ముస్లింలను రక్షించిన పార్టీ టీడీపీ దాడులు చేసింది వైసీపీ. అబ్దుల్ సలాంని వేధింపులకు గురి చేయకుండా కుటుంబ సహా ఆత్మహత్య చేసుకున్నారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి ఎంపికలో భాగస్వామ్యం అయినా పార్టీ టిడిపి. ముస్లింలను హీనంగా చూసి చంపేసిన పార్టీ వైసీపీ.

బటన్ నొక్కాలంటే నాయకుడు కావాల్సిన అవసరం లేదు
సైకో మేనిఫెస్టోలో ఏమీలేదు. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్. అన్ని వర్గాలకు న్యాయం చేసేది కూటమి. నా దగ్గర డబ్బులు లేవని జగన్ చేతులెత్తేశారు. బటన్ నొక్కితే ఆదాయం వస్తుందా? బటన్ నొక్కడానికి శక్తి, ఆలోచన, తెలివి కావాలా? కంప్యూటర్ తో ఆడుకునే పిల్లలు కూడా బటన్లు నొక్కుతారు. నాయకుడికి విజన్ కావాలి. భవిష్యత్ గురించి ఆలోచించాలి. వ్యవసాయ రంగంలో మార్పులు తేవాలి. ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తెచ్చేందుకు సిద్దాంతాలు తీసుకురావాలి. పేద వాళ్ల సంపద పెంచి ప్రభుత్వ ఆదాయం పెంచడం నాయకుడి లక్షణం. రాయలసీమ ప్రాజెక్టుల కోసం టిడిపి రూ.12వేల కోట్లు ఖర్చు పెడితే జగన్ రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టారు.

సంక్షేమానికి రూ.2.75 లక్షలు ఖర్చు చేస్తే అప్పు చేసిన రూ.12 లక్షల కోట్లు ఏమయ్యాయి
జగన్ కి ప్రజల ఆస్తులను దోచుకోవడం తప్పా ప్రజల మీద ప్రేమ లేదు. మన రాజధాని ఏది? రాజధాని పేరుతో మూడుముక్కలాడారు. ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ దూసుకుపోతుంది. హైదరాబాద్ ను మించిన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని చూశాను. రైతులే స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి 35వేల ఎకరాలు ఇచ్చారు. అది పూర్తి అయితే 10వేల ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉండేది. దానిని ఎకరా 30 కోట్లు చొప్పున అమ్మితే రూ. 3 లక్షల కోట్లు ఆస్థి వచ్చి ఉండేది. జగన్ నాశనం చేశాడు. రూ.2.75 లక్షల కోట్లకు బటన్ నొక్కా అని జగన్ అంటున్నాడు. కాని జగన్ చేసిన అప్పు రూ.12 లక్షల కోట్లు. అవ్వన్ని ఏమయ్యాయి? ఆ అప్పు ఎవరు కట్టాలి?

నాశిరకం మద్యం బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చలగాటం
మళ్లీ పట్టుదలగా రాత్రింబవళ్లు పని చేస్తాను. సీబీఎన్ అంటే అభివృద్ధి చేసిన చరిత్ర ఉంది. రాష్ట్రాన్ని మళ్లీ నెంబర్ వన్ గా చేయడం చేసి మీ రుణం తీసుకుంటాను. బాదుడు లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసే బాద్యత నాది. నిత్యావసర ధరలు తగ్గుతాయి, కరెంట్ చార్జీలు పెరగవు. పన్నుల బెడద ఉండదనేది నా హామీ. మీ ఊరులోనే కరెంట్ ఉత్పత్తి చేసుకొని వాడుకున్న తరువాత మిగిలినది ప్రభుత్వానికి ఇచ్చే విధానం తీసుకువస్తాను.

కర్నూలులో అతిపెద్ద లార్జెస్ట్ సోలార్ పార్క్ పెట్టింది టిడిపి. రివర్స్ బుల్ పంపులు పెట్టి ఎండ ఉన్నప్పుడే సోలార్ వలన కరెంట్ వస్తుంది మిగిలిన సమయంలో రాదంటే పెద్ద రిజర్వాయర్ తో హైడల్ పవర్ పెట్టి రెండు ముందుకు తీసుకువెళ్లాం. గతంలో రూ.60 క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200కి పెంచారు. అది ఒక క్వార్టర్ తో పాటు రెండో క్వార్టర్ తీసుకోవడంతో నాశిరకం మద్యం వలన ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నారు. ఇక్కడ బ్రాండ్ ఎక్కడా లేవు. పేదల ప్రాణాలకు విలువ తెలియని వాడు. హూ కిల్డ్ బాబాయ్ అని అడుతున్నాను.

టిడిపి పరిశ్రమలు తెస్తే జగన్ గంజాయి తెచ్చాడు
వివేకం సినిమా చూశారా? మీ భవిష్యత్ కావాలా? గొడ్డలి వేటు కావాలా? యువతకు ఉద్యోగాలు వస్తాయా? డిఎస్సీ పెట్టాడా? గంజాయి మాత్రం యద్దేచ్చగా దొరుకుతుంది. మన పిల్లలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే పక్కదారి పట్టి గంజాయితో నిర్వీర్యం అవుతారు. మీరు ఏం చెప్పినా వింటారు. రాష్ట్ర ప్రజలందరూ గొర్రెలని జగన్ అనుకుంటున్నారు. తెలుగు వారందరూ తెలివైన వాళ్లు. ప్రజలను మోసం చేస్తున్న జగన్ ను చిత్తు చిత్తుగా ఓడిస్తారు.

టిడిపి టీచర్లకు గౌరవం ఇస్తే జగన్ మద్యం షాపుల ముందు ఉంచారు
జాబు రావాలంటే బాబు రావాలి. టెక్నాలిజీ అంటే బాబు బ్రాండ్. తెలుగు జాతి యువకులు పేదవాడిగా పుట్టి, పేదవాడిగా పెరిగి, పేదవాడిగా చనిపోకూడదనేది నా ఆలోచన. నేను బ్రతికేది బావి తరాల భవిష్యత్ కోసం. అంగన్ వాడీ వర్కర్ల జీతాలు పెంచమంటే దౌర్జన్యం చేశాడు. అంగన్ వాడీలకు ఒకే సారి రూ.6,300 జీతాలు పెంచాం. హోం గార్డులకు రూ.18వేలు పెంచాం. టీచర్లకు గౌరవం ఉండేది నేడు మద్యం షాపుల ముందు కాపాలా పెడుతున్నారు. చదువులు చెప్పే టీచర్లను వేధించారు. పాఠశాలలకు రంగులు కొడితే చదువు వస్తుందా?

రంగుల పిచ్చోడు పార్టీ రంగులు అన్నింటా వేస్తున్నారు. చదువు కావాలంటే టీచర్లకు గౌరవం ఇవ్వాలి. టీచర్లకు జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి. పోలీసులతో తప్పుడు పనులు చేయించారు. ఎన్నికల్లో చట్టప్రకారం పని చేస్తారని ఆశిస్తున్నారు. పోలీసులకు టీఏ, డీఏలు ఇవ్వలేదు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. జైల్లో పెడుతున్నారు. ఆఖరికి నన్ను కూడా జైల్లో పెట్టారు. నాలాంటి వాళ్లకు ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యులు ఒక లెక్కనా? ఇలాంటి దుర్మార్గుడు ఉంటే జీతాలు తగ్గించడానికి పీఆర్సీ వేస్తాడేమో? ప్రజల కోసం సిద్ధపడి పోరాడాను. వెంకటేశ్వర స్వామి సన్నిదిలో నా మీద 23 క్లేమోర్ మైన్ల దాడి జరిగినప్పుడు ప్రజలను కాపాడుకోవాలనే చూశాను.

సంపద సృష్టించి ఆదాయం పేదలకు పంచాలి
తుంగభద్రకు నీళ్లు లేవు. సైకో చేతులు ఎత్తేశాడు. ఇంక నా వల్ల కాదని నిన్నే రాజీనామా చేశాడు. హామీలు ఎలా చేస్తారని జగన్ నన్ను ప్రశ్నిస్తున్నారు. 1995లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి. నేను కొన్ని నిర్ణయాలతో 2004కి మిగిలిన బడ్జెట్ కు తీసుకువచ్చాను. నాటి నుంచి నేటి వరకు తెలంగాణ ముందుకు పోవడానికి కారణం నేనే. నాయకుడు దూరదృష్టితో ఆలోచించాలి. విధ్వంసం చేసే వాడు ప్రజా నాయకుడు కాదు.
సూపర్ సిక్స్ సక్సెస్

మా ఆడబిడ్డలకు మహాశక్తి కింద నాలుగు కార్యక్రమాలు అమలు చేస్తాం. డ్వాక్రా సంఘాలు, కాలేజీల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లను టిడిపి తెచ్చింది. ఆడబిడ్డ నిధి కింద ఒక్కో ఆడబిడ్డకు రూ.1,500 ఇస్తాం. తల్లికి వందనం కింద పిల్లల చదువులు నిమిత్తం ఒక్కో పిల్లవాడికి రూ.15,000 ఇస్తాం. ఎంత మంది ఉంటే అందరికి ఇస్తాం. అందరిని చదివించే బాధ్యత నాది కూటమికి ఓట్లు వేసేబాధ్యత మీది. దీపం పథకాన్ని తెచ్చాం.3 సిలెండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తాం. రాష్ట్ర ప్రగతితో పాటు ఆడబిడ్డల భవిష్యత్ కూడా కాపాడతాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. పేదరికం లేని సమాజం చూడాలనేదే నాధ్యేయం. సంపద సృష్టించి ఆదాయం పెంచి దానిని ప్రజలకు పంచుతాను. ఆడబిడ్డలను లక్షాదికారులుగా చేసే బాధ్యత నాది.

కుల గణనతో పాటు స్కిల్ గణన జరగాలి
పేదరికం లేని రాష్ట్రం చూడాలనేది నా ఆకాంక్ష. కుల, మత గణన చేస్తున్నాం. భవిష్యత్ లో స్కిల్ గణన చేయాలి. నైపుణ్య కేంద్రాలు పెట్టి నైపుణ్యం నేర్పించి మీ ఇంట్లో పని చేసే విధంగా కృషి చేస్తాను. సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాను. డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాను. ప్రతి ఒక్క అన్నదాతకు రూ.20వేలు అందిస్తాం. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాను. మేం వస్తే అన్ని పథకాలు రద్దు అవుతాయని జగన్ అంటున్నారు. కాని ఏ ఒక్క పథకం రద్దు అవ్వదు. మెరుగైన సంక్షేమం చేస్తాం. రూ.10 సంక్షేమం జగన్ చేస్తే అందుకు రెట్టింపు సంక్షేమం అందిస్తాం.

ఆదాయం లేని సంక్షేమం మంచిది కాదు. రాష్ట్రాన్ని చంపేయాలని జగన్ సిద్ధపడితే నేను రక్షించడానికి సిద్ధపడ్డాను. రాష్ట్రాన్ని పున:నిర్మాణం చేయాలి. అన్న క్యాంటీన్, విదేశీ విద్య, చంద్రన్న బీమా మళ్లీ అమలు అవుతాయి. పింఛన్ 1985లో రూ.35తో ఎన్టీఆర్ ప్రారంభించారు. నేను వచ్చాక రూ.200 నుంచి రూ.2000 అంటే 10 రెట్లు పెంచాను. నేను మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే రూ.3000 మొదటి నెలలో వచ్చి ఉండేది. జగన్ మభ్య పెట్టి మోసం చేశారు. ఇప్పుడు మళ్లీ రూ.4000 ఏప్రిల్ నెల నుంచే ఇస్తాను.

కానీ జగన్ 2028లో రూ.250, 2029లో మరో రూ.250 ఇస్తానని అంటున్నాడు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు రూ.4000 నుంచి రూ.6000 పెంచుతాను. సంక్షేమంలో జగన్ చేతులెత్తేసి పారిపోయాడు. వాలంటీర్లకు రూ.5000 నుంచి రూ.10000పెంచే బాధ్యత నాది. మేనిఫెస్టోలో కనీసం వాలంటీర్ల గురించి ప్రస్తావించలేదు. స్వార్ధం కోసం రాజీనామాలు చేయమని ఘోరంగా మాట్లాడారు. అంటే వాళ్ల కుటుంబాలు ఏమవ్వాలి. అలాంటి స్వార్ధపరుడు రాష్ట్రానికి అవసరమా?

దోచుకున్న వైసీపీ నేతల నుంచి కక్కించే బాధ్యత
సి.బెళగల్, కోడుమూరు మండలలో ఎర్రమట్టి, భూకుంభకోణాలతో చిన్న చిన్న సైకోలు దోచేసుకుంటున్నారు. ప్రజల ఆస్తులను దిగమించిన వారిని వదిలిపెట్టను. బి.తాండ్రపాడులో చెరువును మింగి కబ్జా చేసుకున్నారు. ఎస్సీ, బీసీలను మాత్రమే అభ్యర్ధులుగా మార్చారు. కాని జగన్ మనుషులను మాత్రం ఎక్కడా మార్చలేదు. ఇంజినీరింగ్ కాలేజీలు, రియల్ ఎస్టేట్ ఆస్తులున్న వైసీపీ అభ్యర్ధి పేదవాళ్ల ప్రతినిధా? మాకు కోటీశ్వరులు అవసరం లేదు. గుండ్రేవులకు రూ. 2,890 కోట్లు మంజూరు చేస్తే ఒక్క అడుగు ముందుకు పడలేదు.

35 గ్రామాలకు రవాణా సౌకర్యం కోసం గోరంట్ల – కొత్తపల్లి మద్య హంద్రీ నీవాపై వంతెన నిర్మాణం ఏర్పాటు చేస్తాం. గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా కృష్ణదొడ్డి, సంగాల కంబద్ హామ్, చింతమాను పల్లి, రేమటి ఎత్తిపోతల పథకాలకు ప్రజలు చందాలు వేసుకొని బాగు చేసుకున్నారు. జగన్ ప్రాజెక్టుల మరమ్మత్తులకు కనీసం నిధులు కూడా కేటాయించని పరిస్థితి. కర్నూలు – సుంకేశల రోడ్డు ఆధునీకరణ రూ.25 కోట్లు ఇస్తే జగన్ రద్దు చేశారు.

కొడుమూరు లో తాగు నీటి సమస్య కోసం రూ.75 కోట్లు ఇస్తే రద్దు చేశారు. ఇంటింటి తాగు నీటి సమస్య పరిష్కారం చేస్తాం. ఐదేళ్లల్లో ప్రతి ఒక్క ఇంటికి తాగు నీటి అందిస్తాం. అన్ని రోడ్లు వేయిస్తాం. వైసీపీ నుంచి టిడిపిలోకి భారీగా చేరారు. సర్పంచ్ లు అందరూ చేరవల్సిన పార్టీ టిడిపి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ ఉండాల్సింది టిడిపిలోనే. స్థానిక సంస్థలకు నిధులు ఇస్తాం. స్థానిక సంస్థల హక్కులు కాపాడతాం. మళ్లీ మీకు అధికారాలు, నిధులు ఇచ్చి మీ ద్వారానే పనులు చేయిస్తానని హామీ ఇస్తున్నాను

Leave a Reply