– దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీ కులగణన జరగాలి
– తప్పుడు లెక్కలతో బీసీల జనాభాను తక్కువ చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
– తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నాగర్ కర్నూల్: బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో 46 శాతం రిజర్వేషన్లకు వేర్వేరు బిల్లులను పెట్టాలి. ఒకటే బిల్లు పెడితే మొదటికే మోసం వస్తుందని తొలి నుంచీ నేను వాదిస్తున్నాను. ప్రభుత్వం దిగొచ్చి మూడు బిల్లులను పెట్టాలని ప్రతిపాదించాము. మూడింటికి ఒకే బిల్లు పెడితే కోర్టుల్లో నిలవదు. కాంగ్రెస్ చేపట్టిన కుల సర్వే తప్పుడు తడకగా ఉంది
2014 కేసీఆర్ జరిపిన సర్వేలో బీసీలు 52 శాతం ఉన్నట్లు తేలింది. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన సర్వేలో 46 శాతం బీసీలు ఉన్నట్లు తేలింది. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ప్రభుత్వం చెప్పాలి? కుల సర్వేపై ప్రభుత్వం విస్తృత ప్రచారం ఎందుకు కల్పించలేదు ? తప్పుడు లెక్కలతో బీసీల జనాభాను తక్కువ చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీ హక్కులకు రాజ్యాంగ రక్షణ రాకపోవడం బాధాకరం.
చట్టసభల్లో బీసీలు ఎంత మంది ఉన్నారో చూస్తే పరిస్థితి అర్థమవుతోంది. బీసీలకు రాజ్యాంగ రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో ఇండియా అమెరికాను దాటిపోయేది. రాజ్యాంగ రక్షణ కలగాలంటే బీసీల కులాల జనాభాను లెక్కబెట్టడం అవసరం. దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీ కులగణన జరగాలి.