Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రం బాగుంటేనే మీ బతుకులు బాగుంటాయి

– దొంగల్లా వైసీపీ వాళ్లు రాళ్లు విసిరారని మండిపడ్డ చంద్రబాబు
– రానున్న రోజుల్లో జగన్ కోడికత్తి లాంటి డ్రామాలు చాలా ఆడుతాడు
– మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరితాళ్లు వేస్తున్నాడు
ఉత్తరాంధ్ర భూములు తాకట్టి పెట్టి 23 వేల కోట్లు అప్పు చేశాడు
జగన్ తండ్రి పేరుతో జిల్లా పేరు ఉంటే మేము మార్చామా?
– వేల సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు
– తన రోడ్ షో లో కాన్వాయ్ పై రాయి విసిరిన ఘటనపై చంద్రబాబు ఆగ్రహం
– నందిగామలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో

అక్రమ కేసులు, దాడులతో రాజ్యం చేయాలని అధికార వైసిపి చూస్తోంది.కేసులు, దాడులకు భయపడే పార్టీ కాదు టిడిపి. కేసులు పెడితే ఎన్ని పెడతారు..ఇంటికొక కేసు పెడతారా? అయ్యన్న పై తప్పుడు కేసు పెడితే ఏమయ్యింది.?రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం రావాలి అంటే మళ్లీ టిడిపి జెండా ఎగరాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు అంతా కలిసి రావాలి. విభజన జరిగిన తరువాత రాష్ట్రాన్ని గాడిన పెట్టాను.నాది విజన్…వైసిపిది విధ్వంసం.హైదరాబాద్ లో నాడు వేసిన ఫౌడేషన్ తో సంపద సృష్టి జరిగింది.దీని వల్ల పేదలు లబ్ది పొందే పరిస్థితి వచ్చింది.రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పులు చేసిన సీఎం ఇప్పుడు ఉన్న సిఎం జగన్ రెడ్డి. ఈ అప్పులు ఎవరు కడతారు…జగన్ కడతారా….మనమే కట్టాలి.

ఉత్తరాంధ్ర భూములు తాకట్టి పెట్టి 23 వేల కోట్లు అప్పు చేశాడు. ఇలాంటి పెద్దమనిషి ఉత్తరాంధ్రను అభివృద్ది చేస్తారా? పెన్షన్ 200నుంచి 2000 చేసింది తెలుగు దేశం పార్టీ. నందిగామలో సుబాబుల్ రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు.సుబాబుల్ టన్నుకు 5 వేలు ఇస్తాను అన్న జగన్ ఇచ్చాడా? నందిగామలోcbn1 ఎమ్మెల్యే, సోదరులు ఇసుకలో దోచుకుంటున్నారు.పాదయాత్రలో ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు కనిపిస్తున్నాడా? కాకినాడ కు చెందిన ఆరుద్ర అనే మహిళ కూతురు వైద్యం కోసం చాలా ఇబ్బంది పడింది. 1000 కంటే ఎక్కువ ఖర్చు అయితే వైద్యం మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది అన్నారు..ఎక్కడైనా అమలు అవుతుందా?

వైద్యం కోసం ఆ మహిళ ఇంటిని అమ్ముకుంటాను అంటే కూడా మంత్రి మనుషులు అడ్డుపడ్డారు. తన బాధ చెప్పుకునేందుకు తాడేపల్లి సిఎం ఇంటికి వచ్చింది ఆ మహిళ. సిఎంను కలవనీయకపోవడంతో తాను చేయికోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకుంది. ఈ ముఖ్యమంత్రి కి మానవత్వం ఉందా…ఇలాంటిcbn2 ముఖ్యమంత్రి మనకు కావాలా?రాష్ట్రంలో ఎక్కువ నష్టపోయిన వర్గం రైతాంగం.మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరితాళ్లు వేస్తున్నాడు. ముక్త్యాల లిఫ్ట్ స్కీం ఏమయ్యింది. టిడిపి హయాంలో మొదలు పెట్టిన పథకం ఏమయ్యింది?

అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసింది….పది మందికి అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ ఎందుకు మూసేశారు? జగన్ తండ్రి పేరుతో జిల్లా పేరు ఉంటే మేము మార్చామా….కానీ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు జగన్ మార్చాడు. వైఎస్ ఆర్ విగ్రహాలు ఉంటే మేం తొలగించామా…మేము ఆ నాడు ఇలాగే వ్యవహరించి ఉంటే ఎలా ఉండేది? రాష్ట్రంలో జగన్ పాలనలో ఉపాధి లేదు….ఉద్యోగాలు లేవు…పరిశ్రమలు లేవు.

టీచర్లు ఉద్యోగాలు, ఐటి ఉద్యోగాలు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ.పోలీసులకు చట్టాలు ఉంటాయి….వాళ్లు గుర్తుపెట్టుకోవాలి. కనీసం పోలీసుల బకాయిలు కూడా చెల్లించని ప్రభుత్వం ఈ ప్రభుత్వం.జగన్ బటన్ ఇన్ కార్యక్రమం పెట్టుకున్నాడు. సాయంత్రం అవ్వగానే తన ఆదాయం పై లెక్కలు మొదలు పెడతాడు.

మద్యం మొదలు అన్నింటా అక్రమార్జన చేస్తున్నాడు. రానున్న రోజుల్లో జగన్ కోడికత్తి లాంటి డ్రామాలు చాలా ఆడుతాడు…మనం అలెర్ట్ గా ఉండాలి. నేను ఈ రోజు పరితపించేది నాకోసం కాదు…రాష్ట్రాన్ని బాగు చేసేందుకు నా ఆలోచన రాష్ట్రం బాగుంటేనే మీ బతుకులు బాగుంటాయి. రానున్న ఎన్నికల్లో వైసీపీ ని చిత్తు చిత్తుగా ఓడించాలి అని నేను పిలుపునిస్తున్నాను.

LEAVE A RESPONSE