ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్
అమరావతి: శాసన సభలో రూల్స్ అతిక్రమించిన సభ్యులపై శిక్షలు కఠినంగా ఉంటేనే సభ సజావుగా సాగుతుందని ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో స్పీకర్, వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబుపై జరిగిన దాడిని ఆర్థర్ తీవ్రంగా ఖండించారు. ఆర్థర్ మాట్లాడుతూ.. ఆ రోజు పరిపాలించిన రాజులు.. ఏ రాజ్యంలోనైనా ప్రజలు సుఖసంతోషాలతో ఉండేవారు. ఇందుకు కారణం ఏంటంటే రాజులు ప్రజల పట్ల తప్పుగా వ్యవహరిస్తే అలాంటి వారిని కఠినంగా శిక్షించేవారు. ప్రజలకు భరోసానిచ్చి రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచేవారు. తండ్రి శిక్షించని కుమారుడు వృద్ధిలోకి రాడని పవిత్ర గ్రంధంలో ఉంది. ఈ నాలుగేళ్లలో టీడీపీ నేతల ప్రవర్తన జుగుప్సకరంగా ఉంది. తాను కూడా అడిషనల్ ఎస్సీ కేడర్‌లో రెండున్నరేళ్లు ఛీప్ మార్షల్‌గా పని చేశాను. ఇక్కడ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. వీళ్ల ప్రవర్తన ఆ రోజు గమనించాను. స్పీకర్‌ను హౌస్‌లోకి రాకుండా అడ్డుకున్నారు. రాత్రంతా సభలోనే గడిపారు.
ఇలాంటి చరిత్ర టీడీపీది. ఈ సెషన్‌లో అందరూ మిమ్మల్ని చాలా మారిపోయారని స్పీకర్ గురించి అంటున్నారు. శిక్షలు కఠినంగా ఉంటేనే సభ సజావుగా సాగుతుంది. రూల్స్ సభలోనే కాదు..అసెంబ్లీ ప్రాంగణంలో కూడా ఏ పార్టీ కూడా నిరసన తెలపకూడదని రూల్స్‌లో ఉంది. అలాంటిది ప్రతి రోజు టీడీపీ నేతలు వెల్ లోకి దూసుకువచ్చి స్పీకర్‌పై దాడికి పాల్పడుతున్నారు. అయినా స్పీకర్ ఇంత సహనంగా వ్యవహరిస్తున్నా..టీడీపీ నేతల తీరు మారడం లేదు. ప్రజలు అసెంబ్లీ సమావేశాలను ఆసక్తిగా చూస్తుంటారు. ఇవాళ సభను జరుగకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. వారు కనిపించేందుకు స్పీకర్ పోడియాన్ని వేదికగా వాడుకుంటున్నారు.
ఈ రోజు మీపై దాడికి పాల్పడేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించగా ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన్ను బలవంతంగా టీడీపీ సభ్యులు తోసివేయడంతో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. మిమ్మల్ని కాపాడేందుకు వచ్చిన ఎమ్మెల్యేపై దాడి చేస్తారా? ప్రతి రోజు ఏకైక టీడీపీ ఎస్సీ సభ్యుడిని ముందుకు తోయడం..సభను అడ్డుకోవడం విచారకరం. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో..అలాగే ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. స్పీకర్ సంయమనం పాటించడం మానుకోని, పాత స్పీకర్‌గానే కఠినంగా ఉండాలి. స్పీకర్ బుద్ధిడిగా మారవద్దు..పులిలాగే ఉండాలి. ఈ రోజు సభలో జరిగిన ఘటనపై స్పీకర్ సీసీ పుటేజీలు పరిశీలించి టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై జరిగిన దాడిని ఆర్థర్ తీవ్రంగా ఖండించారు.