Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రి ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అంటుంటే.. ప్రజలంతా ముక్తకంఠంతో ‘ఏపీ హేట్స్ జగన్’ అంటున్నారు

• నాలుగున్నరేళ్లు అహంకారంతో, అధికారమదంతో జగన్ సాగించిన దుర్మార్గ, దుశ్చర్య పాలనను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు
• ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి పేదల జీవితాలు తలకిందులైతే.. రాష్ట్రం రావణ కాష్టమైంది
• తాను పేదవాడిని… దళిత బంధువుని.. బీసీల పెన్నిధిని అంటున్న జగన్ మాటలన్నీ ఎన్నికల జిమ్మిక్కులే
• గతంలో జగన్ ‘నువ్వే మా నమ్మకం జగనన్న’ అంటే ప్రజలు ‘నిన్ను నమ్మం జగనన్న’ అన్నారు
• గడపగడపకు అంటే జనం ఛీకొట్టారని ఇప్పుడు జగన్ బస్సుయాత్రలు అంటున్నాడు
• జగన్ పొర్లు దండాలయాత్ర చేసినా ప్రజలు అతన్ని, వైసీపీని నమ్మరు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు

నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని అవినీతికూపంగా మార్చి, పేదల జీవితాలను తలకిం దులుగా చేసిన జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోలే రని, అందుకే ఏపీ జనమంతా ‘వుయ్ హేట్స్ జగన్’ అని నినదిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ జగన్ రెడ్డి, మంత్రులు, వైసీపీ నేతలు ‘మొన్నటి వరకు నువ్వే మా నమ్మకం జగనన్న’ అని అంటే ప్రజలేమో మేం ‘నిన్ను నమ్మం జగనన్న’ అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి… ఆయన పరివారం ‘వై ఏపీ నీడ్స్ జగన్‘ అనే కొత్త స్లోగన్ మొదలెడితే.. ఏపీ ప్రజలంతా మూకుమ్మడిగా ‘వుయ్ హేట్స్ జగన్’ అంటున్నారు. జగన్ రెడ్డి డబ్బు పిచ్చితో తమ జీవితాలు తలకిందులు అయ్యాయని, అతని కక్షలు.. కుట్రలతో రాష్ట్రాని కి భవిష్యత్తే లేదని వాపోతున్నారు. వైసీపీ జనరల్ బాడీ సమావేశంలో జగన్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే.

ప్రజల రాజధాని అమరావతిని నాశనం చేసిన జగన్ రె డ్డి.. నాలుగున్నరేళ్లలో ఒక్క రాజధానిలో కనీసం రోడ్లు కూడా వేయలేని అసమర్థుడు మూడు రాజధానులు కడతాడా? ఈ నాలుగున్నరేళ్లలో జగన్ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క ఇటుకవేసి ఒక్క నిర్మాణం చేశాడా? ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసి.. ఒక్క ఎకరాకైనా నీళ్లిచ్చాడా? నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి పేదల జీవితాలను తలకిందులు చేశాడు.

600లకు పైగా హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చని ముఖ్యమంత్రిగా జగన్ రికార్డుల కెక్కాడు
పాదయాత్రలో గానీ… ఎన్నికల ప్రచారంలో గానీ జగన్ రెడ్డి ప్రజలకు 600లకు పైగా హామీలిచ్చి… అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చని ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కాడు. చంద్రబాబు రూ.2వేలు ఇచ్చే పింఛన్ ను తాను అధికారంలోకి వస్తే.. రూ.3వేలు చేస్తానన్న హామీని జగన్ రెడ్డి నెరవేర్చాడా? నాలుగున్నరేళ్లలో రూ.3వేలు ఇవ్వడం చేతగాని అసమర్థుడు.

వచ్చే జనవరిలో పెంచుతానంటున్నాడు. రూ.1000 లు పింఛన్ పెంచడానికి జగన్ రెడ్డికి 5ఏళ్లు పట్టింది. అమ్మఒడి..చేయూత.. రైతు భరో సా.. కాపు నేస్తం అన్నాడు. ఆయా పథకాలన్నీ నూటికి నూరుశాతం సమర్థవంతంగా అమలవుతున్నాయా? అసలైన అర్హులకు న్యాయం చేశానని జగన్ రెడ్డి నిరూపించగ లడా? తాను చెప్పిన నవరత్నాలనే పథకాలు 100లో 10శాతం మందికే అమలయ్యా యి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జగన్ రెడ్డి చేసిన మోసాలకు అంతే ఉండదు.

నాలుగేళ్లలో రూ.10.50లక్షల కోట్ల అప్పుల చేసిన జగన్.. 8లక్షలకోట్లకు ఎందుకు లెక్కలు చెప్పడు?
రాష్ట్రాన్ని అప్పులఊబిలో ముంచి, నాలుగేళ్లలో రూ.10.50లక్షల కోట్ల అప్పులు తెచ్చాడు. రూ.2.35లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు ఇచ్చానని గొప్పలు చెబుతు న్న జగన్ రెడ్డి మిగిలిన రూ.8లక్షల కోట్లు ఏమయ్యాయో ఎందుకు చెప్పడు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఆదుకోవడానికి వర్గాల వారీగా టీడీపీప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లను.. వాటికి కేటాయించిన వేలకోట్లను జగన్ రెడ్డి నీరుగార్చాడు.

అధికారంలోకి వచ్చీ రాగానే అన్ని కార్పొరేషన్లు మూయించేసి, ఆయా వర్గాల ప్రజల నోట్లో మట్టికొట్టాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన 125కు పైగా పథకాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిపోతాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ.1,14,000కోట్లు దారిమళ్లించిన ఘనుడు జగన్ రెడ్డి. ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఉండి ఇంత తక్కువ సమయంలో భారతదేశంలో అన్నివర్గాల ప్రజల్ని మోసం చేసిన ఏకైక వ్యక్తిగా కూడా జగన్ రికార్డు ల్లో నిలుస్తాడు.

బస్సుయాత్ర కాదు.. పొర్లు దండాల యాత్ర చేసినా జగన్ ను ప్రజలు నమ్మరు
విద్య, వైద్య రంగాల గురించి ముఖ్యమంత్రి గొప్పలు చెప్పడం తప్ప.. వాస్తవంలో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఆసుపత్రుల్లో మందులు.. వైద్యసిబ్బందిని నియమిం చలేడు గానీ.. జగనన్న సురక్షతో ప్రజల్ని ఉద్ధరిస్తానని డబ్బాలు కొడుతున్నాడు. నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఎక్కడైనా ఎలాంటి కొర్రీలు లేకుండా ఆరోగ్యశ్రీ అమల వుతోందని జగన్ చెప్పగలడా? ఆరోగ్య శ్రీ చికిత్సల బిల్లులను ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వం సక్రమంగా ఆసుపత్రులకు చెల్లిస్తోందా?

చంద్రబాబు హాయాంలో వందలాది జబ్బులకు నాణ్యమైన వైద్యసేవలు అందించిన కార్పొరేట్ ఆసుపత్రులన్నీ నేడు జగన్ దయతో ఆరోగ్యశ్రీ అంటేనే హడలెత్తుతున్నాయి. నాడు-నేడు పేరుతో ప్రజలకు అందు బాటులో ఉండే ప్రాథమిక పాఠశాలల్ని లేకుండా చేశాడు. పబ్లిసిటీ పిచ్చితో పాఠశా లలకు రంగులేసి.. విద్యార్థుల జీవితాల్లో చీకట్లు నింపాడు. గడపగడపకు అని ప్రజల ముందుకు వెళ్తే ఛీకొట్టారనే జగన్.. ఇప్పుడు కొత్తగా బస్సుయాత్ర అంటున్నాడు. బస్సులో ఉండి చేతులూపితే ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నాడు. జగన్ పొర్లు దండాల యాత్రచేసినా ప్రజలు అతన్ని..అతని పార్టీని నమ్మరు. ఇవన్నీ భరించాకే ప్రజలంతా ఒకే మాట అంటున్నారు.. ‘వుయ్ హేట్స్ జగన్’ అని.

జగన్ పేదవాడైతే… దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా ఎలా నిలిచాడు? ఏడీఆర్ సర్వేపై ఏం కట్టుకథలు చెబుతాడు?
తాను పేదవాడిని అంటున్న జగన్ రెడ్డి ఏడీఆర్ సర్వేపై ఏం సమాధానం చెబుతాడు? దేశంలోని ముఖ్యమంత్రులందరికంటే జగన్మోహన్ రెడ్డే అత్యధిక ధనవంతుడని తేల్చిన ఏడీఆర్ నివేదిక ముఖ్యమంత్రికి కనిపించడంలేదా? దేశంలో మొత్తం 29రాష్ట్రాలుంటే.. 28 ముఖ్యమంత్రుల వద్ద ఉన్న సంపద కంటే జగన్ రెడ్డి సంపదే ఎక్కువని ఒక పక్క చెబుతుంటే.. తానే పేదవాడినని ఆయన చెప్పడం ప్రజలను వంచించడం కాదా?

కేవ లం ప్రజల్ని మోసగించడానికే తాను పేదవాడినంటున్నాడు. జగన్ రెడ్డికి 60 షెల్ కంపెనీలు ఉన్నది నిజంకాదా.. వేలాది ఎకరాల భూములు తన బినామీల పేరుతో ఉన్నది నిజం కాదా? బెంగుళూరు..చెన్నై..ఇడుపులపాయ.. హైదరాబాద్ లలో వేల కోట్ల విలువైన రాజభవనాలు జగన్ రెడ్డివి కావా? నాలుగున్నరేళ్లలో లక్షలకోట్లు కొట్టేసి ఆ సొమ్ముని లండన్లో భద్రపరిచింది నిజం కాదా? ఇలాంటి వ్యక్తి పేదవాడా? ఇలాంటి కట్టుకథలతో ఇంకా ఎందరి గొంతులు కోస్తావు జగన్ రెడ్డి?

దళితుల్ని చంపినవాళ్లను అక్కున చేర్చుకునే జగన్ కు.. దళితుల గురించి మాట్లాడే హక్కులేదు
దళితుడిని దారుణంగా చంపిన తనపార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుని తన పక్కన కూర్చోబెట్టుకునే జగన్ రెడ్డికి దళితుల గురించి మాట్లాడే హక్కులేదు. నాలుగున్నరేళ్ల లో దళితులే లక్ష్యంగా దాడులు… వేధింపులు.. అవమానాలు.. హత్యలు.. అత్యాచారా లు జరిపించిన జగన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని వాళ్ల ప్రస్తావన తెస్తున్నాడు? తన దుర్మార్గపు ప్రభుత్వంలో దగాపడిన ఒక్క దళిత కుటుంబాన్ని అయినా జగన్ ఆదుకున్నాడా?

జగన్ రెడ్డి దుర్మార్గాలు.. దోపిడీ.. రాజకీయ కక్షతో రాష్ట్రం రావణకాష్టమైంది
ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సంపూర్ణంగా మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన జగన్ .. నాలుగున్నరేళ్లలో తన డబ్బుపిచ్చితో కల్తీ మద్యం అధికధరకు అమ్మిస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది నిజంకాదా? తాళిబొట్లు తెగిన ఆడవాళ్లందరూ జగన్ జే బ్రాండ్ మద్యంతో రోడ్డున పడింది నిజంకాదా? తన డబ్పుపిచ్చితో ఇసుకను లూఠీ చేసి నాలుగేళ్లలో రూ.40వేలకోట్లు దోచేసింది నిజంకాదా? 8సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.50వేలకోట్లకు పైగాభారాన్ని ప్రజలపై మోపింది జగన్ కాదా?

స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేసి.. ఉన్న పరిశ్రమల్ని ఇతర రాష్ట్రాలకు తరిమేసి యువతకు ఉపాధి లేకుండా చేసింది ఈ ముఖ్యమంత్రి కాదా? చంద్రబాబు హాయాంలో లక్షలకోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు చేసుకున్న అనేక ప్రముఖ కంపెనీలు రాష్ట్రం వదిలి పారిపోయింది నిజం కాదా? నాలుగున్నరేళ్లుగా జగన్ రెడ్డి అహంకారంతో అధికారమదంతో సాగించిన దుర్మార్గాలు.. దుశ్చర్యలను భరించిన ప్రజలంతా విసిగి వేసారి ‘ఏపీ హేట్స్ జగన్… వుయ్ హేట్ జగన్’ అని ముక్తకంఠంతో నినదిస్తున్నారు.

జగన్ రెడ్డి నాలుగేళ్లలో సాగించిన దుర్మార్గాలు.. దోపిడీలు.. రాజకీయ కక్షతో రాష్ట్రమే రావణ కాష్టమైంది. జగన్ లాంటి అవినీతిపరులు పాలకులు అయినందునే చంద్రబాబు లాంటి నిజాయితీపరులు జైలుకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చిం ది. జగన్ కు ప్రజల్ని ఓట్లు అడిగే అర్హతే లేదు” అని బొండా ఉమా తేల్చి చెప్పారు.

LEAVE A RESPONSE