డబ్బులు నేను తీసుకు వస్తే .. మీరు గాడిదలు కాస్తున్నారా ?

రోజా అన్నలు,ఈవిడ భర్త అందరూ మంత్రులే నట
ప్లాట్ లు వేస్తే ఈవిడకు కప్పం కట్టాలట కదా?
పెండింగ్ ప్రాజెక్ట్ ల్లో జగన్ ఆన్న తట్టెడు మట్టి తీయలేదు
జగన్ పథకాలు అభివృద్ధి లో కాదు..వైన్ షాప్ లో ఉన్నాయి
జగన్ అన్న కోట నుంచి ఇన్నాళ్లు బయటకు రాలేదు
మీరు దగా చేయడానికి సిద్ధం
అయితే..మిమ్మల్ని ఇంటికి పంపడానికి జనం సిద్ధం
రండి ..ఎవడోస్తాడో చూద్దాం..ఎంత మంది వస్తారో చూద్దాం
మీ దమ్ము ఏంటో చూపించండి. ఎవరేంటో చూసుకుందాం.
వైఎస్సార్సీపీ మొక్కగా ఉన్నప్పుడు నేను నీళ్ళు పోశా
జగన్ ఆన్న పాలన లో రైతులకు ఆత్మహత్యలు శరణ్యం
వైఎస్సార్ ను పంచే విప్పి కొడతా అని మాట్లాడిన మాటలు గుర్తుకున్నాయి
నగరి కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

 

నగరి ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా అంట కదా? నియోజకవర్గం లో అంతా జబర్దస్త్ దోపిడీ అంట. ఈవిడ ఒక్కరే కాదు… నియోజకవర్గంలో నలుగురు మంత్రులు అంట కదా? ఈవిడ అన్నలు,ఈవిడ భర్త అందరూ మంత్రులే నట. నియోజకవర్గంలో అందరూ కలిసి దోపిడీ అంతా జబర్దస్త్. మొత్తం మట్టి దోపిడీ..ఇసుక దోపిడీ.

నియోజకవర్గంలో గ్రావెల్ దోపిడీ. ప్రభుత్వ స్థలాలు దోపిడీ. ప్లాట్ లు వేస్తే ఈవిడకు కప్పం కట్టాలట కదా? కన్ను పడితే అంతా స్వాహా. ఎక్కడ చూసినా అవినీతి. ఈ రోజా ఒకప్పుడు ఐరెన్ లెగ్. ఐరెన్ లెగ్ అని పిలవబడినప్పుడు మీ మాటలు గుర్తు ఉన్నాయి. వైఎస్సార్ ను పంచే విప్పి కొడతా అని మాట్లాడిన మాటలు గుర్తుకున్నాయి. నాగురించి మాట్లాడే అర్హత లేదు.

నన్ను ప్రేమించినంతగ వైఎస్సార్ ఎవరిని ప్రేమించలేదు. వైఎస్సార్ కి గౌరవం లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండను. కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ మీద అపారమైన అభిమానం ఉంది కనుకనే కాంగ్రెస్ లో చేరా. ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తామని హామీ ఇస్తేనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరా. నేను వైఎస్సార్‌టీపీ నీ మూయలేదు. వైఎస్సార్‌టీపీ ను కాంగ్రెస్ లో విలీనం చేశా. కాంగ్రెస్ ఉన్నంత వరకు వైఎస్సార్‌టీపీ కూడా కాంగ్రెస్ లో బాగమై బ్రతికి ఉంటుంది.

గొప్ప ఉద్దేశ్యం తోనే ఇక్కడ అడుగు పెట్టా. ప్రత్యేక హోదా భాధ్యత నాపై ఉంది. రోజా కొత్తగా నీతులు చెప్తుంది. తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలట. అవి నేను తీసుకు రావాలట. డబ్బులు నేను తీసుకు వస్తే మీరు గాడిదలు కాస్తున్నారా ? అధికారం ఉన్నది మీకు..కేసీఅర్ దోస్తీ మీకు. ఈ 5 ఏళ్లు వాళ్ళతో మీరు అన్నాలు తిన్నారు..స్వీట్లు తినిపించుకున్నారు. పక పక నవ్వుకున్నారు. రాష్ట్ర విభజన సమస్యలు మీకు అప్పుడు కనపడలేదా ?

కనీసం ఒక పేపర్ అయినా ఇచ్చారా ? వాళ్ళ ఇళ్ళముందు ధర్నాలు అయినా చేశారా ఇదే నగరి లో కాలుష్య శుద్ది కేంద్రాన్ని వైఎస్సార్ ఏర్పాటు చేస్తే కనీసం దాన్ని నడపడం చేతకాదు.ఇక్కడ మరమగ్గాలు ఎక్కువ. వాళ్ళను ఘోరంగా మోసం చేశారు కదా? పవర్ లూమ్ లకు పవర్ స్లాబ్ లు మార్చారు. వెయ్యి రూపాయలు వచ్చే బిల్లును..4 వేలు వచ్చేలా చేశారు.వాళ్ళు బిల్లులు తగ్గించండి అని మొత్తుకున్నా పట్టింపు లేదు.

ఈ రోజా ఒక మహిళా మంత్రి. రాష్ట్రంలో అంగన్ వాడిలు,ఆశ వర్కర్ లను పోలీస్ బూటు కాలుతో తొక్కుతున్నారు. పక్క రాష్ట్రంలో పెట్రోల్ ,డీజిల్ ధరలు తక్కువ. ఇక్కడ ఎక్కువ..ఇదేనా పరిపాలన? రోజమ్మ నోరు ఉంది కదా అని పారేసుకోకు. పక్క రాష్ట్రంలో నాపై అధిక ప్రసంగం చేసిన వాళ్ళను జనాలు ఓడగొట్టారు. వాళ్ళు ఇంట్లో కూర్చుని ఉన్నారు. నీ గతి కూడా అంతే…జాగ్రత్త.

ఒకడు బాపట్ల లో పిచ్చి కూతలు కూశాడు. వైఎస్సార్ బిడ్డ కాబట్టి అడుగు బయట పెట్ట గలిగింది అంటున్నారు. ఒక్క నిమిషానికి నేను వైఎస్సార్ బిడ్డను కాదు అనుకుందాం. రండి ..ఎవడోస్తాడో చూద్దాం..ఎంత మంది వస్తారో చూద్దాం. మీ దమ్ము ఏంటో చూపించండి. ఎవరేంటో చూసుకుందాం. తప్పులు ఎత్తి చూపిస్తుంటే చెల్లెలు అనే ఇంగితం లేదు.

ఇదే వైఎస్సార్సీపీ కి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. వైఎస్సార్సీపీ మొక్కగా ఉన్నప్పుడు నేను నీళ్ళు పోశా..ఎరువు పెట్టా. ఇప్పుడు అది చెట్టు అయింది. చెట్టు అయ్యాక నా అవసరం లేదు అంటున్నారు. ఏ లాభం లేకుండా పార్టీ కోసం పని చేశా. పదవులు కావాలంటే నాకు కావాల్సిన పదవి తీసుకొనే దాన్ని. మీకు దమ్ముంటే రాష్ట్ర హోదా మీద పోరాటం చేయండి. ఆడబిడ్డ అని చూడకుండా తప్పుడు ప్రచారం మానండి.

గత 10 ఏళ్ల పాలన లో రాష్ట్రం 50 అడుగులు వెనక్కు వెళ్ళింది. చెప్పుకో దగ్గ ఒక్క అభివృద్ధి లేదు. పాలక పక్షానికి,ప్రతిపక్షానికి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ది లేదు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. 15 ఏళ్లు కావాలని అడిగిన చంద్రబాబు…హోదా పై మాట్లాడితే జైల్లో పెట్టించారు. 25 మంది ఎంపిలు అడిగిన జగన్ రెడ్డి హోదా పై మాట మార్చాడు.

ఇద్దరికీ బీజేపీ తో పొత్తులు కావాలి.పోటీ పడి పొత్తులు కోరుకుంటున్నారు. బీజేపీ కాళ్ళ మీద పడుతున్నారు. ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది బీజేపీ. హోదా వచ్చి ఉంటే…పరిశ్రమలు వచ్చేవి లక్షల్లో ఉద్యోగాలు వచ్చేవి.పోలవరం ప్రాజెక్ట్ కట్టి ఉంటే ఆంధ్ర సస్యశ్యామలం అయ్యేది. మన రాష్ట్రం రాజధాని ఏంటి అని అడిగితే ఏది చెప్పాలి? బాబు అమరావతి అని 3D గ్రాఫిక్స్ చూపించారు. జగన్ మూడు రాజధానులు అని కాలయాపన చేశారు. రాష్ట్ర అభివృద్ధి కి నిధులు ఇవ్వని బీజేపీ కి ఎందుకు వంగి వంగి దండాలు పెడుతున్నారు.

ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్సార్ ఆశయాల ప్రభుత్వం కాదు. వైఎస్సార్ ఆశయాలను అమలు చేసే ప్రభుత్వం కాదు. వైఎస్సార్ ఆశయాలు ఒక్కటి అమలు కావడం లేదు. పంట నష్ట పరిహారం ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం జగన్ అన్నది. వైఎస్సార్ హయాంలో రైతు రారాజు. జగన్ ఆన్న పాలన లో రైతులకు ఆత్మహత్యలు శరణ్యం.

3 వేల కోట్ల తో ప్రత్యేక నిధి రైతుల కోసం అన్నారు. 4 వేలకోట్ల తో పంట నష్టపరిహారం నిధి అన్నారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. నిరుద్యోగులను జగన్ రెడ్డి దారుణంగా మోసం చేశారు. 25 వేల డీఎస్సీ పోస్టులు అన్నారు. ముష్టి 6 వేల ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇచ్చారు. మెగా డీఎస్సీ నీ దగా డీఎస్సీ చేశారు. రాష్ట్రంలో 30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైఎస్సార్ వారసుడు అయితే జంబో డీఎస్సీ అని ఎందుకు మోసం చేశారు ?

జలయజ్ఞం వైఎస్సార్ కలల ప్రాజెక్ట్.. ఆంధ్ర కోసం 54 ప్రాజెక్ట్ లు కట్టాడు. జగన్ ముఖ్యమంత్రి అయ్యేవరకు 42 ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. 5 ఏళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అన్నారు. ఇదే నగరి కి గాలేరు – నగరి ద్వారా సాగునీరు రావాల్సి ఉంది. ప్రాజెక్ట్ పూర్తి అయి ఉంటే వేల ఎకరాల్లో సాగునీరు వచ్చేవి. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్ట్ ల్లో జగన్ ఆన్న తట్టెడు మట్టి తీయలేదు. వైఎస్సార్ వారసుడు అయితే జలయజ్ఞం ప్రాజెక్ట్ లు ఎందుకు కట్టలే ?

జగన్ పథకాలు అభివృద్ధి లో కాదు..వైన్ షాప్ లో ఉన్నాయి. స్పెషల్ స్టేటస్ రూపంలో మద్యం. మెగా డీఎస్సీ రూపంలో మద్యం. అంతా దోపిడీ రాజ్యం. నియంత పాలన. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నాడు జగన్ అన్న. కోట నుంచి ఇన్నాళ్లు బయటకు రాలేదు. మంత్రులకు,ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్ మెంట్ లు లేవు. ఎన్నికలు వచ్చాయని ఇప్పుడు సిద్ధం అంటూ బయలు దేరారు. దేనికి సిద్ధం జగన్ అన్న సమాధానం చెప్పాలి. మీరు దగా చేయడానికి సిద్ధం అయితే..మిమ్మల్ని ఇంటికి పంపడానికి జనం సిద్ధం. వైఎస్సార్ పాలన కాంగ్రెస్ తోనే సాధ్యం.

 

Leave a Reply