Suryaa.co.in

Andhra Pradesh

స్టార్టప్స్ గమ్యస్థానంగా ఏపి

రాష్ట్రంలో మూడు రెట్లు పెరిగిన స్టార్టప్‌లు

– ఎంపీ విజయసాయిరెడ్డి

ఫిబ్రవరి: స్టార్టప్స్ కు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోందని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు..

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన, అనుకూల వాతావరణం రాష్ట్రంలో ఉండటంతో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీల ద్వారా అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. వీటి ద్వారా సాంకేతిక నిపుణులైన యువత స్వయం ఉపాధి పొందడమే కాకుండా, వేలాది మందికి ఉద్యోగాలు వస్తున్నాయని పేర్కొన్నారు.

డిపార్ట్ మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) వెల్లడించిన తాజా గణాంకాలలో 2019లో రాష్ట్రంలో 161 స్టార్టప్‌లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 586 దాటిందని తెలిపారు. వీటిలో పనిచేసే ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది. 2019లో 1,552 మంది వీటిలో పనిచేస్తుండగా, ఆ సంఖ్య ఇప్పుడు 5,669కు చేరినట్లు సంస్థ పేర్కొందని చెప్పారు.

 

LEAVE A RESPONSE