జగన్ రెడ్డీ నువ్వు ముఖ్యమంత్రివా….రాక్షసుడివా?

-బీసీ నేత అయ్యన్న కుటుంబంపై అంత కక్షెందుకు?
-పోలీసులు గోడలుదూకి, తలుపులు పగలగొట్టి అరెస్టులా?
-మాజీ మంత్రి, బీసీ నేత అయ్యన్న పాత్రుడు, కుమారుడు రాజేష్ ల అరెస్టులను తీవ్రంగా ఖండించిన టిడిపి అధనేత నారా చంద్రబాబు నాయుడు

అమరావతి:- రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక సిఎం లా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గోడలు దూకి, తలుపులు పగల గొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి, బిసి నేత అయ్యన్న పాత్రుడి ని, కుమారుడిని అరెస్టు చెయ్యడం తనకు దిగ్ర్బాంతి కలిగించిదని అన్నారు.అధికారంలో వచ్చిన నాటినుంచి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వెంటాడుతోందని…ఇప్పటికే 10కిపైగా కేసులు పెట్టారని అన్నారు.

నాడు ఇంటి నిర్మాణాలు కూల్చి వేత మొదలు…అయ్యన్న కుటుంబ సభ్యులపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. చింతకాయల విజయ్ పై కేసు విషయంలో సిఐడి విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదని అన్నారు. దొంగల్లా పోలీసులు ఇళ్లమీద పడి అరెస్టులు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు.

వైసీపీ సాగిస్తున్న ఉత్తరాంధ్ర దోపిడీ పై బిసి నేతల గళాన్ని అణిచివేసేందుకే అయ్యన్న అరెస్టు అని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ దోపిడీపై అయ్యన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కేసులు, అరెస్టులు సాగిస్తున్నారని చంద్రబాబు అన్నారు. అక్రమం గా అరెస్ట్ చేసిన అయ్యన్న పాత్రుడు, రాజేష్ లను విడుదల చేయాలని డిమాండ్ చంద్రబాబు చేశారు.