– స్కాములు చేసి జనం డబ్బులు కొట్టేసిన మీ నాన్నే “జాదూ బాబు”
– అవినీతి కేసుల్లో, స్కాముల్లో స్టేలు తెచ్చుకొన్నది మీ బాబు కాదా..?
– ఏలేరు స్కాం నుంచి ఐఎంజీ వరకు వేల కోట్ల స్కాములు చేసింది బాబే.
– నాడు వైఎస్ గారి కాళ్ళు పట్టుకుని అరెస్టు నుంచి బయట పడింది నిజం కాదా బాబూ?
– బాబు కుంభకోణాలపై ప్రభుత్వం విచారణ జరిపించాలి
– మంగళగిరిలో గెలవలేని పనికిమాలిన లోకేశ్.. ఆ పార్టీని అధికారంలోకి తెస్తాడా?
– నెత్తి మీద రూపాయి పెడితే పావలాకి చెల్లని లోకేశ్ బ్లడ్, బ్రీడ్ గురించి ప్రగల్భాలా..?
– ప్రతి ఎన్నికల్లోనూ డిపాజిట్లు కోల్పోయిన వీళ్ళు దమ్మూ, ధైర్యం, పౌరుషం గురించి మాట్లాడటం సిగ్గుచేటు
– రూ. 2 లక్షల కోట్లు నేరుగా పేదల అకౌంట్లలో డబ్బు వేస్తే రాష్ట్రం వెనక్కి పోతుందా..?
-ః బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి
సీమెన్స్ లో రూ. 250 కోట్ల దొంగ చంద్రబాబే
లోకేశ్… మీ నాన్న చేసిన ఒక కుంభకోణాన్ని ఈ రోజు బయటపెడుతున్నాను. దానికి సమాధానం చెప్పి, ఆ తర్వాత మాపై మాట్లాడితే బాగుంటుంది. 2014–19 సమయంలో సీమెన్స్ సంస్థతో ఒప్పందం పేరిట రూ.250 కోట్ల కుంభకోణానికి పాల్పడింది మీరు. ప్రభుత్వ, ప్రజా ధనాన్ని ఇంత పెద్దమొత్తంలో దోచుకున్న కుంభకోణానికి మీరేం సమాధానం చెబుతారు? . షెల్ కంపెనీలు ప్రారంభించి, ఆ సొమ్మును ఆ కంపెనీల్లోకి మళ్లించి, మీరు స్వాహా చేసింది వాస్తవం కాదా? అని అడుగుతున్నాను.
– జాదూ పదానికి అర్థం మాయం చేయడం… మరి ఈ రూ.250 కోట్లను ఎలా మాయమయ్యాయో చెప్పు లోకేశ్?. నువ్వు అనాల్సింది జాదూ బాబు అని. ఆ పదానికి మీ తండ్రీ కొడుకులిద్దరూ సరిపోతారు. బాబు ఏ రోజూ నీతి పరుడు కాదు. బాబు అవినీతిని, దోపిడీని ఎప్పుడు నిరూపించాలని చూసినా.. వెంటనే కోర్టులకు పరుగులు తీసి స్టేలు తెచ్చుకుంటాడు.
కాళ్ళు పట్టుకుంటే వైఎస్ నాడు వదిలేశారుః
లోకేశ్ కు, చంద్రబాబుకు వస్తున్న జనాన్ని చూస్తుంటే.. 23 కాదు కదా.. రోండో, మూడో సీట్లు కూడా రావని టీడీపీకి బాగా అర్థమైంది. కాబట్టే, తండ్రీకొడుకు బాగా ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళారు. వారి సమావేశాల్లో కొందరు మహిళలు జై జగన్ అని నినదిస్తున్నారు. కొందరు నిన్ను నమ్మం బాబూ అంటున్నారు. ఈ రోజు మరో టీడీపీ కార్యకర్త బాబుతో మాట్లాడుతూ … మీరు ఆంధ్రప్రదేశ్‌లో ఇల్లు కట్టుకుని, నివాసం ఉండి ఇక్కడ రాజకీయం చేయండి సార్…లేకపోతే జనం మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని కుండ బద్దలు కొట్టారంటే … టీడీపీ స్థాయి ఎంతకు దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కానీ లోకేశ్, బాబులు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారంటే.. చనిపోయిన వైఎస్ రాజశేఖరరెడ్డి గారిని కూడా రాజకీయాల్లోకి తెచ్చి, 24 కమిషన్లు వేసినా, విచారణ సంఘాలను వేసినా వైఎస్ గారు తమ అవినీతిని నిరూపించలేకపోయారని లోకేశ్ బరితెగించి మాట్లాడుతున్నారు.
– దీనికి నేను చెబుతున్న సమాధానం ఒక్కటే. చంద్రబాబు దొంగ అని, అవినీతిపరుడు అని తెలిసినా, ఆ విచారణలు మరో రెండు అడుగులు ముందుకు వేస్తే.. చంద్రబాబు అరెస్ట్ కావడం ఖాయం అని వైఎస్ఆర్ గారికి తెలిసినా, చంద్రబాబు కాళ్ళు పట్టుకోవడంతో ఆరోజున వైఎస్ఆర్ గారు పోనీలే.. ఇలాంటి అల్పుడు మీద వజ్రాయుధాలు ఎందుకు అని వదిలేశారు.
– బాలకృష్ణ కేసులో వైఎస్ గారు చూపించిన మేలు కానివ్వండి… ఔదార్యం అనండి… లోకేశ్, బాబు, టీడీపీ శ్రేణులు ఒకసారి ఆ సంఘటనలను గుర్తు చేసుకుంటే మంచిది. ఈ రోజు మేమంత శూరులం..ఇంత శూరులం..అని ప్రగల్భాలు పలకడం మేకపోతు గాంభీర్యం కాక మరేమనాలి?
బాబు స్టేల బాగోతం….
చంద్రబాబు జీవితమంతా కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోవడమే. అమరావతి రాజధాని భూముల విషయంలో విచారణ అంటే స్టే తెచ్చుకున్నాడు. అచ్చెన్నాయుడు కుంభకోణంపై విచారణ చేయిద్దామనుకుంటే దానిపై స్టే తెచ్చుకున్నారు. సంగం డెయిరీలో చేసిన అక్రమాలపై విచారణకు ఉపక్రమించబోతే దానిపైనా ధూళిపాళ నరేంద్ర స్టే తెచ్చాడు. లక్ష్మీపార్వతి గారు బాబు అక్రమ ఆస్తులపై విచారణ కోరితే ఆ కేసులోనూ యథావిధిగా స్టే తెచ్చుకున్నాడు. విదేశీ పెట్టుబడులపై విచారణను కొనసాగించకుండా అడ్డం పడ్డాడు.
– ఏలేరు కాలువ పనుల విషయంలో అక్కడ పరిహారం చెల్లింపుల్లో చంద్రబాబు బినామీ పోతిరెడ్డి పేరిట ఖాతా ప్రారంభించి, ఆ పరిహారం సొమ్మును బాబు దోచుకున్న విషయం నిజం కాదా?. ఈ అక్రమాలపై జస్టిస్ లక్ష్మారెడ్డి విచారణకు ప్రయత్నిస్తే సాంకేతికంగా ఈ విచారణ సరికాదని తప్పించుకోలేదా.? విచారణను తొక్కిపెట్టిన సంగతి వాస్తవం కాదా?..బాబు హయాంలో ఇలాంటి కుంభకోణాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. చంద్రబాబు కుంభకోణాలపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
పౌరుషం అంటే జగన్ దిః
ఆ రోజు జగన్ గారు ఏ తప్పూ చేయకపోయినా.. బాబు చేసిన నిర్వాకం ఎంత దుర్మార్గమో అందరికీ తెలుసు. సోనియా, కాంగ్రెస్ పెద్దల కాళ్లు పట్టుకుని సాక్షిలో పెట్టుబడుల పేరిట జగన్ గారిపై అక్రమ కేసులు బనాయించిన మాట వాస్తవం కాదా? ఆ రోజు మీరెన్ని కుట్రలు పన్నినా, దమ్మూ, ధైర్యంతో పోరాడి ప్రజా న్యాయస్థానంలో జగన్ గారు గెలిచారు. ప్రజా న్యాయస్థానంలో ఆ కేసులన్నింటినీ ప్రజలు ఏనాడో తిరస్కరించారు కాబట్టే, ఉప ఎన్నికల్లో 15 సీట్లతో మొదలై, తర్వాత ఎన్నికల్లో 67కు పెరిగి, 2019లో 151 తెచ్చుకోగలిగాడు ఆయన.
లోకేశ్ మనిషే కాదుః
లోకేశ్ మనిషిగా విఫలమయ్యాడు. నగరి వెళ్ళి మహిళా మంత్రి రోజా గారిపై విమర్శలు చేస్తాడు. మీకొక కథ చెబుతాను. రెండు మూడు సినిమాలు తీసిన ఒక నిర్మాత అవి అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత…ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు నటన రాదు… అని విమర్శలు చేస్తే ఎలా ఉంటుందో… రోజా గారి గురించి లోకేశ్ మాటలు అలాగే ఉంటాయి. ఇలాంటి మాటలు విని జనం నవ్వుకోవడమే కాదు…చెప్పుచ్చుకుని ఆ చెంపా ఈ చెంపా వాయిస్తారు. ఈ మాటలు చాలా ఎబ్బెట్టుగా , ఛండాలంగా ఉన్నాయని తన పార్టీ కార్యకర్తలే లోకేశ్‌పై మండిపడుతున్నారు.
– మంగళగిరి లో గెలవలేని దద్దమ్మ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి, టీడీపీని అధికారంలోకి తెస్తాననడం.. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లుగా లేదా? మంగళగిరిలో ఈ రోజు ఎన్ని నిధులు ఇస్తున్నారు? ఎంతగా అభివృద్ధి చేస్తున్నారో ఒక్కసారి చూస్తే తెలుస్తుంది.
జగన్ గారు అత్యంత ప్రతిభావంతుడైన నాయకుడు…
ఈ రోజు జగన్ గారు దేశంలోనే అత్యంత పరపతి, ప్రతిభ ఉన్న నాయకుడు. ప్రతి పంచాయతీ ప్రగతి సాధించాలని తపన పడుతున్న నేత ఆయన. చంద్రబాబులా ఆయన అబద్ధపు హామీలు ఇవ్వలేదు. చేసిందే చెబుతున్నారు. విద్య , వైద్యం, వ్యవసాయ రంగాల్లో దిశానిర్దేశం చేసి, సరికొత్త ప్రగతి విప్లవానికి దారులు వేస్తున్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు ఊరూరా ఆర్బీకే కేంద్రాలు రైతులను ఆదుకుంటున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపింది జగన్ గారే.
రాష్ట్రం బాగుపడాలంటే.. బాబు, లోకేశ్ ను తరిమికొట్టాలిః
రూ. 2 లక్షల కోట్లు నేరుగా పేదల అకౌంట్లలో డబ్బు వేస్తే రాష్ట్రం వెనక్కి పోతుందా..?. సంక్షేమ కార్యక్రమాల అమలులో పెద్దపీట వేస్తున్నది ముఖ్యమంత్రి జగన్ గారు మాత్రమే. ఈ నిజాలను గమనించకుండా తప్పుడు ప్రచారాలు చేస్తే టీడీపీపై జనమే తిరగబడతారని బాబు, లోకేశ్‌లు గుర్తిసే మంచిదని వారికి హితవు పలుకుతున్నాను. రాష్ట్రం బాగుపడాలంటే బాబు , లోకేశ్ వంటి వారిని రాజకీయాల నుంచే ఇంటికి తరిమికొట్టాలని ప్రజలను కోరుతున్నాను. బాబు చేసిన కుంభకోణాలు మరిన్ని ఒక్కటొక్కటిగా బయటపడబోతున్నాయి. వాటికి తండ్రీ కొడుకులిద్దరూ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంత అవినీతిపరులై కూడా, తామేదో నీతి మంతులమైనట్లుగా ప్రసంగాలు చేయడం హాస్యాస్పదం కాక మరేమనాలి.
డిపాజిట్లు దక్కకపోవడమే మీ పౌరుషమా?
మీడియా ప్రశ్నలకు సమాధానంగా ….
– బలమైన పునాదులు వేస్తే బలమైన సామ్రాజ్యం నిర్మితమవుతుంది. టీడీపీ బలహీనమైన పునాదులపై లేచిన పార్టీ కనుకనే గత ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమయింది. ఇంతకుమించి మీకు అర్హత లేదని జనం అలా టీడీపీకి బుద్ధి చెప్పారు. గత మూడున్నరేళ్లలో ఏ ఎన్నిక జరిగినా డిపాజిట్లు దక్కకపోవడమే మీ దమ్మూ, ధైర్యం, పౌరుషమా..?.
– టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల దయతో లబ్ధి పొందే స్థాయి నుంచి నేడు అధికారులే ఇళ్లకు వెళ్లి పథకాల ఫలితాలను లబ్ధిదారులకు అందించే స్థాయిని జగన్ గారు తీసుకొచ్చారు.
టీడీపీదీ ఎప్పుడూ పనులు ఇచ్చి కమీషన్లు కొట్టేసే నైజమే.
– ప్రజా సంక్షేమం గురించి నిరంతర ఆలోచన చేసేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. ఒక్కసారి పేదల వద్దకు వెళ్తే తెలుస్తుంది వారి ఆర్థిక స్థితిగతులు ఎలా మారాయో…
– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజా ప్రయోజనాలే తప్ప.. వ్యక్తిగత స్వార్థం ఏమీ ఉండదు. పని చేయాలి. వదిలేయాలి…అంతే గాని కృతజ్ఞత ఆశించకూడదు.
– టీడీపీ కార్యకర్తలకు నేనూ హితవు చెప్పేదేమంటే …ట్రాన్స్‌లో బతకొద్దు.. వాస్తవంలో జీవించండి అని సూచిస్తున్నాను.