చుట్టూ యువ కలెక్టర్ల మధ్య.. రెండు పెద్ద స్పూన్ల సంగటి, రెండు వెజ్ దుంపలతో మన ‘యంగ్ మ్యాన్’!
మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తర్వాత దానిని తింటున్న సమయంలో ఆయన వారికి కనిపించారు. అధికారులు బ్రోచర్ చూపి వివరిస్తుంటే, కళ్లతోనే ఆ సమాచారాన్ని ఆరగిస్తూ ఆ స్వల్ప ఆహారాన్ని తీసుకున్నారు.
అంతకుముందు ‘అరకు కౌని’ పేరుతో గిరిజన మిల్లెట్ ఫుడ్ మెనూను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. తొలి గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ ఆహార ఉత్పత్తుల స్టాల్ను ఆయన సందర్శించారు. గిరిజనులు పండించిన కొర్రలు, రాగులు, సామలు, కాకిజొన్నలు, సజ్జలు (గంట్లు), మొక్కజొన్నలు, కొండ కందులు, రాజ్మాతో చేసిన కొర్ర పాయసం, రాగి చపాతీ, సామల పులిహోర, గంట్ల అంబలి, కార్న్ వడ, తూర్ దాల్ కర్రీ వంటి వంటకాలను అక్కడ ప్రదర్శించారు. ఈ ఉత్పత్తులను ముఖ్యమంత్రి పరిశీలించి రుచి చూశారు.
గిరిజనుల ఆహార సంప్రదాయాలను గౌరవిస్తూ, ఆరోగ్యకరమైన మిల్లెట్ ఆహారాన్ని మరింత ప్రోత్సహించాలని ఆయన సూచించారు. టూరిజం శాఖ, ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ కలిసి రాష్ట్రంలోని స్టార్ హోటళ్లు, ఆతిథ్య సంస్థలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ‘అరకు కౌని’ వంటకాలను మెనూలో చేర్చడం ద్వారా గిరిజన మిల్లెట్లను ప్రోత్సహించాలన్నారు ఆయన.
అక్కడ కేవలం రుచి మాత్రమే చూశారు కాబట్టి, ఆ తర్వాత తనకిష్టమైన రాగి సంగటిని మితంగా (రెండు స్పూన్లు) తీసుకుంటూ క్రమశిక్షణ పాటించారు.
మనమైతే పక్కన ప్లేట్లలో కోడి వేపుడు కనిపిస్తుంటే ఇలా కొలతలు వేసుకోగలమా?
ఆయన స్థితప్రజ్ఞుడు. మన కోసం కళ్లతోనే కాటా వేసి (కొలిచి), ఆహార సమయాలు దాటినా నియమాలు పక్కాగా పాటిస్తూ, నాలుకను కట్టేసుకుని రాష్ట్రం కోసం శ్రమిస్తున్నారు.