Suryaa.co.in

Andhra Pradesh

వినాయక చవితికి ఆంక్షలు విధించటం దుర్మార్గం

-తిరుమల వసతి గదుల డిపాజిట్లపై ప్రశ్నించిన టీడీపీ నేత బీ.టెక్. రవిపై అక్రమ కేసు సిగ్గుచేటు
-హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం
– బుచ్చిరాం ప్రసాద్

వినాయక చవితికి గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించటం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాం ప్రసాద్ మండిపడ్డారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం నాడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…..

ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టే ముందు విఘ్నాలు తొలగించుకోవడానికి విష్నేశ్వరుని పూజిస్తాం, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే అన్న శ్లోకంతో ప్రారంభిస్తాం. కానీ వైసీపీ ప్రభుత్వం వినాయక చవితికి గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆంక్షలు విధించటం దుర్మార్గం. మండపానికి పర్మిషన్ కావాలంటే లాయర్ నోటరీ, నిమజ్జనం రూట్ మ్యాప్ , కమిటీ సభ్యులు వివరాలు, ఇవ్వాలనటం ఎంతవరకు సమంజసం? ప్రతి మండపంలో నీరు, ఇసుక ఉండాలంటున్నారు. 3 ఏళ్లలో వైసీపీ నేతలకు తప్ప ప్రజల కంటికి ఇసుక ఎక్కడైనా కన్పించిందా?

రాష్ట్రంలోని ఇసుకంతా వైసీపీ నేతలే బొక్కేశారు, ఇక ఇసుక ఎక్కడి నుంచి తెస్తారు? ప్రభుత్వం విధించిన ఆంక్షల్లో మండపం దగ్గర ఒక వ్యక్తి కాపలా ఉండాలన్నది ఒక్కటే సమర్దనీయం. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మండపంలోని పూజా సామాగ్రి దొంగింలించకుండా ఉండాలంటే ఈ నిభందన సరైందేనని ప్రజలంటున్నారు. ఒక్క మండపం ఏర్పాటు చేయాలంటే పైర్ ఆపీసు, మున్సిపాలిటీ ఆఫీస్, ఇలా ఇన్ని ఆపీసులకు తిరగాలా? ఒక్కో స్పీకర్ కి రోజుకి వంద రూపాయలు కట్టాలనటం దుర్మార్గం. గత ప్రభుత్వం విధించిన ఆంక్షలే మేం కొనసాగిస్తున్నామన్న వైసీపీ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటు. అంటే చంద్రబాబు నాయుడి పోటోతో ఇప్పుడు జీవో ఇచ్చారా? గతంలో పర్మిషన్ కి నోటరి కావాలనే నిభంధన ఎక్కడైనా ఉందా? అడ్డగోలు నిభందనలు విధించటమేకాక అడ్డగోలుగా వాదించటం సిగ్గుచేటు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు చివరకు పండుగపై కూడా గత ప్రభుత్వానికి ఆపాదించటం సిగ్గుమాలిన చర్య. రేపల్లె, తురకపాలెంలో టీడీపీ నేతల మండపాలకు పర్మిషన్ ఇవ్వక పోవటం దుర్మార్గం. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా తగ్గేది లేదు, వినాయక భక్తులకు టీడీపీ అండగా ఉంటుంది.

వైసీపీ పాలనలో గతంలో ఎన్నడూ లేనివిధంగా విజయవాడ దుర్గ గుడిలో అక్రమాలు జరిగాయి. వెండి సింహాలు, చీరలు మాయం, టికెట్లలో అవినీతి ఇలా ఎన్నో అక్రమాలు జరిగాయి. వాటిపై నాటి మంత్రి వెల్లంపల్లి, ప్రభుత్వం ఏం చేసింది?

తిరుపతిలో తిరుమల వసతి గదుల డిపాజిట్లపై ప్రశ్నించిన టీడీపీ నేత బీ.టెక్. రవిపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం. కేసు పెట్టాల్సింది బీ.టెక్ రవిపై కాదు, ప్రభుత్వానికి దమ్ముంటే నిభంధనలకు విరుద్దంగా తిరుమల కొండపై రాజకీయ విమర్శలు చేసిన మంత్రులపై, ప్రోటో కాల్ ఉల్లంఘించి ఇస్టానుసారంగా వందలాది మంది తమ అనుచరులను దర్శనానికి తీసుకెళ్లిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టాలి. తిరుమలలో వైకాపా రంగులు వేసిన వారిపై కేసులు పెట్టాలి. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించమన్నందుకు బీ.టె.క్ రవిపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం టీటీడీ ప్రతిష్ట పెంచేలా వ్యవహరించాలి తప్ప టీటీడీని రాజకీయ వేదికగా మార్చి తిరుమల ప్రతిష్టమంటగలపడం సరికాదు. వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకోమని బుచ్చిరాం ప్రసాద్ హెచ్చరించారు.

LEAVE A RESPONSE