Suryaa.co.in

Education International National

విదేశాల్లో ఐఐటీ వెలుగులు

-‘ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ పేరుతో స్థాపించాలి
– డిప్యుటేషన్‌పై స్వదేశీ బోధనా సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలి
– కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులు

దేశీయంగా అద్భుతాలు సృష్టిస్తున్న ప్రతిష్ఠాత్మక ఐఐటీ విద్యాసంస్థలు ఇకపై విదేశాల్లోనూ సత్తా చాటనున్నాయి. ‘ఇండియా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ పేరుతో వివిధ దేశాలకు అవి విస్తరించనున్నాయి. విదేశాల్లోని తమ ప్రాంగణాల్లో ఎంతమంది విద్యార్థులను చేర్చుకోవాలన్నదానిపై తుది నిర్ణయాధికారమూ వాటికే దక్కనుంది. ఐఐటీలను అంతర్జాతీయంగా విస్తరించే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ తాజాగా ఈ మేరకు పలు కీలక సిఫార్సులు చేసింది. వాటిలోని కీలకాంశాలివీ..

విదేశాల్లో ఐఐటీ ప్రాంగణాలను నెలకొల్పే అధికారాన్ని ఏదైనా ఒక నిర్దిష్ట ఉన్నత విద్యాసంస్థ (హెచ్‌ఈఐ)కు అప్పగించాలి.దేశీయ ఐఐటీల నుంచి అంతర్జాతీయ శాఖలకు బోధనా సిబ్బందిని డిప్యుటేషన్‌పై పంపి, ఆయా చోట్ల వారి సేవలను ఉపయోగించుకోవాలి.విదేశాల్లోని ఐఐటీల్లో భారతీయ విద్యార్థుల వాటా 20% కంటే తక్కువే ఉండాలి.

ప్రాంగణం ఎక్కడ ఉందో స్పష్టంగా తెలిసేలా ‘ఇండియా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ చివరన.. ఆ ప్రాంతం పేరును జోడించాలి.కోర్సుల అభ్యసనం విద్యార్థులకు ఆర్థికంగా అందుబాటులో ఉండాలి. అందుకు తగ్గట్టుగానే విద్యార్థుల సంఖ్యను నిర్ణయించుకోవాలి.తమ దేశాల్లో ప్రాంగణాలను స్థాపించాలంటూ పశ్చిమాసియా, దక్షిణాసియాల్లోని పలు దేశాలు మన ఐఐటీలను కోరుతున్నాయి. యూఏఈలో క్యాంపస్‌ను ఏర్పాటుచేసే అవకాశాన్ని ఐఐటీ-దిల్లీ; శ్రీలంక, నేపాల్‌, టాంజానియాల్లో ప్రాంగణాలను స్థాపించేందుకు ఉన్న అవకాశాలను ఐఐటీ మద్రాసు పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే.

LEAVE A RESPONSE