Suryaa.co.in

Telangana

మొక్కల పెంపకం సామాజిక బాధ్యత

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో తమ సిబ్బంది తో కలిసి మొక్కలు నాటిన కరీంనగర్ నగర ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మంగళవారం నాడు కమిషనరేట్ కేంద్రంలో నగర పోలీసు కమిషనర్ ఎల్ . సుబ్బారాయుడు మొక్కలు నాటారు . ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేటి తరాలకు మొక్కల యొక్క ఆవశ్యకత తెలపవలసిన అవసరం మనపై ఉందని అన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని రక్షించుకొనే భాద్యత కూడా మనమే చేపట్టాలి అన్నారు.

అదే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 6 విడతలలో “ప్లాస్టిక్ బ్యాగులను, ప్లాస్టిక్ సంబందించిన వస్తువులను వాడకూడదు” అనే నినాదంతో, ప్లాస్టిక్ వాడకం వలన వాతావరణంలో కలిగే మార్పులు , నేలకు జరిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం గొప్ప విషయం అన్నారు. ప్రకృతిని కాపాడుకునే భాద్యత ప్రజలందరిపై ఉంటుందన్నారు. మన ఇంటిని శుభ్రంగా వుంచినట్లే పరిసరాలను చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేసినందుకు జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో అడిషనల్ డిసిపి శ్రీనివాస్, అడిషనల్ డిసిపి ఎం. భీమ్ రావ్, ఏసీపీ ప్రతాప్ , ఎస్ బి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు , రిజర్వ్ ఇన్స్పెక్టర్ మోడెమ్ సురేష్ అడ్మిన్ , మురళి సి.ఫ్ .ఎల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE