– అధికారం అండతో చెలరేగిపోతున్న ఎంపీపై తక్షణమే చర్యలు తీసుకోవాలి
– TNSF రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్
రాష్ట్రంలో పోలీసు అధికారి స్దలానికే రక్షణలేనప్పుడు ప్రజల ఆస్తులకు రక్షణ ఎలా ఉంటుంది ?అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారు . విశాఖలో 26 ఎకరాల క్రైస్తవ భూములు కబ్జాకు పాల్పడిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇప్పుడు ఏకంగా ఎస్పీ స్ధలనే కబ్జా చేసారు .
ఎస్పీ కె మధు తన స్ధలాన్ని ఎంపీ కబ్జా చేసి , దానిలో నుంచి రోడ్డు వేయించారంటూ విశాఖపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయడం వైకాపా నేతల తీరుకు నిదర్శనం .
కనిపిస్తే కబ్జాకు పాల్పడుతున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పై తక్షణమే జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి .