• ముఖ్యమంత్రి సొంతజిల్లాలో పెచ్చుమీరిన భూకబ్జాలు, దందాలు
• సొంతజిల్లాలో జరిగే భూఆక్రమణలు, ప్రజల ఆస్తులు, భూములుదోపిడీ, అక్రమ అధికారపార్టీనేతల అక్రమ లేవుట్ల వ్యాపారం ముఖ్యమంత్రికి తెలియదనుకోవడం పిచ్చితనమే
• టీడీపీప్రభుత్వం రాగానే వైసీపీనేతల అక్రమ లేవుట్ల వ్యాపారంతో భూములు కోల్పోయిన పేదలకు న్యాయం చేస్తాం
• నిబంధనలు అతిక్రమించి అధికారపార్టీనేతల భూకబ్జాలు, అక్రమ లేవుట్లవ్యాపారానికి అడ్డగోలుగా సహకరిస్తున్న అధికారయంత్రాంగం ఆటకట్టిస్తాం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి
ముఖ్యమంత్రి సొంతజిల్లాలో ప్రజలమానప్రాణాలతో పాటు, వారి ఆస్తులు, భూములు, ప్రభుత్వభూములకు కూడా రక్షణ కరువైందని, వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులుసహా కిందిస్థాయి అధికారపార్టీనేతల అండదండలతో యథేచ్ఛగా ఉమ్మడి కడపజిల్లాలో దోపిడీలు, కబ్జాలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వాధికారులు, పోలీసులు తమ బాధ్య తలు విస్మరించి అధికారపార్టీ నేతలకు వంతపాడటం బాధాకరమని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ కడపనగరంలో నడిరోడ్డుమీద వైసీపీనేతను సొంతపార్టీ కార్యకర్తలు పట్టపగలు హత్యచే శారు. భూలావాదేవీలు, పంపకాల్లో తేడాలువచ్చే శ్రీనివాసరెడ్డి అనే వైసీపీనేతను దారుణంగా చంపేశారు. దళితులఅధీనంలోని భూముల్ని కూడా అధికారపార్టీ భూబకాసురులు వదలడంలేదు.
అధికారపార్టీ భూదందాలపై నిలదీస్తున్నాడన్న అక్కసుతోనే గతంలో పొద్దుటూరులో నందంసుబ్బయ్యను కిరాతకంగా హత్యచేశారు. ముఖ్యమంత్రి ఇలాఖాలో భూకబ్జాలు, ఆక్రమణలు, లేఅవుట్ల వ్యాపారం మూడు భూదందాలు.. ఆరు ప్లాట్ల అమ్మకాలు అన్నట్టు సాగుతోంది.
మంత్రి అంజాద్ బాషా అనుచరులే మినిస్టర్స్ కాలనీ పేరుతో అక్రమ లేవుట్ వేసి, మాయమాటలతో ప్లాట్లను ప్రజలకు అంటగట్టేస్తున్నారు. అక్రమార్కుల కల్లబొల్లి మాటలు నమ్మి, కష్టపడిసంపాదించిన సొమ్ముని పోగోట్టుకోవద్దని పేదలకు సూచిస్తున్నాం.
దళితులు, బడుగుబలహీనవర్గాల భూముల్ని వైసీపీనేతలు యథేచ్ఛగా ఆక్రమించేస్తు న్నారు. అక్రమ లేఅవుట్లపేరుతో పేదల్ని బెదిరించి, పోలీసులసహాకారంతో పంచాయితీ లు పెట్టడం నిత్యకృత్యమైంది. కడపనగరంలో ఈ నాలుగేళ్లలో ఎన్నిలేఅవుట్లకు ప్రభు త్వం అనుమతించిందనే వివరాలు అడిగితే, సాయిమిత్ర డెవలపర్స్ అనే ఒకేఒక్క లే అవుట్ కు అనుమతిచ్చినట్టు చెప్పారు. కానీ కడపనగరం, దానిచుట్టుపక్కల కుప్పల కొద్దీ లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. మినిస్టర్స్ కాలనీ పేరుతో మంత్రి అంజాద్ బాషా అను చరులు ఒకకాలనీలో అక్రమలేఅవుట్ వేశారు.
ఆ లేఅవుట్ కు ఆనుకొని ప్రభుత్వభూ ములున్నాయి. వాటిని లేఅవుట్లో కలిపేసి అమ్మేయాలని వైసీపీకార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు, వైసీపీనేతలు, కార్యకర్తలు వేసిన అక్రమ లేఅవుట్లలో ప్లా ట్లు కొనవద్దని ప్రజల్ని కోరుతున్నాం. కష్టపడి సంపా దించిన సొమ్ముని అక్రమార్కుల మాటలు నమ్మి, నీళ్లపాలుచేసుకోవద్దని సూచిస్తున్నాం.
పేదప్రజల్ని వంచించి ఎలాగో లా అక్రమ లేఅవుట్లను అమ్మేయాలనే ఆలోచనలో ఉన్నారు. వైసీపీనేతలు, ఎమ్మెల్యే లు, మంత్రులమాటలు, వారి విషప్రచారం నమ్మి నష్టపోవద్దని కోరుతున్నాం. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రోద్బలంతో జరిగే భూకబ్జాలు, దారుణాలపై టీడీపీ ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా అధికారులు ఎలాంటిచర్యలు తీసుకోలేదు.
టీడీపీప్రభుత్వం రాగానే భూకబ్జాదారులైన వైసీపీనేతలు, కార్యకర్తల ఆటకట్టిస్తాం. ఉమ్మడి కడపజిల్లాలో జరిగే భూకబ్జాలు, ఆక్రమణలు, అక్రమలేఅవుట్ల సంగతి ముఖ్య మంత్రికి తెలియదనుకోవడం పిచ్చితనమే.
ముఖ్యమంత్రి కడపజిల్లాకు వచ్చినాకూడా సొంతజిల్లాలోజరిగే భూకబ్జాలు, దందాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సొంతపార్టీవారి భూదందాలు, కబ్జాలుతెలిసే జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి తనపార్టీవారిని వదిలే సినా, టీడీపీప్రభుత్వం రాగానే అసలుదొంగల ఆటకట్టిస్తాం. భూకబ్జాలు,దోపిడీలతో చెలరేగి పోతున్న అధికారపార్టీనేతలతోపాటు, వారికి సహకరించిన అధికారయంత్రాంగం పై కూడా కఠినచర్యలు తీసుకుంటాం.
అవసరమైతే ఒక కమిషన్ వేసి, నిజానిజాలు నిగ్గుతేల్చి, భూములుకోల్పోయినవారికి న్యాయంచేస్తాం. కడపజిల్లాలో మరుగునపడి పోయిన ఫ్యాక్షన్ ను మరలా జగన్మోహన్ రెడ్డి మొదలెట్టారు. హత్యారాజకీయాలతో ప్ర జల్ని భయపెట్టి, బెదిరించి వారిఆస్తులు, భూములు లాక్కొని, ప్లాట్లుగా మార్చేసి అమ్మేసుకుంటున్నారు.
అనుమతులు లేకుండా లేఅవుట్లువేసి, అమాయకులైన పేద లకు వాటిని అంటగట్టి సొమ్ముచేసుకునేపనిలో అధికారపార్టీ నిమగ్నమైంది. ఈ వ్యవ హారమంతా ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుందంటే ఎవరూ నమ్మరు.” అని శ్రీనివాసులు రెడ్డి స్పష్టంచేశారు.