Suryaa.co.in

Andhra Pradesh

అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీకి ఫిర్యాదు చేస్తే అక్రమ కేసులా.?

దండా నాగేంద్రను తక్షణమే విడుదల చేయాలి

– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు –

అక్రమ ఇసుక తవ్వకాలతో వైసీపీ నేతలు రూ.40 వేల కోట్లు దోచుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు పాల్పడుతూ ప్రకృతిని నాశనం చేస్తున్నారు. దీనిపై ఎన్జీటీని ఆశ్రయించిన ధరణికోటకు చెందిన దండా నరేంద్ర అనే వ్యక్తిపై వైసీపీ కక్షగట్టి అక్రమ కేసులు బనాయిస్తోంది..

సైకో జగన్ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. దండా నాగేంద్రను తక్షణమే విడుదల చేయాలి. గతంలో రాజమండ్రిలో ఇసుక రవాణా అడ్డుకున్న దళిత యువకుడు వరప్రసాద్ కు శిరోముండనం చేశారు.. ఇప్పుడు నాగేంద్రను అరెస్ట్ చేసి వేధిస్తున్నారు. న్యాయస్థానం ఆదేశాలిచ్చినా ఇసుక తవ్వకాలు నిలిపేయడం లేదు.

భూమి నెర్రెలు బారినా వైసీపీ నేతల ఇసుకదాహం తీరదేమో. ప్రకృతిని నాశనం చేస్తే ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రజలకు ఉచితంగా అందాల్సిన ఇసుకను బంగారం చేశారు. నిబంధనలు పాటించకపోవడంతోనే ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా విధించింది..ఇది ప్రభుత్వ సొమ్ముతో చెల్లిస్తారా.. వైసీపీ నేతలు దోచుకున్న డబ్బుతో చెల్లిస్తారా? వైసీపీ తీరు మారకపోతే ప్రజలే ఇసుక డంపుల్లో వైసీపీని పాతి పెడతారు.

 

LEAVE A RESPONSE