Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్ మాట ఇచ్చాడంటే ..నెర‌వేర్చి తీర్చుతాడు

– ముస్లిం మైనారిటీ హ‌మీద్‌బాషా ఆటోని సీజ్ చేయించిన మంత్రి రోజా
– కొత్త ఆటో కొని బాషాకి కానుక‌గా అంద‌జేసిన నారా లోకేష్‌

నారా లోకేష్ మాట ఇచ్చాడంటే, నెర‌వేర్చి తీర్చుతాడు అని ప్ర‌జ‌ల్లో ముద్ర ప‌డిపోయింది. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో త‌న నాయ‌క‌త్వ ప‌టిమ‌ని నిరూపించుకున్న లోకేష్, అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇచ్చిన మాట‌ని త‌ప్ప‌కుండా, చెప్పిన స‌మ‌యం కంటే ముందే నెర‌వేర్చుతూ వెళుతూ శెహ‌భాష్ లోకేష్ అనిపించుకుంటున్నారు. మంత్రి అయి ఉండి నిరుపేద ముస్లిం ఉపాధి ఆధార‌మైన ఆటోని రోజా సీజ్ చేయిస్తే, కొత్త ఆటో కొని ఉపాధికి ఊతం ఇచ్చారు నారా లోకేష్.

లోకేష్‌కి చీర గాజులు పంపుతాన‌ని ప‌దేప‌దే మ‌హిళ‌ల‌ని అవ‌మానిస్తున్న మంత్రి రోజాకి చీర‌,గాజులు విలువ తెలియ‌జెప్పేందుకు సారె ప‌ట్టుకుని వెళ్లారు తెలుగు మ‌హిళ‌లు. వీరిని తీసుకెళ్లాడ‌నే కార‌ణంతో నగరి చెందిన ఆటో డ్రైవర్ హమీద్ బాషా ఆటోని మంత్రి రోజా ఆదేశాల‌తో పోలీసులు సీజ్ చేశారు. పాద‌యాత్ర‌లో లోకేష్ ని క‌లిసి త‌న జీవ‌నోపాధిని కోల్పోయానంటూ హమీద్ బాషా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ రోజే “నీకు న‌చ్చిన ఆటో సెలెక్ట్ చేసుకో కొని ఇస్తాను“ అని హామీ ఇచ్చారు నారా లోకేష్‌. హ‌మీద్ బాషా కోరిన ఆటోని వారంలోగా అంద‌జేశారు. కొత్త ఆటోని త‌న‌కి కానుక‌గా ఇచ్చిన లోకేష్‌కి హమీద్ బాషా, ఆయన కుటుంబ సభ్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

LEAVE A RESPONSE