Suryaa.co.in

Telangana

పార్టీలకు అతీతంగా సంక్షేమ పధకాల అమలు: మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద 66 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి పథకం క్రింద మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను మంత్రి అందజేశారు.

అమీర్ పేట డివిజన్ కు చెందిన BJP నాయకులు విఠల్ దంపతులు కూడా మంత్రి చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి చెక్కును అందుకున్నారు. పేదింటి ఆడపడుచు పెండ్లికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక లక్ష 116 రూపాయల ఆర్థికtsy1 సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న BJP, కాంగ్రెస్ నేతలు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఈ పథకాలు అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మీ, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, ఉప్పల తరుణి, MRO లు విష్ణుసాగర్, బాలశంకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE