Suryaa.co.in

Andhra Pradesh

బాధితులకు అండగా నిలిస్తే కేసులు పెడతారా?

-మహిళలపై వైసీపీ మూకల దాడి హేయం
-రాష్ట్రంలో ఆటవిక పాలన
-బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్‌

విశాఖ ఘటనను ఏపీ బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్‌ సోమవారం ఒక ప్రకటనలో ఖండిరచారు. ఎన్నికలలో విశాఖ పట్టణం ఉత్తర అసెంబ్లీ నియో జకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు, అలాగే టీడీపీ పార్లమెంట్‌ అభ్యర్థి భరత్‌కు ఓటు వేశారన్న అక్కస్సుతో విచక్షణ రహితంగా ఒక గృహంలోకి చొరబడి మహిళలపై, బాలింతరాలిపై పైశాచికంగా వైకాపా మద్దతుదారులు దాడి చేశారన్నారు. దారుణానికి ఒడిగట్టిన వారి మీద చర్యలు అటుంచి బాధితులకు అండగా నిలిచిన బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు, ఆ దారుణాన్ని ప్రజల ముందు ఉంచిన ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా వారికి 41ఏ నోటీసులు ఇవ్వడం ఆటవిక న్యాయమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇంకా పోలీసు శాఖలో కొంతమంది జగన్‌ తొత్తులుగా వ్యవహరిస్తున్నారనిపిస్తుంది.

తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య ఉదంతం అనంతరం విశాఖలో కూడా అలాంటి వ్యవహారమే నడుస్తుందా అనే అనుమానం వస్తుందన్నారు. పాత కుటుంబ కలహాలుగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో పులివర్తి నానిపై దాడి చేసి ఆ దాడిని బాధితులపై నెపం నెట్టే ప్రయత్నం చేశారని, అలాగే భీమిలీలో తమకు ఓటు వేయలేదని ఒక కుటుంబంపై వైకాపా మూకల ఆధ్వర్యంలో దాడి కుట్ర చేశారని గుర్తు చేశారు. పాత్రధారులను గుర్తించి బాధితులకు న్యాయం చేయాలని, దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

LEAVE A RESPONSE