Suryaa.co.in

Andhra Pradesh

27 న చలో విజయవాడ

అప్పటికి స్పందించకపోతే మెరుపు సమ్మె
పీఆర్సీ కమీషన్ ఎక్కడుందో తెలీదు
పీఆర్సీ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదు
రెండు పెండింగ్ డీఏలు ప్రకటించాల్సి ఉంది జీపీఎఫ్ బిల్లులు చెల్లింపులు లేవు
ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్

విజయవాడ : ఏపీ జేఏసీ ఆద్వర్యంలో 104 ఉద్యోగ సంఘాలతో, కార్యవర్గంతో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఉద్యమకార్యాచరణ చేపట్టాలని నిర్ణయించాం. ఈనెల 14 న నల్ల బ్యాడ్జిలు ధరించి అన్ని కార్యాలయాల్లో మెమొరాండాలు సమర్పించనున్నాము.

15,16వ తేధీలలో భోజన విరామ సమయంలో నిరసన చేపట్టబోతున్నాం 17 న తాలుఖా కేంద్రాలలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించబోతున్నారు. 20 న కలెక్టరెట్ల వద్ద ధర్నా చేయబోతున్నాం. 21 నుంచి 24 వరుకు అన్ని జిల్లాల పర్యటన చేపట్టబోతున్నాం 27 న జరిగే చలో విజయవాడ చేపట్టబోతున్నాం. అప్పటికి స్పందించకపోతే ఏ నిమిషంలొ అయినా మెరుపు సమ్మె చేపడతాం.

12th పీఆర్సీ కమీషన్ ఎక్కడుందో తెలీదు. పీఆర్సీ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదు. రెండు పెండింగ్ డీఏలు ప్రకటించాల్సి ఉంది. జీపీఎఫ్ బిల్లులు చెల్లింపులు లేవు. ప్రతి నెల 1 వ తేదిన వేతనాలు, పెన్షన్ లు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయి. రేపు ప్రభుత్వంతో చర్చలు ఉన్నాయి . అవి సఫలం కాకపోతే ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తాం.

 

LEAVE A RESPONSE