ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

– జూన్ 2 నుంచి మూడు వారాల పాటు ఈ ఉత్సవాలు
– గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు జూన్ 2 నుంచి 22 వరకు ఉత్సవాలు
– ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

పోరాటాలు, త్యాగాలతో,ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో, పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరు ల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జూన్ 2 నుంచి మూడు వారాల పాటు సాగే ఈ ఉత్సవాలు తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా..పండుగ వాతావరణంలో జరుపాలని సిఎం అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖర్చుల నిమిత్తం కలెక్టర్లకు 105 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖను సిఎం కేసీఆర్ ఆదేశించారు.

గురువారం డా.బిర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో…దేశానికే ఆదర్శంగా తెలంగాణ హరితహారం సాధించిన విజయాలను సిఎం కేసీఆర్ వివరించారు. వాతావరణ పరిస్థితలకు అనుగుణంగా వరి పంట నాట్లను ఇప్పుడు అనుసరిస్తున్న ధోరణిలో కాకుండా ముందస్తుగా సకాలంలో నాటు వేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలగురించి సిఎం వివరించారు. అదే సందర్భంలో…గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ గురించి సిఎం ప్రకటించారు.

దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ ప్రధాన ఉద్దేశ్యంగా.. ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఏర్పడే నాటికి వున్న పరిస్థితులను పదేండ్లకు చేరుకున్న స్వరాష్ట్ర పరిపాలనలో సాధించిన గుణాత్మక అభివృద్ధిని సిఎం కేసీఆర్ రంగాల వారిగా వివరించారు. ఏ రోజు కారోజుగా రోజువారీ కార్యక్రమాలను వివరించిన ముఖ్యమంత్రి ఆయారోజు చేపట్టే శాఖలు అవిసాధించిన అభివృద్ధిని వివరిస్తూ…అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన ప్రజాసంక్షేమ కోణాన్ని తాత్విక ధోరణి దాని వెనకున్న దార్శనికతను కలెక్టర్లకు సిఎం కేసీఆర్ అర్థం చేయించారు.

గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు జూన్ 2 నుంచి 22 వరకు ఏరోజున ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సిఎం వివరించారు. ఈ మూడు వారాల ఉత్సవాల విశిష్టతను, ప్రాముఖ్యత ప్రాశస్త్యాన్ని వివరించారు.

గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణ గురించి సిఎం కేసీఆర్ సమావేశంలో అంశాల వారీగా లోతుగా విశదీకరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సిఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.

పదేండ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానంలో ఆదర్శంగా నిలిచిన ఆయా శాఖలకు సిఎం అభినందనలు తెలిపారు. వ్యవసాయం విద్యుత్తు సాగునీరు ఆర్ అండ్ బీ తదితర శాఖల మంత్రులను అధికారులను సిఎం అభినందించగా సమావేశం చప్పట్లతో హర్షం వ్యక్తం చేసింది.

కాగా… సిఎం కేసీఆర్ ఆదేశాలను అనుసరించి ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సాధించిన అభివృద్దిని దేశం నలుదిక్కులా కనిపించేలా తెలంగాణ గరిమ ప్రస్పుటించేలా చాటేందుకు, పండుగ వాతావరణంలో దశాబ్ధి ఉత్సవాలను నిర్వహించేందుకు తాము ఈ మూడు వారాలు కృషిచేస్తామని కలెక్టర్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సిఎంఒ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, డిజీపి, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరిష్ రావు, అటవీ, పర్యావరణం, శాస్త్ర – సాంకేతిక, దేవాదాయ, న్యాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశు సంవర్థకం, మత్స్య శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, షెడ్యూల్డు కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రొహిబిషన్, ఎక్స్సైజ్, క్రీడలు – యువజన సేవలు, పర్యాటక – సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ రోడ్లు – భవనాలు, శాసనసభ వ్యవహరాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి వెముల ప్రశాంత్ రెడ్డి, కార్మిక, ఉపాధి, ఫ్యాక్టరీలు, ఉపాధి కల్పన శాఖల మంత్రి చామకూర మల్లారెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు సోమేష్ కుమార్, డిజీపి అంజనీకుమార్, సిఎం కార్యదర్శులు స్మితా సభర్వాల్, సిఎం స్పెషల్ సెక్రటరీ భూపాల్ రెడ్డి, కమీషనర్ అగ్రికల్చర్ ఎమ్.రఘునందన్ రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హ, బిసి వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, టి.కె.శ్రీదేవి, పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, హెచ్ ఎం డీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, వైద్యారోగ్య శాఖ సెక్రటరీ ఎస్.ఎ.ఎమ్.రిజ్వీ, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.జితెందర్, రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, మైనారిటీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, ఎమ్ఎయూడి సెక్రటరీ సుదర్షన్ రెడ్డి, పంచాయతిరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సల్తానియా, సెక్రటరీ నిర్మల, రెవిన్యూ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ట్రైబల్ వెల్పేర్ సెక్రటరీ-కమిషనర్ క్రిష్టినాజడ్ చోంగ్తూ, ఆర్ అండ్ బి సెక్రటరీ శ్రీనివాసరాజు, మహిళా సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ భారతీ హళ్లికేరి, హ్యాండ్లూమ్స్ సెక్రటరీ జ్యోతి బుద్ద ప్రకాష్, ప్రోటోకాల్ అడిషనల్ సెక్రటరీ అరవిందర్ సింగ్,
జిల్లాల కలెక్టర్లు… ఆదిలాబాద్ రాహుల్ రాజ్, భద్రాద్రి కొత్తగూడెం అనుదీప్ దురిశెట్టి, హనుమకొండ సిక్తా పట్నాయక్, హైదరాబాద్ డి.అమోయ్ కుమార్, జగిత్యాల షేక్ యాస్మిన్ భాష, జనగాం సిహెచ్. శివలింగయ్య, జయశంకర్ భూపాలపల్లి భవేష్ మిశ్ర, జోగుళాంభ గద్వాల వల్లూరు క్రాంతి, కామారెడ్డి జితేష్ వి పాటిల్, కరీంనగర్ ఆర్వీ కర్ణన్, ఖమ్మం విపి.గౌతమ్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ భోర్కడే హేమంత్ సాహిదియోరావు, మహబూబాబాద్ శశాంక, మహబూబ్ నగర్ జి.రవి, మంచిర్యాల బదావత్ సంతోష్, మెదక్ రాజార్షి షా, మేడ్చల్ మల్కాజిగిరి డి.అమోయ్ కుమార్, ములుగు క్రిష్ణాదిత్య, నాగర్ కర్నూల్ ఉదయ్ కుమార్, నల్గొండ వినయ్ క్రీష్ణారెడ్డి, నారాయణపేట కోయ శ్రీహర్ష, నిర్మల్ క్రాంతివరున్ రెడ్డి, నిజామాబాద్ రాజీవ్ గాంధీ హనుమంతు, పెద్దపల్లి సంగీత సత్యనారాయణ, రాజన్న సిరిసిల్లా అనురాగ్ జయంతి, రంగారెడ్డి ఎస్. హరీష్, సంగారెడ్డి ఎ.శరత్, సిద్దిపేట పాటిల్ ప్రశాంత్ జీవన్, సూర్యాపేట ఎస్.వెంకట్ రావ్, వికారాబాద్ సి.నారాయణ్ రెడ్డి, వనపర్తి తేజస్ నందలాల్ పవార్, వరంగల్ ప్రావీణ్య, యాదాద్రి భువనగిరి పమేలా సత్పతి,

పోలీస్ కమిషనర్లు… హైదరాబాద్ సివి.ఆనంద్, రాచకొండ డిఎస్. చౌహన్, సైబరాబాద్ స్టిఫెన్ రవీంద్ర, వరంగల్ ఎవి.రంగనాథ్, రామగుండం రెమారాజేశ్వరీ, సిద్దిపేట ఎన్.శ్వేత, కరీంనగర్ ఎల్.సుబ్బారాయుడు, ఖమ్మం విష్ణు ఎస్.వారియర్, నిజామాబాద్ ప్రవీణ్ కుమార్,
జిల్లాల ఎస్పీలు… మెదక్ రోహిణి ప్రియదర్శిని, నల్లగొండ అపూర్వరావు, వనపర్తి రక్షిత కె.మూర్తి, వికరాబాద్ ఎన్.కోటిరెడ్డి, మహబూబాబాద్ శరత్ చంద్ర పవార్, కొత్తగూడెం డా.జి.వినీత్, ములుగు గౌష్ ఆలం, రాజన్న సిరిసిల్ల అఖిల్ మహజన్, నిర్మల్ సిహెచ్. ప్రవీణ్ కుమార్, ఆదిలాబాద్ డి.ఉదయ్ కుమార్ రెడ్డి, ఆసీఫాబాద్ కె.సురేష్ కుమార్, సూర్యాపేట ఎస్. రాజేంద్ర ప్రసాద్, జగిత్యాల ఎ.భాస్కర్, జయశంకర్ భూపాలపల్లి జె.సురెందర్ రెడ్డి, జోగుళాంబ గద్వాల కె.సృజన, కామారెడ్డి బి.శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ కె.నర్సింహ, నాగర్ కర్నూల్ కె.మనోహర్, నారాయణపేట ఎన్.వెంకటేశ్వర్లు, సంగారెడ్డి ఎమ్.రమణకుమార్, సికింద్రాబాద్ ఎస్.కే.సలీమా, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…‘‘ కొన్ని దశాబ్దాల పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం అందరం కలిసి సమిష్టి కృషితో అతి తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో సమ్మిళితాభివృద్ధిని సాధించుకున్నాం. నేడు తెలంగాణ వ్యవసాయం ఐటి పరిశ్రమలు విద్యుత్ సహా అన్ని రంగాల్లో దేశంలోనే ముందంజలో వున్నది. నూతన రాష్ట్రంగా ఏర్పడ్డ నాటికి మనకన్నా ముందంజలో వున్న గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు పంజాబ్ హర్యానాలను దాటేసి తెలంగాణ ముందంజలోకి దూసుకుపోతున్నది. రాష్ట్రం వచ్చిన్నాడు కేవలం 8 లక్షల టన్నులు గా వున్న ఎరువుల వినియోగం నేడు 28 లక్షల టన్నులు వాడుతున్నం. వొక పద్ధతి ప్రకారం ఎటువంటి ఇబ్భంది రాకుండా ఎరువలను ఇతర వ్యవసాయ అవసరాలను రైతులకు అందుబాటులోకి తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన దార్శినిక విధానాలతోనే ఇది సాధ్యమైంది. వొకనాడు గంజికేంద్రాలు నడిచిన పాలమూరు లో నేడు పచ్చని పంటలతో పారే వాగులతో పాలుగారే పరిస్ఠితి నెలకొన్నది. ధాన్యం ఉత్పత్తిలో మనం పంజాబ్ ను దాటేసి పోతున్నం.’’ అని సిఎం వివరించారు.
ఉద్యమ నాయకత్వమే స్వయంగా పాలన చేస్తే ప్రగతి సాధించడం కష్టం అనే అపోహను పటాపంచలు చేస్తూ ఎటువంటి భావోద్వేగాలకు గురికాకుండా పరిపాలనను నిర్థిష్ట లక్ష్యంతో ముందుకు కొనసాగించడం జరిగిందన్నారు. తత్పలితంగా దేశానికే ఆదర్శవంతమైన పాలనను అందించగలిగామని సిఎం కేసీఆర్ అన్నారు. నేడు విద్యా వైద్య రంగాల్లో తెలంగాణ అత్యద్భుత ఫలితాలను అందుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ విద్యార్థుల నీట్ , ఐఎఎస్ పోటీ పరీక్షల్లో దేశంలోనే ముందువరసలో ర్యాంకులు సాధిస్తూ తెలంగాణ కీర్తిని చాటుతుండడం పట్ల సీఎం హర్షం వక్తం చేశారు. విద్యార్థులను అభినందించారు. కాగా నారాయణ్ పేట్ ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు సివిల్ సర్వీసెస్ లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకును సాధించిన నేపథ్యంలో సమావేశం అభినందనలు తెలిపింది.

వానాకాలం నారు రోహిణీ కార్తెలో.. యాసంగి నారు అనురాథ కార్తెలో :
గత పాలకులు నిర్లక్ష్యానికి కునారిల్లిపోయిన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాలనే దృఢ సంకల్పంతోనే వ్యవసాయ రంగ పునరుజ్జీవనమే ప్రధమ ప్రాధామ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని సిఎం అన్నారు. అందులో భాగంగా వ్యవసాయానికి సపోర్టు వ్యవస్థలయిన చెరువులు విద్యుత్తు సాగునీరు తదితర రంగాలను బలోపేతం చేసుకున్నామన్నారు. తత్ఫలితమే నేడు మనం చూస్తున్న దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర అభివృద్ధి’’ అని సిఎం అన్నారు. నేడు తెలంగాణలో ధాన్యం దిగుబడి 3 కోట్ల మెట్రిక్ టన్నులను దాటిపోతున్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన చర్యలను రైతులను సమన్వయం చేసుకుంటూ జిల్లా కలెక్టర్లు చేపట్టాలని సిఎం అన్నారు. ఇటీవలి కాలంలో కురిసిన అకాల వర్షాలు వడగండ్ల వానలు పర్యవసానంగా జరిగిన పంట నష్టం రైతుకు కలిగిన కష్టాలను గుణపాఘంగా తీసుకుని అందుకు అనుగుణంగా పంట విధానాలను మార్చుకోవాల్సిన అవసరమున్నదని సిఎం అన్నారు.

‘‘తాలు తక్కువ..తూకం ఎక్కువ’’
‘‘ ప్రాజెక్టులతో సాగు నీరు పుష్కలంగా అందుబాటులో వుంది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు వుంది. గ్రౌండ్ వాటర్ వుంది. ఇవాల మొగులు మొకం చూడకుంట కాల్వల నీల్లతోని వరి నాట్లు పెట్టుకునే పరిస్థితి నేడు తుంగతుర్తి సూర్యాపేట వంటి ప్రాంతాల్లో కూడా వుంది. ఈ నేపథ్యంలో..మన రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవాల్సి వుంటుంది. ముఖ్యంగా యాసంగి నాట్లు ఆలస్యం కావడం వలన కోతలు కూడా లేటయితున్నయి. మార్చి 31 లోపే జరగాల్సిన కోతలు మే నెల దాటినా కొనసాగుతున్నయి. దాంతో ఎండాకాలంలో వచ్చే అకాల వర్షాలు వడగండ్ల వానలతో వరి పంటలు నష్టపోతున్న పరిస్థితి తెలెత్తుతుంది. ఈ బాధలు తప్పాలంటే నవంబర్ 15…20 తారీఖుల్లోపల యాసంగి వరినాట్లు వేసుకోవాల్సి వుంటది. మరి యాసంగి ముందుగాల నాట్లు పడాలంటే వానకాలం వరినాటును కూడా ముందుకు జరుపుకోవాల్సి వుంటుంది. అందుకోసం రోహిణీ కార్తె ప్రారంభంలోనే వానాకాలం వరినాట్లు మొదలు కావాలె. మే 25 నుంచి 25 జూన్ వరకు వానాకాలం వరినాట్ల ప్రక్రియ పూర్తి కావాల్సి వుంది. ఈ దిశగా జిల్లా కలెక్టర్లు రాష్ట్ర రైతాంగాన్ని వ్యవసాయ శాఖ సహకారంతో చైతన్యం చేయాల్సి వుంటుంది.’’ అని సిఎం అన్నారు.

కాగా…యాసంగి లో వరినారు నవంబర్ నెలలో అలికితే తీవ్రమైన చలికి నారు పెరగదనే అపోహ రైతుల్లో వుందని అదివాస్తవం కాదని సిఎం అన్నారు. ‘‘ వరి తూకం పోసే టప్పుడు కాదు. వరి ఈనే సమయంలో చలి వుండొద్దు. ఈన్తానప్పడు చలి వుంటే తాలు ఎక్కువయితది. ఎండలు ముదరకముందే వరికోసుకుంటే గింజ గట్టిగవుండి తూకం కూడా బాగుంటది. ఇది రైతు సోదరులు గమనించాలె. వ్యవసాయశాఖ ఈ దిశగా రైతులను చైతన్యపరిచి అకాల వర్షాలతో పండిన పంటలు నష్టపోకుండా, ధాన్యం తడిసే పరిస్థితిలేకుండా..ముందుగానే నాట్లేసేకుని ముందస్తుగానే నూర్చుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలె..’’ అని సిఎం వివరించారు. యాసంగి వరిని ముందుగా నాటుకుంటే… ‘‘తాలు తక్కువయితది..తూకం ఎక్కువయితది’’ అని సిఎం రాష్ట్ర రైతాంగానికి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా…ఈ దిశగా వ్యవసాయ శాఖ తీసుకుంటున్న చర్యల వివరాలను సిఎం ఆదేశాలమేరకు ఆశాఖ మంత్రి సింగిరెడ్డ నిరంజన్ రెడ్డి సమావేశంలో వివరించారు. 21 రోజుల పాటు జరిగే దశాబ్ధి ఉత్సవాలను జిల్లాల వారీగా వీడియో రికార్డు చేసి బధ్రపరచాలని సిఎం కలెక్టర్లను ఆదేశించారు. అదే సందర్భంలో నియోజక వర్గాల వారీ జిల్లాల వారీగా జరిగిన అభివృద్ధిని తెలిపే .. పదేండ్ల ప్రగతి నివేదిక.. పుస్తకాలను ముద్రించి అందచేయాలన్నారు. ఇప్పటికే నిర్ణయించిన మేరకు ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధిని డాక్యుమెంటరీలు రూపొందుతున్నాయని వాటిని ఈ ఉత్సవాల సంధర్భంగా ప్రదర్శించాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు :
గిరిజనులకు పోడు భూముల పట్టాలు :
జూన్ 24 నుంచి 30 తారీఖు వరకు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ :
రాష్ట్రవ్యాప్తంగా…2845 గ్రామాలు తాండాలు గూడాల పరిథిలో ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో వున్న4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందచేయాలని సిఎం కేసీఆర్ ప్రకటించారు. తద్వారా1,50,224మంది గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని సిఎం స్పష్టం చేశారు. పోడుభూముల పట్టాలు అందించిన వెంటనే ప్రతి లబ్ధిదారుని పేరుతో ప్రభుత్వమే ఐఎఫ్ఎస్ కోడ్ తో కూడిన బ్యాంకు ఖాతాను తెరిపించాలని ఈ బాధ్యత గిరిజన సంక్షేమ శాఖ, కలెక్టర్లదేనని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ఖాతాల ద్వారా లబ్ధిదారులకు రైతుబంధును ప్రభుత్వం అందచేస్తుందని సిఎం తెలిపారు. వీరితో పాటు 3 లక్షల 8 వేల మంది ఆరో వో ఎఫ్ ఆర్ పట్టాదారులకు కూడా రైతుబంధును వర్తింపచేస్తామని సిఎం అన్నారు.

బీసీ ఎంబీసీ కులాలకు ఆర్థిక సాయం :
బీసీ కుల వృత్తులను కాపాడడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సిఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో కులవృత్తుల మీద జీవనం కొనసాగిస్తున్న విశ్వకర్మలు తదితర బీసీ ఎంబీసీ కులాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్షరూపాయల ఉచిత ఆర్థిక సాయాన్ని అందిస్తుందని సిఎం ప్రకటించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతను ఏర్పడిన సబ్ కమిటీ సమావేశమై ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలన్నారు. జూన్ 9 నాడు జరుపుకునే తెలంగాణ సంక్షేమ సంబురాల్లో…సబ్ కమిటీ సిఫారసు చేసిన ఇప్పటికీ ఆదుకోని బీసీ ఎంబీసీ కులాలకు లక్షరూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.

గృహలక్ష్మి పథకం :
నియోజకవర్గానికి 3 వేల చొప్పున అర్హులైన లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకాన్ని వర్తింపచేయాలని సిఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గృహలక్ష్మి పథకం కొనసాగుతుందని సిఎం స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆయా దశలను ఫోటోలు తదితర మార్గాల ద్వారా నిర్ధారించుకుని, నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు దశలవారీగా గృహలక్ష్మి పథకాన్ని వర్తింపచేయాలన్నారు.
సొంతజాగాలున్న లబ్ధిదారులకు మొదటి దశ అనగా బేస్ మెంట్ దశలో 1 లక్ష రూపాయలు, స్లాబ్ దశలో మరో లక్ష రూపాయలు, ఇంటి నిర్మాణం పూర్తయిన ఆఖరి దశలో మరో లక్షరూపాయలు మొత్తంగా మూడు లక్షల రూపాయలు అందచేయాలని సిఎం తెలిపారు.
ఇందుకు సంబంధించిన నిర్థిష్ట విధి విధానాలను రూపొందించి ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించాలని సిఎస్ శాంతి కుమారిని సిఎం కేసీఆర్ ఆదేశించారు.
ప్రతీ నియోజకవర్గానికి 1100 వందల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి క్రమపద్దతిలో దళితబంధు పథకాన్ని అమలు చేయాలని సిఎం తెలిపారు.
గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రారంభించి దశలవారీగా అమలు చేయాలని సిఎం తెలిపారు.
జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు మూడు వారాల పాటు సాగే..‘‘ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’’ రోజు వారీ కార్యక్రమాల పూర్తి వివరాలను గురువారం నాటి సమావేశంలో కలెక్టర్లకు సిఎం వివరించారు. ఈ దిశగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ విజయవంతం చేయాలని ఆదేశించారు.

జూన్ 2వ తేదీ- శుక్రవారం – ప్రారంభోత్సవం
• గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు.
• హైదరాబాద్ లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి గారిచే పతాకావిష్కరణ
• ముఖ్యమంత్రి గారిచే దశాబ్ది ఉత్సవ సందేశం
• జిల్లాల్లో మంత్రివర్యులఆధ్వర్యంలో పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశం.

జూన్ 3వ తేదీ – శనివారం — తెలంగాణ రైతు దినోత్సవం
• రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల్లో క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతుల సమావేశం. సమావేశం జాతీయగీతాలపనతో ప్రారంభం కావాలి.
• రైతు వేదికలను మామిడి తోరణాలు, పువ్వులు, సీరియల్ బల్బులతో అద్భుతంగా అలంకరించాలి.
• రైతు వేదికల ప్రాంగణాల్లోనూ, హాలు లోపల కూడా రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై ఫ్లెక్సీలు/పోస్టర్లు పెట్టాలి.
• ఉచిత కరంటు, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే విధంగా ఫ్లెక్సీలు ఉండాలి.
• సభలో రైతుబంధు సమితుల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు,PACS చైర్మన్లు, వ్యవసాయ, హార్టికల్చర్, మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులు, నాయకులుఅందరూ పాల్గొనాలి.
• పాంప్లెట్ లో వ్యవసాయరంగంలో జరిగిన సంపూర్ణ ప్రగతిని వివిధ పథకాల (ఉచిత విద్యుత్తు, రైతుబంధు మొదలైన వాటికింద) ఒక్కో రైతుకు కలిగిన లబ్దిని వివరించాలి. ఆ క్లస్టర్ లోని గ్రామాలకు వ్యవసాయశాఖ ద్వారా వచ్చిన నిధుల గురించి వివరించాలి. పాంప్లెట్లు సభలో ఆవిష్కరించాలి. పంచాలి. సభలో చదవాలి.
• రాష్ట్ర వ్యవసాయ శాఖ కరపత్రం,బుక్ లెట్, పోస్టర్ల వంటి సమాచార సామగ్రిని తయారు చేసి, కలెక్టర్లకు పంపిస్తుంది. వీటిని ప్రతి రైతుకు అందేలా పంపిణీ చేయాలి.
• రైతు బీమా లబ్దిదారులతో వారి కుటుంబానికి కలిగిన మేలును గురించి సభలో మాట్లాడించాలి.
• వ్యవసాయ కళాశాలల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి.
• రైతులందరితో సామూహిక భోజనం

జూన్ 4వ తేదీ – ఆదివారం – సురక్షా దినోత్సవం
(రాష్ట్రస్థాయి మరియు జిల్లాస్థాయి కార్యక్రమాలు)
• రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాన్ని, సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా కార్యక్రమాలు.
• పోలీసుశాఖలో జరిగిన సంస్కరణలను, వాటి విశిష్టతను సభల ద్వారా, కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేయాలి.
• పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను సత్వరంగా పూర్తి చేయడంలో తెలంగాణ పోలీస్ గత 8 సంవత్సరాలుగా దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిన విషయాన్ని హైలైట్ చేయాలి.
• ఈ విధంగా పోలీసుశాఖ సాధించిన ఘనతలను, విజయాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలను చేపట్టాలి.

హైదరాబాద్ నగర కార్యక్రమం…
• హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పై పెట్రోలింగ్ కార్స్, blue colts ర్యాలీ.
• హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని వారంతా పాల్గొంటారు.
• సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు -అంబేద్కర్ విగ్రహం ముందు పోలీస్ బ్యాండ్లతో ప్రదర్శన
• Know your Protectors థీమ్ తో ఎగ్జిబిషన్, పలు కార్యక్రమాలు. పోలీస్ జాగృతి కళాకారుల బృందాలతో ప్రదర్శనలు.
• పోలీసులు వాడుతున్న అధునాతన సాంకేతిక అంశాలు, బాడీ కెమెరాలు, బ్రీత్ అనలైజర్లు మొదలైన పరికరాల గురించి వివరిస్తారు.
• పోలీస్ జాగిలాలు వివిధ నైపుణ్యాల గురించి ప్రదర్శన
• మహిళా భద్రత – మహిళలకు 33శాతం రిజర్వేషన్ – పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విశిష్ట సేవలు – సీసీ కెమెరాలతో పటిష్ట నిఘాలో నెంబర్ 1గా తెలంగాణ తదితర విషయాలను షో కేస్ చేస్తారు.

జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు…
• పెట్రోలింగ్ కార్స్, Blue colts, ఫైర్ వెహికిల్స్ తదితరాలతోర్యాలీ నిర్వహించాలి.
• సాయంత్రం ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బందితో సభ నిర్వహించాలి. అనంతరం బడా ఖాన.

జూన్ 5వ తేదీ – సోమవారం – తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం
• నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించాలి (వెయ్యి మందితో), సమావేశంలో విద్యుత్ రంగంలో సాధించిన గుణాత్మక మార్పును వివరించాలి.
• సాయంత్రం రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం. ఈ సమావేశంలో రాష్ట్రం గత 9 ఏండ్లలో సాధించిన విజయాలపై డాక్యుమెంటరీ ప్రదర్శన, పుస్తకావిష్కరణ, ప్రసంగాలు.
• ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి, సీఎండీ జెన్ కో, ట్రాన్స్ కో, స్పెషల్ సీఎస్ ఎనర్జీ, మొత్తం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర విద్యుత్ వినియోగదారులు పాల్గొంటారు.
• రాష్ట్రంలోని అన్ని సబ్ స్టేషన్లను, ఇతర విద్యుత్ కార్యాలయాలను సీరియల్ బల్బులతో (21 రోజుల పాటు ఉండాలి), పూల తోరణాలతో అద్భుతంగా అలంకరించాలి.
• ప్రతి గ్రామంలో విద్యుత్తు గురించిన ఆకర్షణీయమైన ఫ్లెక్సీ నాడు – నేడు పద్ధతిలో ఏర్పాటు చేయాలి.
• విద్యుత్తు రంగంలో సాధించిన విజయాలను గురించి బుక్ లెట్ తయారు చేసి, విస్తృతంగా పంపిణీ చేయాలి.
• గతంలో కరంటు కోతల దుస్థితి – తెలంగాణ వచ్చిన తర్వాత వెలుగు జిలుగుల రాష్ట్రంగా మారిన విషయంతోపాటు…
• గ్రామంలో ఉన్న మొత్తం కనెక్షన్లు – తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన కొత్త కనెక్షన్లు – ఉచిత విద్యుత్తు కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధుల వివరాలు, రైతులకు జరుగుతున్న మేలు, ఇతర రంగాలకు నిరంతరాయంగా విద్యుత్తు ఇస్తున్న విషయం, దానివల్ల వివిధ వృత్తులు, వ్యాపార వ్యవహారాలు సజావుగా నడవడం, గ్రామీణ జీవితంలో వచ్చిన సౌకర్యం తదితర అంశాలను పొందుపరచాలి.
• సోలార్, హైడల్, థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి గణనీయంగా పెరిగిన తీరును హైలేట్ చేయాలి.
• విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసిన తీరును, దీనికోసం చేసిన ఖర్చు, తదితర వివరాలను వెల్లడించాలి.
• ఇదేరోజు సింగరేణి సంబురాలు జరపాలి, సింగరేణి సీఎండి నేతృత్వం వహించాలి.
• సింగరేణి గనికార్మికులతో సమావేశాలు – కంపెనీ ఉత్పత్తి, టర్నోవర్ పెరగడం, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బోనస్ ఇవ్వడం, కారుణ్య నియామకాలు, సింగరేణి కార్మికుల కోసం చేపట్టిన ఇతర సంక్షేమ కార్యక్రమాలను హైలైట్ చేయాలి.
• సాంస్కృతిక కార్యక్రమాలు – కార్మికులతో సామూహిక భోజనాలు (సింగరేణి కంపెనీ ఆధ్వర్యంలో ఇవి నిర్వహించాలి)

జూన్ 6వ తేదీ – మంగళవారం – తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం
• పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహించాలి.
• ఈ సభలో పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని ప్రకటించాలి. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపన, అనుమతులు సులభతరమైన విషయాన్ని ప్రస్తావించాలి.
• రాష్ట్రానికి తరలి వచ్చిన పెట్టుబడుల వెల్లువకు సంబంధించిన వివరాలను, తద్వారా పెరిగిన ఉద్యోగ ఉపాధి అవకాశాల వివరాలు ప్రకటించాలి. పాంప్లెట్లు ప్రచురించి, పంచాలి.
• టి హబ్, వి హబ్ లలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సమావేశం నిర్వహించాలి.
• ఐటీ ఎగుమతులు, ఉద్యోగ కల్పనలో హైదరాబాద్, బెంగళూరును అదిగమించి దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన తీరును ఆవిష్కరించాలి.

జూన్ 7వ తేదీ – బుధవారం – సాగునీటి దినోత్సవం
• కాళేశ్వరం ప్రాజెక్టు పై ప్రభుత్వం రూపొందించిన డాక్యుమెంటరీని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శించాలి. ఈ డాక్యుమెంటరీని జిల్లా కలెక్టర్లు అందరికీ పంపిస్తారు. (మంత్రి కేటీఆర్ గారు అమెరికా సదస్సులో ప్రదర్శించినది)
• సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో 1000 మందితో సభ.
• ఈ సభలో రైతులు, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొనాలి.
• రాష్ట్రంలోనూ, నియోజకవర్గంలోనూ ఇరిగేషన్ రంగంలో జరిగిన ప్రగతిని వివరించాలి. అత్యధికశాతం నిధులు వెచ్చించి, బృహత్తరమైన ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించిన విషయం వెల్లడించాలి. ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన బహుళదశల ఎత్తిపోతల, బహుళార్దకసాధక కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్ల రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనతను ప్రముఖంగా తెలియజేయాలి.
• అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టులు పూర్తి కావస్తున్న విషయాన్ని తెలియజేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో చెక్ డ్యాంల నిర్మించడం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగిన విషయం తెలియజేయాలి. కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణలో నేడు దాదాపు 85 లక్షల ఎకరాలకు సాగు నీటి సరఫరా జరుపుతూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ప్రభుత్వ కృషిని గొప్పగా తెలియజేయాలి.
రాష్ట్రస్థాయి కార్యక్రమం….
• రవీంద్ర భారతిలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశంజరుగుతుంది. పుస్తకాల ఆవిష్కరణ, ప్రసంగాలు. తదితర కార్యక్రమాలు ఉంటాయి.
• ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, మేధావులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొంటారు.

జూన్ 8వ తేదీ –గురువారం – ఊరూరాచెరువుల పండుగ
• గ్రామ పంచాయతీలు, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పెద్ద చెరువు వద్ద సాయంత్రం 5 గంటలకు చెరువుల పండుగ నిర్వహించాలి.
• గ్రామం నుంచి డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్స్య కారుల వలలతో ఊరేగింపుగా బయలుదేరాలి.
• గ్రామంలోనిరైతులు, మత్స్య కారులు, మహిళలుఅన్ని వర్గాల ప్రజలు చెరువు కట్టకు చేరుకోవాలి.
• చెరువు గట్టుపై పండుగ వాతావరణం ప్రతిఫలించేలా ముగ్గులు, తోరణాలతో అందంగా అలంకరించాలి.
• కట్ట మైసమ్మపూజ – చెరువు నీటికి పూజ చేయాలి.
• తదనంతరం సభ, సాంస్కృతిక కార్యక్రమాలు – బతుకమ్మ, కోలాటాలు – పాటలు, గోరేటి వెంకన్న రాసిన చెరువోయి.. మా ఊరి చెరువు తదితర చెరువు పాటలు వినిపించాలి.
• ఇరిగేషన్ లో వచ్చిన ప్రగతి, తద్వారా పెరిగిన పంటల ఉత్పత్తి వివరాలు, మత్స్య సంపద, భూగర్బ జలాల పెరుగుదల.. తదితర వివరాలను తెలియజేస్తూ, ఫ్లెక్సీలు పెట్టాలి – పాంప్లెట్లు పంచాలి – చదివి వినిపించాలి.
• నాయకులు, ప్రజలు కలిసిచెరువు కట్టమీదసహపంక్తిభోజనాలు చేయాలి.
• ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, మేధావులు, తదితరులు పాల్గొంటారు.

జూన్ 9,శుక్రవారం – తెలంగాణ సంక్షేమ సంబురాలు
• నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పించన్లు, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులతో వెయ్యి మందికి తగ్గకుండా పాల్గొనేలా సభ నిర్వహించాలి.
• ఆ నియోజకవర్గంలో ఎంత మంది పించన్లు, కల్యాణ లక్ష్మి, తదితర సంక్షేమ పథకాల లబ్ధి పొందారు, ఇందుకోసం ఎన్ని నిధులు వెచ్చించారు, దాని ఫలితాలు గురించి వివరించాలి.
• తాము పొందిన లబ్ధి గురించి, లబ్ధిదారుల చేత మాట్లాడించాలి.
రాష్ట్ర స్థాయి కార్యక్రమం…
• తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగం సాధించిన తీరును, దేశానికి దిక్సూచిగా మారిన తీరును వివరిస్తూ రవీంద్ర భారతిలో ఒక సభ నిర్వహించాలి.
• మొత్తం రాష్ట్రంలో అమలైన అన్ని సంక్షేమ కార్యక్రమాల వివరాలు, లబ్ధిదారుల సంఖ్య, ఇందుకోసం వెచ్చిన నిధులు.. వంటి పూర్తి వివరాలు తమ తమ ప్రసంగాల ద్వారా సభలో ఆవిష్కరించాలి.
• గౌరవ మంత్రి వర్యులు, ఆ శాఖ అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు ఇందులో పాల్గొంటారు.
• గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి.
• గతంలో భూములు సేకరించిన చోట, అందుబాటులో ఉన్న చోట అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలి.
• వివిధ గ్రామీణ వృత్తి పనుల వారికి ఆర్థిక ప్రేరణ కింద లక్ష రూపాయల పంపిణీ పథకం ప్రారంభం.

జూన్ 10వ తేదీ, శనివారం – తెలంగాణ సుపరిపాలన దినోత్సవం – పరిపాలన సంస్కరణలు, ఫలితాలు
• అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును ప్రముఖంగా ప్రస్తావించాలి.
• ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు అందరినీ భాగస్వామ్యం చేయాలి.
• ఆయా జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు, రెవిన్యూ డివిజన్లు, కొత్త జిల్లాలు తదితర వివరాలతో కరపత్రం తయారు చేసి పంపిణీ చేయాలి. వీటివల్ల ప్రజలకు దూరభారం తగ్గడమే కాకుండా, పరిపాలన పరమైన పర్యవేక్షణ సులభతరమైన విషయాన్ని పేర్కొనాలి.
• వివిధ శాఖలను పునర్ వ్యవస్థీకరణ చేయడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతున్నవిషయాన్నివివరించాలి.
• ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, మిషన్ భగీరథ, హెల్త్, విద్యుత్తు, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల పునర్ వ్యవస్థీకరించిన తీరుతెన్నులను, తద్వారా పరిపాలన సుగమమై ప్రజలకు చక్కని సేవలు అందుతున్న విధానాన్ని, వీటి ప్రభావంతో ప్రజాజీవితంలో వచ్చిన మెరుగుదలపై నివేదిక తయారు చేయాలి.
• రాష్ట్రస్థాయిలోనూ సమావేశం నిర్వహించి, పై అంశాల గురించి వివరించాలి.
• నూతనంగా ఏర్పడిన మండలాలు, మున్సిపాలిటీల్లో సంబురాలు జరిగేలా స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి.

జూన్ 11వ తేదీ, ఆదివారం – తెలంగాణ సాహిత్య దినోత్సవం
రాష్ట్ర స్థాయిలో, జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు
• రవీంద్రభారతిలో తెలంగాణ గంగాజమునా తెహజీబ్ ప్రతిబింబించేలా ఉర్దూ, తెలుగు కవులచే రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం
• ఈ కార్యక్రమాల్లో తెలంగాణ కవులు, సాహిత్యాభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
• తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా కవితలు ఉండాలి
• రాష్ట్రస్థాయిలో ఉత్తమమైన 5 పద్య కవితలను, 5 వచన కవితలను ఎంపిక చేసి వాటికి నగదు బహుమతులు ప్రకటించాలి.
• జిల్లాస్థాయి కవి సమ్మేళనంలో చదివిన కవితలతో కవితా సంకలనం ప్రచురించాలి.
• రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో చదివిన కవితలతో కూడా ఒక కవితా సంకలనాన్ని ప్రచురించాలి.

జూన్ 12వ తేదీ – సోమవారం – తెలంగాణ రన్
• తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమం నిర్వహించాలి.
• ఈ రన్ కార్యక్రమంపోలీసు శాఖ నేతృత్వంలో జరుగుతుంది.
• క్రీడలు, యువజన సర్వీసులశాఖ భాగస్వామ్యాన్ని పంచుకోవాలి.
• ఈ సందర్భంగా ప్రత్యేకంగా బెలూన్స్ ఎగురవేయాలి.

జూన్ 13 కార్యక్రమం..మంగళవారం – తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం
• నియోజకవర్గం కేంద్రంలోమహిళా సదస్సు నిర్వహించాలి. ఈ సదస్సులో అంగన్వాడీ టీచర్లు, సెర్ప్ సిబ్బంది, ఇతరులు మొత్తం 1000 మందికి తగ్గకుండా పాల్గొనేలా చూడాలి. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమావేశంలో వివరించాలి.
• బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, ఆరోగ్య మహిళ, పోలీసు శాఖలో 33శాతం రిజర్వేషన్, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్, మహిళలకు వీఎల్ఆర్, షీ టీమ్స్, వి హబ్ ఏర్పాటు, మహిళా ఉద్యోగుణులకు ప్రసూతి సెలవులు పెంచిన విషయం తదితర విషయాలన్నింటిని ఘనంగా పేర్కొనాలి.
• అంగన్ వాడీలకు, ఆశా వర్కర్లకు ఇతర మహిళా ఉద్యోగులకు వేతనాలు పెంచిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలి.
• మహిళా డిగ్రీ కళాశాలలను విరివిగా ఏర్పాటుచేసిన విషయాన్ని ప్రస్తావించాలి.
• మహిళలతో ఎక్కువగా మాట్లాడించాలి.
• ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం చేయాలి.
• ఈ సమావేశంలో మహిళా ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులందరూ పాల్గొనాలి.

జూన్ 14 కార్యక్రమం…బుధవారం – తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం
• హైదరాబాద్ లోని నిమ్స్ లో నూతనంగా ప్రభుత్వం తలపెట్టిన 2000 పడకల ఆసుపత్రి నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గారిచే శంఖుస్థాపన.
• నియోజకవర్గ స్థాయిలో కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, నూతన మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీల విద్యార్థులు తదితరులను ఆహ్వానించి సభ నిర్వహించాలి.
• ఇందులో వైద్యారోగ్య రంగంలో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని పేర్కొనాలి. 33 మెడికల్ కాలేజీలు, బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, కంటి వెలుగు, న్యూట్రీషన్ కిట్లు, కేసీఆర్ కిట్లు, ఎంసీహెచ్ లు, మాతా శిశు సంరక్షణ సేవలు, పెరిగిన మౌలిక వసతులు వంటి పూర్తి వివరాల గురించి వివరించాలి.
• వైద్యారోగ్య రంగంలో సాధించిన సంపూర్ణ ప్రగతిని తెలియజేస్తూ, ఆ శాఖ ఒక కరపత్రాన్ని రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయాలి.
• అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయాలి.
• ఉత్తమ ఆశా వర్కర్, ఉత్తమ ఏఎన్ఎం, ఉత్తమ స్టాఫ్ నర్స్, ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్, ఉత్తమ డాక్టర్లకు సన్మానం చేయాలి. అవార్డులు అందించాలి.

జూన్15గురువారం – తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం
• ప్రతి గ్రామ పంచాయతీ ముందు జాతీయ జెండా ఎగురవేయాలి. అనంతరం పల్లె ప్రగతి ద్వారా, గ్రామానికి వచ్చిన నిధుల వివరాలను, వివిధ సంక్షేమ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు జరిగిన లబ్ధిని, గ్రామంలో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను ప్రకటించాలి.
• గ్రామ పారిశుద్ద్యం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరును వివరించాలి. జాతీయ స్థాయిలో సాధించిన అవార్డుల వివరాలను తెలియజేయాలి.
• నాడు – నేడు ఫార్మాట్ లో గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి గురించి, ప్రజా సంక్షేమానికి మరియు పంచాయతీరాజ్ ద్వారా వస్తున్న నిధుల వివరాలతో ఊరూరా ఫ్లెక్సీలు పెట్టాలి.
• ఊరిలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ ఫ్లెక్సీలు పెట్టాలి.
• ఫొటోలతో బ్రోచర్ల మాదిరిగా తయారుచేసి పంచాలి.
• రాష్ట్ర స్థాయిలో రవీంద్రభారతిలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పల్లెప్రగతిపై సమావేశం. సంబంధిత మంత్రితో పాటు, ఉన్నతాధికారులు పాల్గొంటారు.
• ఈ సమావేశంలో పల్లెప్రగతి విజయాలను, జాతీయ స్థాయిలో సాధించిన అవార్డులను పేర్కొనాలి. పారిశుద్ద్యం మెరుగు పడటం వల్ల సీజనల్ వ్యాధులు తగ్గిపోయిన తీరును ప్రముఖంగా ప్రస్తావించాలి. గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగిన తీరును ప్రస్తావించాలి.
• ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం చేయాలి.

జూన్ 16వ తేదీ – శుక్రవారం- తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం
• ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీల ఆధ్వర్యంలోజాతీయ జెండా ఎగురవేయాలి. అనంతరం పట్టణ ప్రగతి ద్వారా, పట్టణానికి వచ్చిన నిధుల వివరాలను, వివిధ సంక్షేమ పథకాల ద్వారా పట్టణ ప్రజలకు జరిగిన లబ్ధిని, పట్టణంలో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను ప్రకటించాలి. పట్టణ పారిశుద్ద్యం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరును వివరించాలి. జాతీయ స్థాయిలో పట్టణాభివృద్ధిలో సాధించిన అవార్డుల వివరాలను తెలియజేయాలి.
• వివిధ పట్టణాల్లో నిర్మించిన సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల గురించి, వైకుంఠధామాల నిర్మాణం గురించి, డంప్ యార్డుల గురించి, అర్బన్ ఫారెస్ట్, పార్కుల నిర్మాణం, 10శాతం గ్రీన్ బడ్జెట్ గా కేటాయించడం తదితర అభివృద్ధి అంశాల గురించి ప్రస్తావించాలి.
• నాడు – నేడు ఫార్మాట్ లో పట్టణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి గురించి, ప్రజా సంక్షేమానికి మరియు పురపాలక శాఖ ద్వారా వస్తున్న నిధుల వివరాలతో పట్టణాల్లో ఫ్లెక్సీలు పెట్టాలి.
• ఫొటోలతో బ్రోచర్ల మాదిరిగా తయారుచేసి పంచాలి.
• విశ్వనగరంగా హైదరాబాద్ ను రూపుదిద్దేందుకు ప్రభుత్వం చేసిన యావత్ కృషిని తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించాలి.
• హైదరాబాద్ లో నిర్మించిన స్కైవేలు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, వివిధ బ్రిడ్జీల నిర్మాణం, చెరువుల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి, మెట్రో రైలు నిర్మాణం, విస్తరణ, రోడ్ల అభివృద్ది పనులు, నాలాల అభివృద్ధి పనులు, చారిత్రక ప్రదేశాల అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు, మొదలైన అన్ని విషయాల గురించి హైలేట్ చేస్తూ నగరంలోని రవీంద్ర భారతిలో పెద్ద సభ నిర్వహించాలి.
• హైదరాబాద్ లో తాగునీటి ఎద్దడిని పరిష్కరించిన తీరు, భవిష్యత్ అవసరాల కోసం రింగ్ మెయిన్ నిర్మాణం, ఉచితంగా తాగునీటి సరఫరావిషయాలు వివరించాలి.
• దేశానికే దిక్సూచిగా టీఎస్ బి పాస్ చట్టం తీసుకొచ్చిన సంగతి, తద్వారా సులువైన నిర్మాణ అనుమతుల ప్రక్రియ వంటి అంశాలను హైలైట్ చేయాలి.
• జీవో 58, 59 తదితర జీవోల ద్వారా పేద ప్రజలు నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలు అందజేసిన విధానం గురించి ప్రముఖంగా ప్రస్తావించాలి.
• ఉత్తమ మున్సిపాలిటీల, కార్పొరేషన్ల వార్డు కౌన్సిలర్లకు, చైర్మన్లకు, మేయర్లకు, ఉద్యోగులకు సన్మానం చేయాలి.

జూన్ 17వ తేదీ – శనివారం – తెలంగాణ గిరిజనోత్సవం
• ఆయా గిరిజన గ్రామాల్లోసభలు
• గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించాలి.
• గిరిజనుల చిరకాల వాంఛను తీరుస్తూ తండాలకు, గూడాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించి తీరును, విద్య, ఉద్యోగాల్లో ఎస్టీల రిజర్వేషన్ 10 శాతం పెంచిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలి.
• హైదరాబాద్ లో బంజారా భవన్, ఆదివాసి భవన్ నిర్మాణం చేసిన విషయం హైలైట్ చేయాలి. కుమ్రంభీం జయంతిని, సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని ప్రకటించాలి.
• సమ్మక్క సారక్క జాతరను రాష్ట్ర జాతరగా నిర్వహిస్తున్న తీరును, అందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తున్న తీరును ప్రస్తావించాలి. వివిధ జాతరలకు ప్రభుత్వ ఆర్థిక సాయం చేస్తున్న తీరును, తదితర వివరాలను వెల్లడించాలి.
• రాష్ట్రస్థాయిలో నగరంలోని రవీంద్ర భారతిలో గిరిజనులతో పెద్ద ఎత్తున సమావేశం. ఇందులో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు.

జూన్ 18వ తేదీ – ఆదివారం – తెలంగాణ మంచి నీళ్ల పండుగ
• ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, పాత్రికేయులు, వివిధ వర్గాల ప్రజలతో మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల సందర్శన కార్యక్రమం నిర్వహించాలి. నీళ్లను శుభ్రపర్చుతున్న తీరును వివరించాలి. ఇంటింటికి నల్లాల ద్వారా సరఫరా అవుతున్న తీరును వివరించాలి.
• సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో భయంకరమైన తాగునీటి ఎద్దడి ఉన్న తీరును ప్రస్తావిస్తూ, మిషన్ భగీరథ ద్వారా ఆ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించిన విధానాన్ని అద్భుతంగా తెలియజేయాలి.
• గ్రామంలోని మహిళలతో సభ నిర్వహించాలి. గతంలో మంచినీటి కోసం పడ్డ కష్టాలను, బిందెడు నీళ్ల కోసం వీధి పోరాటాలు చేయాల్సి వచ్చిన దుస్థితిని ప్రస్తావించాలి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ఉచితంగా నల్లాలు బిగించి ఉచితంగా స్వచ్ఛమైన సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించాలి..
• తాగునీటి కష్టాలు సంపూర్ణంగా తీరిపోయి, మహిళలు సంతోషిస్తున్న విధానాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలి. ఈ కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగులందరినీ భాగస్వామ్యం చేయాలి.
• రాష్ట్ర స్థాయిలో రవీంద్ర భారతిలో సభ నిర్వహించాలి. ఇందులో సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులు పాల్గొనాలి.మిషన్ భగీరథ విజయాలను విశేషంగా తెలియజేయాలి.

జూన్ 19వ తేదీ – సోమవారం – తెలంగాణ హరితోత్సవం
• రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలి. నర్సరీలను సందర్శించాలి.
• మొక్కలు నాటే కార్యక్రమం (మాస్ ప్లాంటేషన్) అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లోనూ విధిగా నిర్వహించాలి.
• అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని వివరించాలి. అడవుల పునరుద్ధరణ కోసం తీసుకున్నచర్యలు, వచ్చిన ఫలితాల గురించి వివరించాలి.
• గ్రీన్ కవర్ పెంచడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్న విషయాన్ని వెల్లడించాలి. హైదరాబాద్ కు గ్రీన్ సిటీ, ఇతర అవార్డులు వచ్చిన తీరును వివరించాలి.

జూన్ 20వ తేదీ – మంగళవారం – తెలంగాణ విద్యాదినోత్సవం
• రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు, అన్ని గురుకుల పాఠశాలలు, వైద్య, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఫారెస్ట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ తదితర అన్ని విద్యాసంస్థల్లో ఉదయం పతాక వందనం చేయాలి. తదనంతరం సభలో విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను పేర్కొనాలి.
• ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మనఊరు మన బడి పాఠశాలల ప్రారంభోత్సవం నిర్వహించాలి.సిద్ధంగా ఉన్న పది వేల గ్రంథాలయాలను, 1600 డిజిటల్ క్లాస్ రూమ్స్ లను ప్రారంభించాలి.
• పిల్లలకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు, తదితర కార్యక్రమాలు నిర్వహించాలి.
• ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలతో, పూలతో అందంగా అలంకరించాలి.
• విద్యారంగంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరు మన బడి కార్యక్రమంతో పాటు, 1001 గురుకులాల స్థాపన, నూతన విశ్వవిద్యాలయాల ఏర్పాటు (హార్టికల్చర్, ఫారెస్ట్, మహిళ, హెల్త్ యూనివర్సిటీ, తదితర) జిల్లాకు ఒకటి చొప్పున ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు., నూతనంగా నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు (రెసిడెన్షియల్ తో సహా), డిగ్రీ కాలేజీల (రెసిడెన్షియల్ తో సహా) ఏర్పాటు తదితర వివరాలను వెల్లడించాలి.

జూన్ 21వ తేదీ – బుధవారం
తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం
• దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర ప్రార్ధనా మందిరాలకు అలంకరణ
• దేవాలయాల్లో వేద పారాయణం, మసీదులు, చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు
• ప్రముఖ క్షేత్రాల్లో ప్రత్యేక భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు.
• హరికథలు, పురాణ ప్రవచనాలు తదితర కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరూ విధిగా పాల్గొనాలి.

జూన్ 22వ తేదీ – గురువారం – అమరుల సంస్మరణ
• ఊరూరా గ్రామ పంచాయతీలు ఉదయం 11 గంటలకు సమావేశం కావాలి. అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటించాలి. అమరులసంస్మరణ తీర్మానం చేయాలి.
• ఇదే విధంగారాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులలో శ్రద్ధాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించాలి. నిర్ణీత ఫార్మాట్ లో అమరుల సంస్మరణ తీర్మానాలు చేయాలి.
• రాష్ట్రంలోని అన్ని విద్యాలయాల్లో ప్రార్థనా సమావేశంలో అమరుల స్మృతిలో 2 నిమిషాలు మౌనం పాటించాలి. వారి త్యాగాలను గురించి ప్రస్తుతించాలి.
• హైదరాబాద్లో అమరుల గౌరవార్ధం ట్యాంక్ బండ్ నుంచి 6 వేల మందికి తగ్గకుండా, కళాకారులతో భారీ ర్యాలీ -ముఖ్యమంత్రి గారిచే అమరవీరుల స్మారకం ప్రారంభించడం జరుగుతుంది.
• మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి, సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించే సభలో పాల్గొనాలి.
• హైదరాబాద్ సభలో అమరులకు నివాళి సూచకంగా, సభలోని వారందరి చేతుల్లో ఎలక్ట్రిక్ క్యాండిల్స్ ఉండే విధంగా ఏర్పాటు చేయాలి.
• కళాకారుల ర్యాలీని సాంస్కృతిక శాఖ నిర్వహిస్తుంది.

Leave a Reply