Suryaa.co.in

Telangana

ఒవైసీకి దమ్ము ఉంటే పిఎఫ్‌ఐ ఆగడాలను ఖండించాలి…గోరక్షకులపై కాదు

భజరంగ్ దళ్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ శివరాములు

హైదరాబాద్ పార్లమెంట్ ప్రజాప్రతినిధి అయి ఉండి అసదుద్దీన్ ఓవైసీ గోరక్షకులను కించపరుస్తూ మాట్లాడడం సమంజసం కాదు..గోరక్షకుల వలనే ఆవులు రక్షించబడుతున్నాయి. ఓ వర్గం ప్రతిరోజు వేల ఆవులను హతమారుస్తున్నారు కానీ వాటి గురించి మాట్లాడకుండా గోరక్షకుల పై ట్విట్టర్ ద్వారా పిచ్చి ఆలపన చేయడం ఆయన రాజకీయ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఇలాంటి పిచ్చి కూతలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని భజరంగ్ దళ్ తీవ్రంగా హెచ్చరిస్తుందన్నారు. గత పదిహేను రోజుల నుండి NIA, ED పిఎఫ్‌ఐI పై ఉగ్రవాద సంస్థల ఆఫీసులపై సోదాలు నిర్వహిస్తుంటే పిఎఫ్‌ఐ పై మాట్లాడకుండా మీనవేషాలు చేయడం సరికాదన్నారు. ఒవైసీకి దమ్ము ఉంటే దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రణాళికలు వేసిన పిఎఫ్‌ఐని ఆగడాలను ఖండించాలని పేర్కొన్నారు. పిఎఫ్‌ఐI సభ్యుల పేర్లు బయట పడుతున్నాయి కాబట్టి ..ఈ విషయాన్ని పక్క దారిన పట్టించడానికి తను ట్విట్టర్ వేదికగా పిచ్చి కూతలు కూస్తున్నారని తెలిపారు.

LEAVE A RESPONSE