– మాజీ శాసన మండలి సభ్యులు టిడి జనార్దన్
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై వైసీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. జాతీయ పార్టీ నేతలకు కూడా రక్షణ కరువైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ నాయకులకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇది ఆంధ్రప్రదేశ్లో దిగజారిని శాంతిభద్రతల పరిస్థితిని సూచిస్తోంది. సత్యకుమార్పై దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి.