Suryaa.co.in

Andhra Pradesh

2024 ఎన్నికల్లో 151 పైచిలుకు సీట్లతో వైసీపీ ఘనవిజయం

-బాపట్ల పార్లమెంట్ స్థానంతో పాటు 6 నియోజకవర్గాల్లోనూ విజయం తధ్యం
-క్షేత్రస్థాయిలో వైకాపా పూర్తి బలం
-2024 ఎన్నికల తరువాత టీడీపీ కనుమరుగు
-దేశ ద్రోహానికీ వెనుకాడని టీడీపీ
-టీడీపీ గుర్తింపు రద్దు ఎన్నికల కమీషన్ రద్దు చేయాలి
-దక్షిణ కోస్తా జిల్లా వైకాపా రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయి రెడ్డి

బాపట్ల: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనతో రాష్ట్రంలో 87% కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధి చేకూరిందని, ఫలితంగా రాష్ట్రంలో 51% పైచిలుకు ప్రజలు వైకాపాకు ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్న తరుణంలో 2024 ఎన్నికల్లో 151 సీట్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గకుండా వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని దక్షిణ కోస్తా జిల్లా వైకాపా రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

బాపట్ల జిల్లా పరిధిలోని బాపట్ల, పర్చూరు, రేపల్లె, అద్దంకి,చీరాల,వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నియోజిక వర్గల వారిగా గురువారం నాడు బాపట్లలోని స్థానిక కోన భవన్లో వైయస్సార్ సిపి పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ వి.విజయసాయిరెడ్డి నిర్వహించారు.

బాపట్లలో గురువారం కోన భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ అత్యంత ప్రజాధరణతో పూర్తి బలంగా ఉందని అన్నారు. తేదేపా అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్ లు చెప్పే అబద్దాలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారని అన్నారు.

బాపట్ల క్లిష్టమైన జిల్లా అని, గతంలో అద్దంకి, చీరాల, పర్చూరు, రేపల్లె పోగోట్టుకున్నామని అయితే ఇప్పుడు వేమూరు, బాపట్లతో పాటు గతంలో పోగొట్టుకున్న 4 నియోజకవర్గాల్లోనూ విజయకేతనం ఎగురవేస్తామని అన్నారు. జిల్లా నేతలు, నియోజకవర్గ నేతలు, ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించిన తరువాత ఈ నమ్మకం మరింత బలపడిందని అన్నారు.

చంద్రబాబు ప్రతి రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోడానికి సిద్ధంగా ఉన్నాడని, బీజేపీతోనూ పొత్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నాడని అన్నారు. చంద్రబాబు ఎందరితో పొత్తు పెట్టుకున్నా వైకాపా ఒంటరిగా బరిలోకి దిగి 151 స్థానాలకు తగ్గకుండా విజయం సాధించి ఆ గ్రాండ్ అలయన్స్ కు గుణపాఠం చెబుతుందని అన్నారు.చంద్రబాబు తనను తాను సింహం గా అభివర్ణించుకుంటుంటాడని, అయితే ఆ సింహం గర్జించే స్థితిలో ఈ రోజు లేదని అన్నారు.

ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా చంద్రబాబు కేవలం అబద్దాలతోనే రోజుగడుపుతూబయట ప్రపంచానికి తాను సత్యహరిశ్చంద్రుడిగా నమ్మించేందుకు ప్రయత్నిస్తుంటాడని అన్నారు. ఎంతలా ప్రయత్నించినా ప్రజలు మాత్రం ఆయన్ని అసత్యహరిశ్చంద్రుడిగానే చూస్తారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దొంగల పార్టీ, తెలుగు డెకాయిట్ల పార్టీ. తెదేపా నేతలు అధికార దాహం దేశ ద్రోహానికి సైతం వెనుకాడరని, దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతున్నారని విజయసాయి రెడ్డి చెప్పారు.

వేర్పాటు వాదులు, వేర్పాటు శక్తులు, వేర్పాటు ద తత్వంతో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల స్నేహం కోసం ఉవ్విళ్లూరుతున్నారని అన్నారు. పోలీసులపైనా, పోలీస్ వ్యవస్థపైనా దాడి చేయించిన తెలుగుదేశం పార్టీ తెలుగు ద్రోహుల పార్టీ కూడా అని అన్నారు.

ఈ నాటి వరకు ఏపీలో స్థిరనివాసం లేని చంద్రబాబును ప్రవాసాంధ్రుడు కాక ఇంకేమి అనాలని ప్రశ్నించారు. ప్రక్క రాష్ట్రం తెలంగాణ లో నివాసం ఉంటా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చేస్తున్న వ్యక్తి నడుపుతున్న పార్టీని ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలని ప్రశ్నించారు. సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టింది పేరని, కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించారని అన్నారు.

చంద్రబాబు మాత్రం కులాన్ని, మతాన్ని బూతద్దంలో చూస్తాడని అన్నారు. మీడియా వ్యవస్థల్నీ, సోషల్ మీడియాను మేనేజ్ చేసుకొని తనను తాను గొప్ప విజనరీగా చిత్రీకరించుకుంటాడని, మొదట విజన్ 2020 అన్నాడని, ఇప్పుడు 2047 అంటున్నాడని అన్నారు. 2047 చంద్రబాబు ఏ పరిస్థితుల్లో ఉంటాడో ఊహించుకోవచ్చని ప్రజలను మోసం చేసేందుకు ఆయన ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు.2024 తో చంద్రబాబు కథ ముగుస్తుందని, కల చెదిరిపోతుందని ఫలితంగా కన్నీటితో ఆయన శేష జీవితం గడపాల్సివస్తుందని అన్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, అసాంఘిక శక్తులతో స్నేహం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అసలు రాజకీయ పార్టీనే కాదని, ఆ పార్టీ గుర్తింపును కూడా ఎన్నికల కమీషన్ రద్దు చేయాలని కోరుతున్నానని అన్నారు. చంద్రబాబు, లోకేష్ లు పూనకం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ప్రజలను రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారని అన్నారు.

ఇటీవల టౌమ్స్ నౌ, ఇండియా టుడే చేపట్టిన సర్వేల్లో రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలకు వైకాపా 24 నుండి 25 కైవసం చేసుకుంటుందని వెల్లడైందని అన్నారు. 2024 తరువాత తేదేపా కనుమరుగైపోతుందని, కొత్తపార్టీలు పుట్టుకొస్తాయని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌ లకు రాజకీయ భవిష్యత్ ఉండదని చెప్పారు. 2014 ఎన్నికల్లో 151 పైచిలుకు సీట్లతో వైకాపా తిరిగి అధికారం కైవసం చేసుకుంటుందని అన్నారు.

ఎన్నికల ప్రణాళికల్లో భాగంగా మొదటి విడలతో అన్ని జిల్లాల్లో పర్యటించి, రెండవ విడతలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. జగనన్న సురక్ష కింద ప్రజల సమస్యలను పరిష్కరించామని అన్నారు. మూడవ విడతలో ప్రతి మండలంలోనూ ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు లక్ష్యంతో వలంటీటర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహసారధులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తామని అన్నారు.

అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పూర్తి అవగాహన ఉందని, సర్వే రిపోర్టులు కూడా ఉన్నాయని పార్టీ అభ్యర్దులును ఆయనే ప్రకటిస్తారని అన్నారు. పార్టీ నేతల మధ్య ఎటువంటి విభేదాలు లేవని, పార్టీ ఆదేశాల మేరకు అందరూ పని చేస్తున్నారని అన్నారు. పార్లమెంటు సభ్యులు ఆ పార్లమెంట్ పరిధిలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనైనా పర్యటించవచ్చని, సమావేశాలు నిర్వహించవచ్చని, ఆపే అధికారం ఎవ్వరికీ లేదని అన్నారు.

అయితే పార్లమెంటేరియన్ గా సురేష్ ఏ ప్రాంతంలోనైనా పర్యటించవచ్చని, దేశవ్యాప్తంగా పర్యటించవచ్చని విధి విధానాల్లో రూపొందించబడిందని అన్నారు. బాపట్ల జిల్లాలో నిర్వహించే అన్ని సమావేశాల్లో సురేష్ పాల్గొంటారని అన్నారు. జిల్లాలో అత్యధికంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి సామాజిక భవనం కోసం స్థలాన్ని అడిగారని, ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి పరిశీలించడం జరుగుతుందని అన్నారు.

అలాగే అంబేద్కర్ భవన్ మరమ్మత్తులకు తన ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నానని అన్నారు.అలాగే అర్దాంతరంగా నిలిచిపోయిన ముస్లిం సోదరుల షాదీఖానా పనులు తిరిగి ప్రారంభిస్తామని అన్నారు. ;పాత్రికేయుల ఇళ్ల స్థలాలు కేటాయింపు పరిశీలనలో ఉందని విజయసాయి రెడ్డి అన్నారు.

LEAVE A RESPONSE