మా ధర్మం మేం పాటిస్తున్నాం
మీరు మీ ధర్మం మరిచారు
మేం శుక్రవారం మసీదుకు వెళతాం
మీరు గుళ్లకు వెళతారా?
మేం మా పిల్లలకు ఖురాన్, అరబ్బీ నేర్పుతాం
మీరు మీ పిల్లలకు రామాయణ, మహాభారతాలు నేర్పుతారా?
మేం పిల్లలకు సలాం చేయడం నేర్పిస్తే. మీరు హాయ్ నేర్పిస్తున్నారు
దానికి మేమెలా బాధ్యులం?
అది మాతప్పా?
నిజంగా హిందువుల కళ్లు తెరిపించే ప్రశ్నలివి. తాము తమ ధర్మం పాటిస్తుంటే, మీరు మీ ధర్మం ఎందుకు పాటించరన్నది ఆ సగటు ముస్లిం వేసిన ప్రశ్న హిందువులకు ఓ కనువిప్పు. నిజమే. ముస్లిం, క్రైస్తవులు వారి ధర్మాన్ని వారు పక్కాగా పాటిస్తున్నారు. అది వారి మతం నేర్పిన పాఠం.
మరి హిందువులు తమ ధర్మం పాటిస్తున్నారా? తమ ధర్మం పాటించనప్పుడు, ఇతర మతస్తులను వేలెత్తిచూపే నైతిక అర్హత ఉందా అన్నదే ప్రశ్న. ప్రతి ముస్లిం శుక్రవారం మసీదుకు, ప్రతి క్రైస్తవుడు క్రమం తప్పకుండా ఆదివారం చర్చికి వెళతాడు. మరి ప్రతి హిందువు గుళ్లకు వెళతాడా? ప్రతి ముస్లిం ఇంట్లో ఖురాన్ ఉంటుంది. ప్రతి క్రైస్తవుడి ఇంట్లో బైబిల్ ఉంటుంది.
మరి ప్రతి హిందువు ఇంట్లో భగవద్గీత-రామాయణం-మహాభారతం ఉంటుందా? ఎంతమంది హిందూ మహిళలు బొట్టు పెట్టుకుంటున్నారు? ఎంతమంది హిందూ మహిళలు చీర కడుతున్నారు? సదరు ముస్లిం వేసిన ప్రశ్నలు దాదాపు ఇలాంటివే. హిందువులను చెర్నాకోల్‌తో కొట్టకుండానే, అంత పనిచేసిన ఆ ముస్లిం వేసిన ప్రశ్నలకు.. హిందువుల దగ్గర జవాబు ఉందా?
ఒక ముస్లిం నిలదీసి అడుగుతున్న ప్రశ్నలివి..
మీ పెళ్లయిన ఆడవాళ్ళు కూడా చీర కట్టడం మానేస్తే.
అది మాతప్పా?
ఒకప్పుడు నుదుటిపై ‘బొట్టు’ లేకపోతే “అశుభంగా” భావించే మీ మహిళలు..ఫ్యాషన్ పేరుతో మానేస్తే,.
అది మాతప్పా?
మా పిల్లలు నడవడం మొదలెట్టగానే, తండ్రి వేళ్లు పట్టుకుని, నమాజ్ కు వెళ్తాడు. అది తన జీవితాంత-కర్తవ్యంగా భావిస్తాడు.
మీరు, మీ పిల్లలూ దేవాలయాలు వెళ్లటం మానేస్తే,..
అది మాతప్పా?
కష్టాల్లోనే.., కోరికలతోనే… మీరూ మీపిల్లలకు గుడి గుర్తొస్తే,.
అది మాతప్పా?
మా పిల్లలు, బంధువుల ముందు ప్రార్థన చేయలేకపోతే మేం సిగ్గుపడతాం!
మీ పిల్లలు ఇంగ్లీష్ రైమ్స్ చెబితే చాలు, మీరు గర్వపడతారు.
పిల్లలకు భగవద్గీతలోని “ఒక్క శ్లోకం కూడా రాలేదే” అనే బాధ మీకు కలగదు!
అది మాతప్పా?
సలాం చేస్తూ, అల్లా ను స్తుతిస్తూ మాట్లాడ్డం నేర్పిస్తాం.
మీరూ..? నమస్కారం స్థానంలో హలో, హాయ్ అని మొదలెట్టి మాట్లాడితే,
అది మాతప్పా?
మా పిల్లలు కాన్వెంట్ లో చదివిన స్కూల్ నుంచి వచ్చాక.. ఉర్దూ, అరబిక్ నేర్చుకుంటారు కాబట్టే.. ఖురాన్ అరబ్బీలోనే చదవుతారు. మీరు పిల్లలకు తెలుగు, సంస్కృతం నేర్పరు.
భగవద్గీత శ్లోకాలు నేర్వకపోతే,
అది మాతప్పా?
మీ నాగరికత, చరిత్ర, సంప్రదాయాలు మొదలైనవన్నీ గుడ్డి-ఆధునికవాదం తో మానేస్తే,
అది మాతప్పా?
మీరు మీ మూలాలను విచ్ఛిన్నం
చేసుకున్నారు.
మేము మా మూలాలను ఎప్పుడూ వదలం!
Last but not Least
మీ స్త్రీలు మంగళసూత్రం ధరించడానికి సిగ్గుపడుతున్నారు.
మీ మతం, నాగరికత నాశనం అవుతుందనే భయమెందుకు?
మీ కుటుంబ సభ్యులే, మీరు మార్చలేరు.
మీలో ఎవరూ.. ఎవరి మాటా వినరు.
అది మా తప్పా?
మీరు మమ్మల్ని చూసి, మాపై అసూయ పడతారు!
మమ్మల్ని ద్వేషించడం ప్రారంభించారు!
మీరు మీ సంప్రదాయాలను నిలబెట్టుకోలేకపోతే, అది మా తప్పా?
( రచయిత ప్రస్తావించిన అభిప్రాయాలతో సూర్య వెబ్‌సైట్‌కు సంబంధం లేదు. అది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని గమనించగలరు)
– మధుసూదన్‌రాజు వేగేశ్న