-తీర్పు వస్తే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావలసిందే
-హనీమూన్ ముగిసింది కాబట్టి.. ఇప్పుడు ఇక న్యాయం ఆశించవచ్చు
-కోర్టుకు ఎందుకు హాజరు కావడంలేదని ఎందుకని దర్యాప్తు సంస్థ ప్రశ్నించడం లేదు
-ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు అడిగినట్టు లేదు
-మొహమాటానికి అడిగితే అడగవచ్చు
-మన సామాజిక వర్గానికి న్యాయం చేయడమే… సామాజిక న్యాయం కాదు
-లక్ష్మీబాయి స్ఫూర్తితో ముందుకు వెళ్దాం
-పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన దాంట్లో తప్పేముంది?
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
కేంద్ర ప్రభుత్వంతో హనీమూన్ పీరియడ్ ముగిస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాండ్ బాజా భరాతేనని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. అప్పుల విషయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎంతటి కఠిన వైఖరిని అవలంబిస్తుందో, రేపు ఆంధ్రప్రదేశ్ సర్కార్ పట్ల కూడా అదేవిధనాన్ని అవలంబించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. లిక్కర్ కార్పొరేషన్ పేరిట ఇప్పటికే 8500 కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నారని, మరో రెండు వేల కోట్ల రూపాయలను తీసుకోబోతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 28 వేల కోట్ల రూపాయల రుణ పరిమితిని కేంద్ర ప్రభుత్వం విధించగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 38 500 కోట్ల రూపాయల రుణాలను చేసిందన్నారు. లిక్కర్ కార్పొరేషన్ పేరిట రుణాలను పొందడం రాజ్యాంగ విరుద్ధమని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ హనీమూన్ పీరియడ్ ముగిపోతున్నదని, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోను తమ పార్టీ మద్దతును అడిగినట్లు లేదని రఘురామకృష్ణంరాజు చెప్పారు. ఒక వేళ మొహమాటానికి అడిగితే అడిగి ఉండవచ్చునని అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లాలా? వెళ్ళక్కర్లేదా? అన్న ఆయన, ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నవాడు, ఎన్ని కన్నాలు వేసినట్టు అభియోగాలు ఉన్నప్పటికీ కూడా, తాను కోర్టుకు హాజరైతే ఎక్కువ ఖర్చు అవుతుందని చెబితే… వద్దమ్మా ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది… మరింత ఖర్చవుతుందని, ఇంట్లోనే కూర్చొమ్మని కోర్టు చెప్పగలదా? అంటూ ప్రశ్నించారు చెప్పదని ఆయన స్పష్టం చేశారు.
తన కేసులను వాదించే లాయర్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లిస్తున్నారని రఘురామకృష్ణంరాజు అన్నారు. సుప్రీంకోర్టు అంతర్గత మార్గదర్శకాల ప్రకారం వాదనలు విన్న తర్వాత, మూడు నెలల వ్యవధిలో కోర్టు తీర్పు ఇవ్వాలని, లేనిపక్షంలో ఆరు నెలల లోపు తీర్పును వెలువరించాలని స్పష్టంగా నిబంధనలు చెబుతున్నాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాలా?, వెళ్ళక్కర లేదా? అన్న పిటీషన్ పై వాదనలు ముగిసి ఇప్పటికే 200 రోజులు గడుస్తున్నదని చెప్పారు. అయినా కోర్టు ఇంకా తీర్పు వెలువరించలేదని, ఒకవేళ తీర్పు అంటూ వస్తే… జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరుకావాలనే తీర్పు వస్తుందని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.
కోర్టు హాజరై, నిలబడవలసి వస్తుందని అన్నారు. వ్యవస్థలన్నింటిని చాలా వరకు మ్యానేజ్ చేస్తున్నారని, కోర్టుకు వెళ్లాలా ?వద్దా? అన్న విషయాన్ని హైకోర్టు చెప్పదని, దర్యాప్తు సంస్థ ప్రశ్నించదని రఘురామ అన్నారు. ప్రస్తుతం హనీమూన్ పిరియడ్ ముగిసింది కాబట్టి న్యాయం ఆశిద్దామని ఆకాంక్షించారు. తాను వేసిన బెయిల్ రద్దు పిటిషన్ వాదనలు ముగిసి కూడా 200 రోజులైందన్న ఆయన, పిటిషన్ స్వీకరిస్తారా?, కొట్టివేస్తారా?? అన్నది ఇంకా తేల్చి చెప్పలేదన్నారు. హైకోర్టులో కొట్టివేసిన, తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని రఘురామ కృష్ణంరాజు తేల్చి చెప్పారు. హైకోర్టులో ఈ ఆర్డర్ పెండింగ్ లో ఉందని, సిబిఐ కొట్టేసిందన్నారు. సిబిఐ కోర్టు , దర్యాప్తు సంస్థ… జగన్మోహన్ రెడ్డి , కోర్టు కు ఎందుకని హాజరు కావడం లేదని ప్రశ్నించడం లేదన్న ఆయన, హనీమూన్ ముగిసింది కాబట్టి ఏం జరుగుతుందో చూద్దామన్నారు.
చెత్త కేసులను పెట్టారు…
శారీరకంగా హింసించి, శాల్తీ ని గల్లంతు చేయాలని చూశారని, చెత్త కేసులను పెట్టారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. తన ఇంటి వద్ద, రెక్కీ నిర్వహిస్తూ అనుమానాస్పదంగా కనిపించిన పోలీస్ కానిస్టేబుల్ ను, తన రక్షణ సిబ్బంది గా ఉన్న సిఆర్పిఎఫ్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులకు అప్పగించారన్నారు. అయితే సిగ్గు లేకుండా జగన్ మోహన్ రెడ్డి తనపై తప్పుడు కేసులను పెట్టించి, సిఆర్పిఎఫ్ అధికారులతో మాట్లాడి తన రక్షణ సిబ్బంది గా ఉన్న ఇద్దరిని తాత్కాలికంగా సస్పెండ్ చేయించారని చెప్పారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించారన్నారు. సిబిఐ అధికారి రాంసింగ్ విషయములోనూ ఇదే టెక్నిక్ ను ఉపయోగించే అవకాశం లేకపోలేదు అన్నారు. కుదిరితే రామ్ సింగ్ సస్పెండ్ చేయించడం, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయించే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
న్యాయ పదాధికారుల ఫోరం ఏర్పాటు చేసుకుందాం
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి, లక్ష్మీబాయిపై తప్పుడు కేసులను బనాయించారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. పదేళ్ల క్రితం ఆమె భర్త చనిపోతే, గత ప్రభుత్వ హయాంలో పింఛన్ వచ్చేదని, కానీ వీళ్ళు తీసివేశారన్నారు. దానితో ఆమెకు వచ్చిన భాషలో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే, నాలుగు లిక్కర్ సీసాలు తెచ్చి లక్ష్మీబాయి పొలంలో పెట్టి… పాత సినిమాలో రాజనాల టెక్నిక్ ఉపయోగించి, కేసులు బనాయించడం ఏమిటంటే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏమైనా మధ్య నిషేధం అమల్లో ఉందా? అంటూ ప్రశ్నించారు.
దానికి బదులు ఆమె కష్టాన్ని చూసి ముఖ్యమంత్రి స్పందించారని… లేకపోతే ఆ రెడ్డి, ఈ రెడ్డి స్పందించారని చెప్పి ఉంటే ఎంత బాగుండేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పెద్దలు ఎప్పుడు కేసులను బనాయిస్తారొనని ప్రజలే కాదు, ప్రతిపక్ష నేతలు కూడా హడలిపోతున్నారన్నారు. దొంగ పోలీసులను పురమాయించి తీసుకువెళ్లి చంపేసే అవకాశాలు లేకపోలేదన్నారు. లక్ష్మీబాయి స్ఫూర్తితో ముందుకు వెళ్దాం అన్నా ఆయన, అందరికీ అంత ధైర్యం ఉండదు కదా అన్నారు. అందుకే దొంగ కేసులను ఎదుర్కోవడానికి న్యాయపదాధికారుల ఫోరం ఏర్పాటు చేసుకుందామని చెప్పారు.
తప్పుడు కేసులు పెట్టిన వెంటనే, పగడ్బందీగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. పోలీసులు ఎలాగో ఫిర్యాదులను స్వీకరించారని, న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రైవేటు కేసు పెడదామని చెప్పారు. తాను కూడా తన పై దాడి చేసిన పోలీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రైవేటు కేసు పెట్టడానికి పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఓ పదిమంది తప్పుడు అధికారులకు శిక్షపడేలా చూస్తే, మిగతా అధికారులకు బుద్ధి వస్తుందన్నారు.
పవన్ కళ్యాణ్ కి తప్ప… ఇతరులకు సాధ్యం కాదు
ప్రధానమంత్రి హాజరవుతున్న సభకు ఆహ్వానం అందిన, స్థానిక ఎంపీకి ఆహ్వానం అందలేదన్న కారణంగా సభకు వెళ్లకుండా ఉండాలన్న నిర్ణయం తీసుకోవడం మామూలు ధైర్యవంతులకు సాధ్యం కాదని, ఆ ధైర్యం… పవన్ కళ్యాణ్ కి ఉన్నదని రఘురామకృష్ణం రాజు అన్నారు. కష్టాలలో ఉన్న వారికి, ఓదార్పు ఒక్క మాటైనా ఎంతో స్వాంతన చేకూర్చుతున్నాదని, గతంలో తనకు చంద్రబాబు నాయుడు మాటలు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాటలు ఎంతో ఓదార్పునిచ్చాయని చెప్పారు.
సొంత నియోజకవర్గంలో ప్రధాని సభ జరుగుతుండగా కొంతమంది చేసిన కుట్రలకు వెళ్లలేదన్న బాధలో తాను ఉన్నానన్నారు. అయితే ఆ సభ కు తనకు ఆహ్వానం అందలేదన్న కారణంగానే పవన్ కళ్యాణ్ , హాజరు కాలేదని చెప్పిన ప్రెస్ మీట్ వీడియో క్లిప్పింగ్ ను తాను 20 సార్లు చూశానని చెప్పారు. తన స్టేటస్ గా కూడా పెట్టుకున్నానని వెల్లడించారు. తాను ప్రెస్ మీట్ మాట్లాడిన వీడియోలను కూడా చూడనని, ఎవరైనా మాట్లాడితే ఒకటి రెండు సార్లు చూస్తానని, అటువంటిది పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోను మాత్రం 20 సార్లు చూశానని చెప్పారు.
అలాగే రచ్చబండ కార్యక్రమంలో తాను మాట్లాడిన అంశాలను ఆయన స్పృశించిన పేరు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇలాగే కొనసాగనిస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్న పవన్ కళ్యాణ్ మాటలు అక్షర సత్యాలని పేర్కొన్నారు. పార్టీలు వేరైనా ధైర్యవంతుణ్ణి ధైర్యవంతుడని చెప్పడానికి, తనకు ధైర్యం ఉన్నదని అన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికలలో పోటీ చేశారని, రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
గుండెలు తీసిన బంటులు కావాలి
రాష్ట్రంలో 30 వేల టర్నోవర్ కలిగిన మద్యం అమ్మకాలను నగదు చెల్లింపుల ద్వారా విక్రయిస్తూ తమది మచ్చలేని పరిపాలన, అవినీతి రైత పరిపాలన అని చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలని, గుండెలు తీసిన బంటులు కావాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం సేవిస్తే చనిపోతారని కేంద్రానికి ఫిర్యాదు చేసింది తానే నని, మద్యం శాంపిల్స్ కూడా అందజేశానని తెలిపారు. అయితే లక్ష్మీదేవి ముందు ఓడిపోయామని, నిజాలు త్వరలోనే బయటికి వస్తాయన్నారు. రాష్ట్రంలో మద్యం సేవించి 5000 మంది మృతి చెందినట్లుగా పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారని, అయితే ఆ సంఖ్య లక్షల్లో ఉండే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తయారవుతున్న మధ్యలో రంగు, రుచి ,వాసన కోసం ఆర్టిఫిషియల్ కెమికల్స్ కలిపి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.
ఎన్ని మార్లు ప్రశ్నించిన సమాధానం చెప్పరు?
రాష్ట్రంలో డిస్టలరీను నిర్వహిస్తున్న నిర్వాహకులు ఎవరు అని ఎన్ని మార్లు ప్రశ్నించిన, ప్రభుత్వ పెద్దల నుండి సమాధానం లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఆడాన్ డిస్టలరీ నీ అల్లుడుదని అందరూ అంటున్నారని, నీదని ఎవరు అనడం లేదని విజయసాయి రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆడాన్ డిస్టలరీ కంపెనీ డిస్టలరీలను లీజు తీసుకున్నదో చెప్పాలన్నారు. ఊరు పేరు లేని బ్రాండ్లను తయారు చేస్తూ, రాష్ట్రంలో మద్యాన్ని నగదు రూపంలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నది నిజం కాదా? అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే తప్ప అని రఘురామ కృష్ణంరాజు నిలదీశారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలను తప్పేమున్నదని, అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కథనాలలో అబద్ధం ఏమున్నది… పలానా విషయంలో తప్పు ఉండదని చెబితే అంగీకరించడానికి సిద్ధమన్నారు. విజయసాయిరెడ్డి తండ్రి యావజ్జీవకారాగార శిక్ష అనుభవించిన ఖైదీ అని తాను పేర్కొన్నానని, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, ప్రశ్నిస్తే తప్పుడు కేసులు బనాయిస్తామంటే కుదరదని రఘురామకృష్ణం రాజు అన్నారు.