Suryaa.co.in

Andhra Pradesh

డయల్ యువర్ ఎమ్మెల్యేకి వచ్చే ఫిర్యాదులపై తక్షణ స్పందన

– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

పెదకూరపాడు: ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై క్షణాల్లో స్పందించి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ పరిష్కరిస్తున్నారు. అచ్చంపేట మండలం, జడపల్లి తండా ప్రజలు మంచినీరు లేక ఇబ్బందులు పడడం పై స్పందించి వెంటనే గ్రామానికి మంచి నీటి సదుపాయం కల్పించారు. అమరావతి మండలం అత్తలూరు ఎస్సీ కాలనీ పెద్దపల్లిలోని అంగన్వాడీ స్కూల్ లోకి నీరు రావడం పై తక్షణమే స్పందించి సమస్య పరిష్కారం చూపారు. విప్పర్ల చెక్ డ్యాం కు తుఫాన్ కారణంగా పడిన గండిని స్థానిక నాయకులు అధికారుల సాయంతో యుద్ధ ప్రాధికన పూడ్చివేయించారు.

వరదల కారణంగా దొడ్లేరు చెరువు పొంగుతుందనే ఫిర్యాదు పై తక్షణమే స్పందించి పరిష్కారం చూపారు. మాదిపాడు రామాలయం వీధిలో మంచినీటి బోరు బిగించేలా చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం.. అనంతవరంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను స్థానిక నాయకుల సహకారంతో మార్పించి శాశ్వత పరిష్కారం చూపారు.

పెదకూరపాడు మండలంలో యుద్ధ ప్రాతిపదికన వరద డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు పిచ్చి మొక్కలను, పేరుకుపోయిన మురుగును తొలగించడం, బ్లీచింగ్, చల్లించడంతో పాటు ఫాగింగ్ చేపించి పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేలా చర్యలు, ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి క్రోసూరు మండలం లోని అన్నీ గ్రామాల్లో, వీధి లైట్ల ఏర్పాటు,పారిశుధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. సమస్యల తక్షణ పరిష్కారం కోసం డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శ్రీకారం చుట్టడం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A RESPONSE