మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఉన్న జడ్ ప్లస్ సెక్యూరిటీ తొలగించాలన్నది ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన డిమాండ్. స్వయంగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ డిమాండ్‌కు తెరలేపారు. దానిపైన టీవీల్లో చర్చ కూడా మొదలయింది. సరే.. సహజంగా టీడీపీ కూడా ఆయన తెలంగాణలో సంపాదించిన లా డిగ్రీ మతలబును తెరపైకి తెచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా అనేక పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేసింది. అది వేరే విషయం!
బాబుకు అసలు ఎప్పుడు జడ్ ప్లస్ సెక్యూరిటీ వచ్చింది? ఆయన ఇంట్లో ఓ ఘటన జరిగిన ఏడాదికే బాబుకు సెక్యూరిటీ ఎలా వచ్చింది? ఆ ఉత్తరాదిమంత్రిని ఆయన సతీమణి అందరి సమక్షంలో ఎలా‘ సన్మానించింది’? సరిగ్గా ఆ ఘటన జరిగిన ఏడాది తర్వాత బాబుకు జడ ప్లస్ సెక్యూరిటీ రావడం యాధృచ్చికమేనా? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంట్లో ఏం జరిగింది? ఇలాంటి చర్చలోకి వెళ దాం.
అది 1995… చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి కొన్ని నెలలు అవుతుంది…
సమయం ఉదయం 7 గంటల 30 నిమిషాలు… చిన్న వయసులోనే… ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయకుడు తర్వాత ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రజల ఆదరణ పొందడానికి పూర్తిస్థాయిలో కష్టపడి పని చేస్తూ… తన పాలన గురించి, తన విధానాల గురించి… ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవటానికి ఒక వినూత్నమైన విధానాన్ని ఆయన ప్రారంభించారు. అదేంటంటే… ప్రతిరోజు ఇద్దరు మంత్రులను బ్రేక్ ఫాస్ట్ కి పిలిచి… ఆ మంత్రుల ద్వారా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడం. ఈ క్రమంలో… ఒకరోజు ఇద్దరు మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బ్రేక్ ఫాస్ట్ కి రావలసిందిగా ముందురోజే సమాచారం అందింది.
నిర్ణీత సమయానికి పావు గంట ముందే…
మొదటి మంత్రి J R పుష్పరాజ్ ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి సిబ్బంది రెండవ మంత్రి కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో లో ముఖ్యమంత్రి నివాసానికి కాస్త దూరంగా ఆటో దిగిన ఒక మహిళ… నడుచుకుంటూ ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి, గేటు వద్ద ఉన్న భద్రతా సిబ్బందికి ఏదో చెప్పి లోపలికి వచ్చారు. ఇదంతా గమనిస్తున్న ముఖ్యమంత్రి సిబ్బందికి ఆమె ఎవరో తెలియక చూస్తూ ఉన్నారు. గేటు దాటి లోపలికి ప్రవేశించిన ఆమె హఠాత్తుగా ముఖ్యమంత్రి ఇంటి ఆవరణలో నేల మీద కూర్చున్నారు.
బిత్తరపోయిన ముఖ్యమంత్రి సిబ్బంది మరియు సిబ్బంది పరుగున ఆమె దగ్గరకు వచ్చి ఆమె వివరాలు అడిగి… ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు ఇంటి ఆవరణలోకి ప్రవేశించేటప్పుడు, మామూలుగా కనిపించిన ఆమె ముఖం… ఇప్పుడు ఆగ్రహంతో రగిలిపోతుంది. నేనెవరో… ఇక్కడికి ఎందుకు వచ్చానో… కొద్ది నిమిషాల్లో మీకే తెలిసిద్ది… అని సమాధానం చెప్పింది. మరి కొద్ది నిమిషాలలో ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్ కి వస్తుంది అందువల్ల… ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బందిలో ఆందోళన పెరిగి, ఆమెను బలవంతంగా అక్కడి నుండి తరలించబోయారు… అప్పుడు నోరు విప్పి మొదలు పెట్టింది “నేనేదో దారిని పోయే మామూలు మహిళను కాదండి… చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇచ్చి కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టిన… ఓ సునకానికి తాళి కట్టిన భార్యని….. ఆ నా బట్ట ఇప్పుడు… నన్నూ… నా పిల్లలని గాలికొదిలేసి… ఆ లం* దగ్గరే కులుకుతున్నాడు… వారం రోజుల నుంచి ఇంటికి కూడా రాలేదు… PA కి ఫోన్ చేస్తే… ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తున్నాడని తెలిసి ఇక్కడే బాబు గారు ముందే తేల్చుకుందామని వచ్చాను”
అక్కడున్న అందరికీ… విషయం అర్థమైంది. ఆమె ఏ మంత్రి భార్యనో! ఒక సాధారణ భార్య ఆవేదన అని.అప్పటి ఉత్తరాది మంత్రి గారి భార్య ఆవేదన అది. ఇంతలో ఉత్తరాది మంత్రి గేటు లో నుండి ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు… ఎదురుగా తన భార్యను చూసి బిత్తరపోయి… హడావుడిగా ఆమెని అక్కడి నుండ పంపించే ప్రయత్నంలో….. నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను… నువ్వు ముందు ఇంటికి పద అని ఆమెని సముదాయిం చ పోయాడు…
ఇంతలో… ముఖ్యమంత్రి గారు బ్రేక్ ఫాస్ట్ కి వస్తున్నారని సమాచారం రావడంతో… భద్రతా సిబ్బంది… బలవంతంగానైనా… ఆమెని అక్కడి నుండి పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా………..
అప్పుడు జరిగిందో సంఘటన… కొన్ని క్షణాల పాటు ఎవరికి… ఏమి అర్థం కాలేదు….. అలాంటి సన్నివేశంలో….. తెలుగు సినిమాల్లో….. సముద్రపు అల… పైకి లేచి… కాసేపు ఆగిపోయినట్టు….. ఆకాశంలో వెళుతున్న కొంగల గుంపు కొన్ని క్షణాల పాటు స్తంభించిపోయినట్టు… చూపిస్తారు.
కొన్ని క్షణాల తర్వాత అందరికీ అర్థమైంది… ఒకపక్క అతని చొక్కా పట్టుకొని… బాధతో… ఆవేదనతో… తిడుతూనే… కిందకు వంగి ఆమె… చెప్పు తీయటం… అతనిని కొట్టడం ….. వెంటనే భద్రతా సిబ్బంది ఆమెను బయటకు తీసుకెళ్లారు… ఆయన మాత్రం కాస్త బట్టలు సర్దుకొని… ముఖం మీద నవ్వు పులుముకుని… లోపలికెళ్లి… అప్పుడే వచ్చిన ముఖ్యమంత్రి గారితో కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసి… వెళ్ళిపోయాడు.
ముగింపు ఈ ఘటన జరిగిన సంవత్సరమే చంద్రబాబు నాయుడుకి జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చింది కేంద్రం.. చరిత్ర అద్దంలాంటిది… ఏం జరిగిందో… దానినే చూపిస్తుంది.