ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా వెలుగులోకి వస్తున్న సంఘటనలు సభ్య సమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి. పూనం కౌర్, కాదంబరి జెత్వానీ వంటి నటీమణులు తమకు జరిగిన అన్యాయాన్ని, వైకాపా హయాంలో అనుభవించిన వేధింపులను ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి వివరించడం వారి గుండె నిబ్బరానికి నిదర్శనం. గతంలో రాజకీయ ముసుగులో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళల ఆత్మగౌరవంతో ఆడుకున్న వైకాపా తీరు ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.
టీడీపీ ప్రతినిధి బండారు వంశీ గారు ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు బాధితులకు కొండంత అండగా నిలుస్తున్నాయి. కేవలం డబ్బు కోసం కాకుండా, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బలవుతూ, బయటకు చెప్పుకోలేక మనసులోనే కుమిలిపోతున్న ఎంతోమంది బాధితులకు ఆయన ఒక భరోసా ఇచ్చారు. “ఎవరూ భయపడకండి.. కూటమి ప్రభుత్వం మీకు రక్షణగా ఉంటుంది” అంటూ ఆయన ఇచ్చిన పిలుపు వైకాపా చెరలో ఇంకా బందీలుగా ఉన్న మహిళల జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.
గతంలో సంజన రాంబాబు ఎపిసోడ్, గంట అరగంటల ఆడియోలు, గోరంట్ల మాధవ్ ఘోరాల నుండి ఇటీవల అనంతపురం జిల్లాలో జరిగిన దారుణాలను మనం చూశాం. నమ్మి వచ్చిన ఒక మహిళా కార్యకర్త జీవితాన్ని వీడియోలతో పణంగా పెట్టిన ఓ యువ వైకాపా నాయకుడి అరాచకం పరాకాష్టకు చేరింది. ఇలాంటి ‘రఫ్ఫా రఫ్ఫా రాస్కెల్స్’ చెరలో ఇంకెంతమంది అమాయక మహిళలు మగ్గిపోతున్నారో?
తమ బాధను కన్నవారికి కూడా చెప్పుకోలేక, పరువు కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్న ప్రతి సోదరికి ఇది ఒక మేలుకొలుపు.
మహిళల వ్యక్తిగత జీవితాలతో ఆడుకుంటూ, వారిని మానసిక వేదనకు గురిచేసే ఏ శక్తినీ వదిలిపెట్టకూడదు. ఈ అరాచక వ్యవస్థకు వ్యతిరేకంగా గళం విప్పడం ఇప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత. బండారు వంశీ గారు ఇచ్చిన ఈ భరోసా, బాధితులకు ఊరటనివ్వడమే కాకుండా, తప్పు చేసిన వారి గుండెల్లో వణుకు పుట్టిస్తోంది.
ప్రజాస్వామ్యంలో ఆడబిడ్డల కన్నీళ్లకు తావు ఉండకూడదు. అరాచకం అంతమవ్వాలి.. న్యాయం గెలవాలి!
-చాకిరేవు