Suryaa.co.in

Andhra Pradesh

ఊరికో ప్యాలెస్ కట్టుకున్న జగన్..ఉత్తరాంధ్రకు ఏం చేశాడు?

షర్మిలను చూస్తే బాధేస్తోంది
2019కి ముందు అన్న విడిచిన బాణం అన్నారు
కానీ ఇప్పుడు తల్లిని, చెల్లిని జగన్ గెంటేశారు
తనకు ప్రాణభయం ఉందని వివేకా కుమార్తె సునీతారెడ్డి భయపడుతోంది
వీరికే ఇలా ఉంటే మహిళలకు రాష్ట్రంలో ఏ విధంగా రక్షణ ఉంటుంది.?
ఎర్రబుక్ పై కొందరు భ యపడుతున్నారు
నాపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని అంటున్నారు
చట్టాన్ని ఉల్లంఘించిన వారినే వదలనని చెప్పా
తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు.?
టీడీపీ – జనసేన ప్రభుత్వం వచ్చాక వలసలు లేని ఉత్తరాంధ్ర
శ్రీకాకుళం జిల్లాకు నువ్వు ఇచ్చిన 60 హామీల సంగతేంటి జగన్?
ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్…జగన్ విముక్త ఏపీనే అందరి లక్ష్యం
విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వం…అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహణ
2014లో ఏ పార్టీలో లేని విధంగా సంక్షేమ నిధిని ఏర్పాటు చేశాను
కానీ వైసీపీలో మాత్రం సొంత కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు
టెక్కలి ‘శంఖారావం’ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

టెక్కలి : ఊరికో ప్యాలెస్ కట్టుకున్న సీఎం జగన్ ఉత్తరాంధ్రకు ఏం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక వలసలు లేని ఉత్తరాంధ్రగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో సెజ్ ఏర్పాటు చేస్తామని..దాని ద్వారా ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్ అని…జగన్ విముక్త ఏపీనే అందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.

శంఖారావం పర్యటనలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏర్పాటు చేసిన సభలో లోకేష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ….‘ఉత్తరాంధ్ర అమ్మలాంటిది..అమ్మప్రేమకు కండీషన్స్ ఉండవు. ఉత్తరాంధ్రులు ప్రేమాభిమానాలకు కూడా కండీషన్స్ లేవు. పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా. గరిమెళ్ల సత్యనారాయణ, సర్దార్ గౌతు లచ్చన్న, ఎర్రన్నాయుడు పుట్టిన నేల ఇది. జగన్ ను చూస్తే జాలేస్తోంది…పద్దాక సిద్ధం అంటున్నారు.

దేనికి సిద్ధం…నువ్వు జైలుకు వెళ్లడానికి సిద్ధమా.? మేము అందరం కలిసి నిన్ను జైలుకు పంపడానికి మాత్రం సిద్ధం. శ్రీకాకుళం జిల్లాకు జగన్ 60 హామీలిచ్చారు..ఒక్క హామీనైనా అమలు చేశారా? ఒక్క సాగునీటి ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశాడా.? వంశధార, తోటపల్లి కడి, ఎడమ కాల్వలు పూర్తి చేస్తామని చెప్పి మోసం చేశాడు. నాగావళి కరకట్ట పనులు కూడా పూర్తి చేస్తామని చేయకుండా మాట తప్పాడు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విశాఖను జాబ్ కేపిటల్ గా తీర్చిదిద్దితే జగన్ గంజాయి కేపిటల్ గా మార్చారు.

విశాఖ రైల్వే జోన్ కు స్థలం కేటాయించలేదు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తానని మాటిచ్చాడు..ఒక్కటన్నా తెరిపించాడా.? విశాఖపట్నం అభివృద్ధి చెందడానికి కారణం ఉక్కుఫ్యాక్టరీ. ఎంతోమంది పోరాడి ఉక్కుఫ్యాక్టరీ తీసుకొచ్చారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ సంస్థలతో లాలూచీ పడి దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాడు. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కానివ్వం…అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేలా చేస్తాం. బాపట్లలో బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ నోట్లో పేపర్లు కుక్కి పెట్రోల్ పోసి నిప్పు అంటించి చంపారు.

బీసీ బిడ్డలను చంపడానికి మీరు సిద్ధమా జగన్? దళిత డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు పిచ్చోడిన చేసి చంపారు..దళితులను చంపడానికి మీరు సిద్ధమా జగన్? పలమనేరులో మైనారిటీ బాలిక మిస్బా బాగా చదువుతుంది. వైసీపీ నేత కుమార్తె మొదటి స్థానంలో రావాలని మిస్బాకు టీసీ ఇవ్వడంతో వేదనతో చనిపోయింది… మైనారిటీలను చంపడానికి మీరు సిద్ధమా జగన్.? రాష్ట్రాన్ని మళ్లీ సర్వనాశనం చేసేందుకు మీరు సిద్ధమా జగన్? విశాఖలో భూ కుంభకోణాలకు అడ్డుపడ్డారని ఎమ్మార్వో రమణయ్యను కొట్టి చంపారు.

బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే పూజిత ఆత్మహత్యకు వైసీపీ నేతలే కారణం. ఎరువులు తీసుకెల్లి డబ్బులివ్వలేదు..డబ్బులు తీసుకురావాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకురావడంతో ఉరేసుకుని చనిపోయారు. విజయనగరంలో వైసీపీ నేతలు సిమెంట్ తీసుకెళ్లి తిరిగి ఇవ్వకపోవడంతో జె.ఈ రామకృష్ణ కార్యాలయంలోనే ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారు. రాష్ట్రంలో అధికారుల పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి.? కొత్తగా జగన్ డీఎస్సీ నాటకానికి శ్రకారం చుట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

కానీ ఎన్నికలు వస్తున్నాయని 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్తున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి 1.70 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేశారు. టీడీపీ వచ్చాక యేటా డీఎస్సీ నిర్వహిస్తాం. తానే పేదవాడినని జగన్ పదేపదే పేదవాడు అంటున్నారు..వినడానికి ఎంతో వితంగా ఉంది. జగన్ కు మైతోమేనియా సిండ్రోమ్ అనే జబ్బు ఉంది. దీని ప్రకారం ఉన్నది లేనట్లు,..లేనది ఉన్నట్లు చెప్తారు. సాక్షి టీవీ, సిమెంట్ కంపెనీ, పవర్ కంపెనీ, లక్ష రూపాయల చెప్పులు వేసుకుని తిరిగే వీళ్లు పేదలు అవుతారా.? వెయ్యి రూపాయల ఖరీదైన బాటిల్ నీళ్లు తాగేవారు పేదవాడు అవుతాడా.?

షర్మిలను చూస్తే బాధేస్తోంది. 2019కి ముందు అన్న విడిచిన బాణం అన్నారు. కానీ ఇప్పుడు తల్లిని, చెల్లిని జగన్ గెంటేశారు. తనకు ప్రాణభయం ఉందని వివేకా కుమార్తె సునీతారెడ్డి భయపడుతోంది. వీరికే ఇలా ఉంటే మహిళలకు రాష్ట్రంలో ఏ విధంగా రక్షణ ఉంటుంది.?

జగన్ కట్టింగ్..ఫిట్టింగ్ మాస్టర్. బులుగు బటన్ నొక్కి రూ.10 వేస్తాడు..ఎర్ర బటన్ నొక్కి రూ.100 లాగేస్తాడు. 9 సార్లు విద్యుత్, 3 సార్లు బస్సు ఛార్జీలు పెంచాడు. ఆఖరికి ఇంట్లో ఉన్న కుక్కకు కూడా పన్ను వేస్తాడు ఈ జగన్. త్వరలో ఊదే గాలికి కూడా పన్ను వేస్తాడు. పెళ్లి కానుక, చంద్రన్నబీమా, 6 లక్షల పెన్షన్లు, అన్న క్యాంటీన్లు, పండుగ కానులు ఇలా సుమారు 100 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని వాలంటీర్లతో ప్రచారం చేయిస్తున్నారు. సంక్షేమాన్ని రాష్ట్రానికి పరిచయం చేసింది టీడీపీనే. రూ.2 లకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, హార్స్ పవర్ మోటార్ రూ.50లకే ఎన్టీఆర్ నాడు అందించారు.

చంద్రబాబు సీఎం అయ్యాక కట్టెల పొయ్యితో మహిళలు ఇబ్బంది పడకూడదని దీపం పథకం ద్వారా గ్యాస్ అందించారు. అన్నక్యాంటీన్ తీసుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రద్దు చేసిన సంక్షేమ పథకాలు అన్నీ మళ్లీ తీసుకొస్తాం. 3,132 కి.మీ పాదయాత్ర చేశాను. పవన్, చంద్రబాబుతో మాట్లాడాక సూపర్ సిక్స్ ప్రకటించాం. నిరుద్యోగులకు 5 ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చేదాకా నెలకు రూ.3 వేలు భృతి ఇస్తాం. తల్లికి వందనం ద్వారా రూ.15 వేలు ప్రతి బిడ్డకూ ఇస్తాం. రైతులకు రూ.20వేలు పెట్టుబడి సాయంగా ఇస్తాం.

యేటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాం. 18-59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.15 ఇవ్వబోతున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయానించే వెసులుబాటు కల్పిస్తాం. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసింది టీడీపీనే. నాగావళి-వంశధార నదులను అనుసంధానం చేసింది టీడీపీనే. ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ కేంద్రంతో పాటు, పెన్షన్ కూడా మంజూరు చేసింది టీడీపీనే. తిత్లీ తుపాను సయంలో ఆదుకుని 2 వారాల్లోనే నష్ట పరిహారం అందించాం. టెక్కలి టీడీపీ కంచుకోట. ఎన్టీఆర్ ఆనాడు టెక్కలి నుండి పోటీ చేసి గెలిచారు. ఆ ఘనతను అచ్చెన్నాయుడు ముందకు తీసుకెళ్తున్నారు.

టెక్కలిలో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. రూ.2 వేల కోట్లతో టెక్కలి అభివృద్ధి చేశాం. వంశధార మెయిన్ కెనాల్ లైనింగ్ పూర్తి చేసే బాద్యత తీసుకుంటాం. నాడు తాగునీటి సమస్య ఉన్నప్పుడు కుళాయిల ద్వారా నీటిని అందించారు. జనాభా పెరుగుతన్న దృష్ట్యా కుళాయిలు ఇంకా పెంచాలి. అందుకే అధికారంలోకి వచ్చాక కుళాయి ద్వారా నీటిని ప్రతి ఇంటికి అందిస్తాం. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం. టీడీపీ బలం కార్యకర్తలే. నాకు అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లు లేరు. కానీ ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్కలు, తమ్ముళ్లు, అన్నలు కుటుంబ సభ్యులను అందించారు. 2014లో ఏ పార్టీలో లేని విధంగా సంక్షేమ నిధిని ఏర్పాటు చేశాను. రూ.100 కోట్లను ప్రమాద బీమా ద్వారా కార్యకర్తలకు అందించి ఆదుకున్నాం. చనిపోయిన కార్యకర్తల పిల్లలను భువనేశ్వరి చదివిస్తున్నారు.

కానీ వైసీపీలో మాత్రం సొంత కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు.. పసుపు జండా చూస్తేనే ఒక పౌరుషం. గత నాలుగేళ్ల 10 నెలలుగా అనేక రకాలుగా కార్యకర్తలను, నాయకులను వేధిస్తూ…ఇబ్బంది పెడుతున్నారు. అచ్చెన్నాయుడుపై 11 కేసులు పెట్టారు. నాపై 22 కేసులు పెట్టారు. ఏ తప్పూ చేయని చంద్రబాబును 53 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు. స్కిల్ కేసులో 3 వేల కోట్లు అవినీతి అన్నారు..తర్వాత రూ.270 కోట్లు అన్నారు..ఇప్పడు రూ.27 కోట్లు అంటున్నారు. అందుకే అక్రమాలపై చర్చించేందుకు మేము సిద్ధం.

ఏ తప్పూ చేయని కుటుంబం మాది. ఎవరన్నా జైలుకు వెళితే అక్రమాలు బయటకు వస్తాయి..కానీ చంద్రబాబును జైలుకు పంపితే ఆయన చేసిన మంచి పనులు బయటకు వచ్చాయి. 2019 నుండి 2024 వరకు ఎవరిపై ఎక్కువ కేసులు ఉన్నాయో వారికి నామినేటెడ్ పోస్టు ఇస్తా. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేపై వంద కేసులు పెట్టారు. జీవో 70 ద్వారా పోలీసుల పొట్ట కూడా జగన్ కొట్టాడు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జీవో70 రద్దు చేస్తాం. అదనపు సరెండర్ లీవ్స్, ట్రావెల్ అలవెన్స్, నక్సల్స్ ఏరియా అలవెన్స్ కూడా తిరిగి తీసుకొస్తాం.

ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా జగన్ ఇబ్బంది పెడుతున్నారు. మన ప్రభుత్వం రాగానే ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తాం. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వారి పేర్లు ఎర్రబుక్ లో ఉన్నాయి..వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తాం. అధికారంలోకి రాగానే జ్యుడిషియల్ విచారణ వేసి డిస్మిస్ చేస్తాం. ఎర్రబుక్ పై కొందరు బయపడుతున్నారు. నాపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని అంటున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారినే వదలనని చెప్పా…తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు.?

చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో పవన్ రాష్ట్రానికి చంద్రబాబు వస్తుంటే అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తల ముసుగులో చిచ్చులు పెట్టేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. సూపర్ సిక్స్ క్యాలెండర్ ను ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉంది.’ అని లోకేష్ అన్నారు

 

LEAVE A RESPONSE