Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా?

-పట్టపగలు ప్రజా సంపద లూఠీ చేస్తుంటే మేం చూస్తూ కూర్చోవాలా?
-పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు ఇసుక దందాను బట్టబయలు చేసినందుకే కంచేటి సాయిపై కక్ష సాధింపులు
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

తమ అవినీతి,అక్రమాలు ప్రశ్నించిన వారిపై కక్షసాధింపులకు పాల్పడటం జగన్ రెడ్డి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేల వరకు దినచర్యగా మారింది. ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను ప్రశ్నించినవారిపై బహిరంగంగా దాడులకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఇసుక దందాను ఆధారాలతో సహా బట్టబయలు చేసినందుకే టీడీపీ నేత కంచేటి సాయిపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారు. అతని అనుచరుడు రాము దుకాణంపై ఎమ్మెల్యే కుమారుడు కళ్యాణ్ దగ్గరుండి దాడి చేయించటం దుర్మార్గం.

సాయిపై దాడి చేస్తామంటూ వైసీపీ నేతలు బహిరంగంగా కర్రలు పట్టుకుని తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజా సంపద దోచుకోవటం ఏంటని ఎమ్మెల్యేని ప్రశ్నించటం తప్పా? ప్రకృతి వనరులు పట్టపగలే దోపిడి చేస్తుంటే మేం చూస్తూ కూర్చోవాలా? ఎమ్మెల్యే శంకర్రావు కుమారుడు కళ్యాణ్ నియోజకవర్గంలో రౌడీ గ్యాంగ్ ని పెంచిపోషిస్తున్నారు. ఆ గ్యాంగ్ తో సినీ ఫక్కీలో ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు చేయిస్తున్నారు. ఎమ్మెల్యే కుమారుడి ఆగడాలు సీఎంకి, డీజీపీకి కనిపించటం లేదా? కంచేటి సాయికి భద్రత కల్పించాలి, సాయికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత.

LEAVE A RESPONSE