– మీరు ఇటుకతో కొడితే మేము రాయితో కొడ తాం
– వెధవల్లారా ..పోలీసులు ఎక్కడ పనిచేస్తున్నారు?
– గాంధీ భవన్ లో గాడ్సేలు మాట్లాడుతున్నారు
– పేపర్ పేరు మార్చుకోవాలని బిఆర్ఎస్ చెప్పడం తప్పు ఎట్లా అవుతుంది?
– పీడీ యాక్ట్ పెట్టాలని పోలీసులకు చెప్పడానికి మైనంపల్లి రోహిత్ ఏమైనా పోలీసా ?
– బిఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
హైదరాబాద్: గాంధీ భవన్ లో గాడ్సేలు మాట్లాడుతున్నారు. వెధవల్లారా .. పోలీసులు ఎక్కడ పనిచేస్తున్నారు? ఖమ్మంలో హరీష్ రావు కాన్వాయ్ పై దాడి జరిగితే ఎఫ్.ఐ.ఆర్ చేయలేదు. గాడ్సే మాటలు బంద్ చేయండి. బట్టలు విప్పి కొడతామంటే మేమే వచ్చి మీ బట్టలు విప్పుతాం. రౌడీ షీట్లు పెట్టి పోలీస్ స్టేషన్ లో బట్టలు విప్పి కొట్టింది మర్చిపోయారా?
ఫోన్ ట్యాప్ జరుగుతోంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోము. మేము అధికారంలో వున్నప్పుడు ఇట్లాగే చేస్తే మీరు ఉండేవారా? నిన్ను బిఆర్ఎస్ పది సంవత్సరాలు నిన్ను పెంచిపోషించింది. రేవంత్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకుల కోసం మైనంపల్లి మాట్లాడుతున్నారు.
రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో తిరగకుండా చేస్తానని మైనంపల్లి అన్నారు. మైనంపల్లికి ఎంపీ,ఎమ్మెల్యే టిక్కెట్,ఎమ్మెల్సీ,గ్రేటర్ అధ్యక్ష
పదవి బిఆర్ఎస్ ఇచ్చింది. పేపర్ పేరు మార్చుకోవాలని బిఆర్ఎస్ చెప్పడం తప్పు ఎట్లా అవుతుంది? మైనంపల్లి నైజం మాకు తెలుసు.
మైనంపల్లి ఆకాశం అంత ఎగురుతున్నాడు. మైనంపల్లి హనుమంతరావును మల్కాజిగిరి ప్రజలు ఛీఛీ అని అంటున్నారు. మైనంపల్లి తన కొడుకు రోహిత్ కు బుద్ది చెప్పాలి కదా? మైనంపల్లి హనుమంతరావును మేము బూతులు తిట్టలేమా? కేసులు పెట్టాలని,పీడీ యాక్ట్ పెట్టాలని పోలీసులకు చెప్పడానికి మైనంపల్లి రోహిత్ ఏమైనా పోలీసా ? మెదక్ లో పరిస్థితులు బాగోలేదు.
కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాం. మీరు ఇటుకతో కొడితే మేము రాయితో కొడతాము. కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి కార్యకర్తలు బాధతో ఉన్నారు. కేటీఆర్,హరీష్ రావు ఇంటిపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటామా? పండబెట్టి తొక్కుతాము. కేటీఆర్,హరీష్ రావు ఇంటికి ఎప్పుడు వస్తారో చెప్పండి. సమైక్య రాష్ట్రంలోనే పెద్ద,పెద్ద వాళ్ళను ఎదిరించాము. హైదరాబాద్ నగరంలో వర్షాలు పడితే ఒక్క మంత్రి దిక్కులేరు.
రేవంత్ రెడ్డికి హైదరాబాద్ లో ఉన్న అన్ని క్లబ్బుల్లో మెంబర్ షిప్ ఉంది. పోలీసులకు రాజకీయాలతో సంబంధం ఏంటి? పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. కేటీఆర్,హరీష్ రావుపై దాడి చేస్తామంటే పోలీసులు ఏం చేస్తున్నారు?
మైనంపల్లి హనుమంతరావు బజారు భాష,చిల్లర భాష మాట్లాడారు. మైనంపల్లి హనుమంతరావుకు దమ్ము, ధైర్యం,ఆధారాలు ఉంటే కేటీఆర్ పై చేసిన ఆరోపణలను నిరూపించండి. మైనంపల్లి హనుమంతరావుపై న్యాయస్థానాల్లో,ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాము. బిఆర్ఎస్ పార్టీకి చెందిన బలహీనవర్గాల కార్పొరేటర్లపై దాడులు చేశారు. మైనంపల్లి హనుమంతరావు గాంధీభవన్ లో వీధి భాష మాట్లాడారు.
మైనంపల్లి హనుమంతరావు గుండాల్లాగా వ్యవహరిస్తూ నడిరోడ్డులో దాడులకు పాల్పడ్డారు. హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. దీనికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. బలహీనవర్గాల కార్పొరేటర్లపై అక్రమ కేసులు పెట్టారు. పదిఏళ్ళు రాష్ట్ర మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్ ను అభివృద్ధి చేశారు. మైనంపల్లి హనుమంతరావు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి అని గుర్తుకురాలేదా?
టీడీపీలో టిక్కెట్ దక్కకపోతే కేటీఆర్ మైనంపల్లి హనుమంతరావుకు 2014లో మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. మల్కాజిగిరి ఎంపీగా మైనంపల్లి హనుమంతరావు ఓడిపోతే, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష పదవి ఇచ్చారు. నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చారని మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్
కాళ్ళు మొక్కారు. అధికారం ఉందని మైనంపల్లి ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారు.
శాంతిభద్రతల విషయంలో రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలనపై పట్టలేదు. పదేళ్లు సీఎంగా ఉండటానికి నువ్వు ఎవరు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కేటీఆర్ సీఎం కావాలని అనుకుంటే ఎప్పుడో అయ్యేవారు. రేవంత్ రెడ్డి ట్రాప్ లో మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతున్నారు.
ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి ,ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ,బీ ఆర్ ఎస్ నేతలు నంది కంటి శ్రీధర్ ,చిరుమళ్ల రాకేష్ కుమార్ పాల్గొన్నారు.