Suryaa.co.in

Telangana

శారీరక శ్రమ లేకనే అనారోగ్యం

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

సికింద్రాబాద్: సమాజంలో మనిషి జీవన విధానం మారుతోంది… ప్రజలపై తీవ్రమైన పని ఒత్తిడి ఉంది… దీనికి తోడు ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం, నీరు కలుషితం కావడం, పట్టణ ప్రాంతాల్లో శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.

ఈ కారణంగానే డాక్టర్లు వాకింగ్, వ్యాయామం చేయ్యాలని చెబుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకువాలన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓపెన్ జిమ్ లను కేంద్ర మంతి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట పద్మారావు నగర్ పార్క్ లో ఓపెన్ జిమ్ ను, సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్ న్యూ మెట్టుగూడ పార్క్ లో ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు.

ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వాల ఆలోచన మారాలి… స్కూళ్లలోనే ఆరోగ్యం పై పిల్లకు అవగాహన కల్పించడంతో పాటుగా.. ఆట, పాటలతో మానసిక ఉల్లాసాన్ని కలిగించేలా చర్యలు తీసుకువాలని మంత్రి సూచించారు. ఇంకా.. ఏమన్నారంటే.. ప్రస్తుతం స్కూల్ లలో ఆటస్థలాలు లేని పరిస్థితి ఉంది. ఇది భవిష్యత్ లో చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారితిసే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇప్పటికైనా బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాలను కాపాడుకుని వాటిని ఆటస్థలాలుగా తీర్చిదిద్దుకోవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఇప్పటివరకు 40 ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేశాం. జీహెచ్ఎంసీ వద్ద నిధులు లేని కారణంగా ప్రైవేటు వ్యక్తుల ఆర్థిక సాయంతో జిమ్స్ ఏర్పాటు చేయిస్తున్నాం.

ఇంకొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయిస్తాం. ప్రజల ఆరోగ్యం కాపాడ్డానికి ఈ జిమ్ లు ఎంతో ఉపయోగపడుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని బహిరంగ ప్రదేశాలను పార్కులుగా మార్చి జిమ్ లను ఏర్పాటు చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

మరోవైపు హైదరాబాద్ సిటీలో ప్రభుత్వం తరపున నిర్వహించే పబ్లిక్ టాయిలెట్లు సరిగ్గా లేవు సులభ్ లాంటి సంస్థల నిర్వహణ లో బాగానే నడుస్తున్న ప్రభుత్వమే చొరవ తీసుకుని ఎన్జీఓలకు కూడా ఆ బాధ్యత అప్పగించాలి. ఎన్జీఓలు ప్రైవేటుగా టాయిలెట్లు నిర్మించి నిర్వహించే విధంగా ప్రభుత్వం సహకరించాలి… ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.. తగినన్ని పబ్లిక్ టాయిలెట్లు లేని కారణంగా రోడ్డుపక్కన, పరిసరాలను వాడుకుంటున్న కారణంగా వాతావరణం అనారోగ్యంగా మారుతోందన్నారు.

LEAVE A RESPONSE