అచ్చెన్నాయుడి విలేకరుల సమావేశం వివరాలు : (14.06.2023)
సంక్షేమం ముసుగులో ప్రజల్ని కడుబీదలుగామార్చిన జగన్ , రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టాడు. చంద్రబాబు భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో ప్రకటించిన పథకాలు ప్రజలజీవితాలకు కొత్తఊపిరిలూదాయి. చంద్రబాబు ప్రకటించిన పథకాలపై 125 నియోజకవర్గాల్లో బస్సులద్వారా ప్రచారం.
• చంద్రబాబు మహానాడువేదికగా ప్రకటించిన భవిష్యత్ కు గ్యారెంటీపథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాష్ట్రవ్యాప్తంగా బస్సుప్రచారం చేపట్టనున్నాం.
• 5 బస్సుల్ని చంద్రబాబు 19వతేదీన పార్టీ జాతీయకార్యాలయంలో ప్రారంభిస్తారు.
• టీడీపీ మేనిఫెస్టో ప్రచారబస్సులు 125 నియోజకవర్గాల్లో తిరగనున్నాయి. నియోజకవర్గాలఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు బస్సుల్లో వెళ్లి ప్రజలతో మమేకమై, చంద్రబాబువారికోసం ప్రకటించిన పథకాల్ని తెలియచేస్తారు.
• అలానే జగన్ పాలనలో ప్రజలకు జరిగిన నష్టం, వారుపడుతున్న కష్టాలను తెలుసుకొని, భవిష్యత్ లో చేపట్టబోయే కార్యక్రమాలదిశగా ఆలోచిస్తారు. వారి ఆలోచనల్ని పార్టీ అధినేతతో పంచుకుంటారు.
• రాష్ట్ర ఆదాయం పెంచి ప్రజలకు పంచి, పేదల్నిధనవంతుల్ని చేసే బృహత్తర కార్యక్రమమే చంద్రబాబు ప్రకటించిన ‘భవిష్యత్ కు గ్యారెంటీ’ పథకం.
• టీడీపీ మేనిఫెస్టో పులిహోరలాంటిదన్నజగన్, పులిహోరపేదలకు బలాన్ని, ఆరోగ్యాన్ని అందించే పౌష్ఠికాహారమని ఆయన మాటల్తోనే ఒప్పుకున్నాడు.
• జగన్మోహన్ రెడ్డిని మించిన యాక్టర్ ప్రపంచంలో మరొకరుఉండరు.
• కేంద్రప్రభుత్వంతో జగన్ కు సన్నిహితసంబంధాలు ఉండబట్టే 4ఏళ్లుగా అవినీతికేసుల విచారణకు కోర్టులకు వెళ్లడంలేదు.
• కేంద్రపెద్దల అండతోనే బాబాయ్ హత్యకేసులో అసలుముద్దాయిల్ని సీబీఐ అరెస్ట్ లనుంచి కాపాడుకోగలుగుతున్నాడు.
• బీజేపీ సహాయసహాకారాలుండబట్టే ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితికి మించి అప్పులుతెచ్చి, ఆ సొమ్ములో 90శాతం దిగమింగాడు.
– రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
వైసీపీప్రభుత్వం సంక్షేమంముసుగులో పేదల్ని కడుబీదలుగా మార్చిందని, నాలుగన్నరేళ్లపాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతిఒక్కరిపై రూ.2.05లక్ష ల అప్పువేశాడని, నిత్యావసరాలధరల పెంపుతోపాటు, ఇతరత్రాపన్నులు వేసి ప్రజల్నిలూఠీచేస్తున్నాడని, కేంద్రంనుంచి ఇతరత్రామార్గాల్లో తీసుకొచ్చే అప్పుల్లో 90శాతంసొమ్ముని ప్రభుత్వమే దోచేస్తోందని టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆయన టీడీపీబీసీ సెల్ రాష్ట్రఅధ్యక్షులు, మాజీమంత్రి కొల్లురవీంద్ర, ఎమ్మెల్యే అనగానిసత్యప్రసాద్, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, పంచుమర్తి అనురాధ లతో కలిసి ‘బీసీ భరోసా లోగో’ పోస్టర్లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడినవివరాలు..ఆయన మాటల్లోనే …
“ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ముసుగులోప్రజల్ని దోచేస్తూ, రాష్ట్రాన్ని సంక్షోభం లోకి నెట్టాడు. జగన్ దోపిడీతో అటుప్రజలు, ఇటురాష్ట్రం విచ్ఛిన్నమైన నేపథ్యం లో టీడీపీఅధినేత చంద్రబాబుగారు మహానాడువేదికగా విప్లవాత్మకనిర్ణయం తీసుకొని రాష్ట్రంలోని అన్నివర్గాలసంతోషమే లక్ష్యంగా భవిష్యత్ గ్యారెంటీ పేరుతో మినీమేనిఫెస్టో ప్రకటించారు. ఆయనప్రకటించిన పథకాలు ప్రజలజీవితాలకు కొత్త ఊపిరిలూదాయని చెప్పడం అతిశయోక్తికాదు.
సమాజంలో సగభాగమున్న మహిళల్నిఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తే, కుటుం బాలతోపాటు, రాష్ట్రంకూడా త్వరితగతిన అభివృద్ధిచెందుతుందని భావించిన చంద్రబాబు, మహాశక్తిపేరుతో మహిళలకు వరాలు ప్రకటించారు.
1. మహాశక్తిపథకంలో భాగంగా చంద్రబాబు మహిళలకు అందించిన వరాలు.
18 నుంచి 59ఏళ్ల వయసున్న ప్రతిమహిళకు నెలకు రూ.1500చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. ఒకఇంటిలో ఎందరుమహిళలుంటే, అందరికీ ఆర్థికసాయం చేస్తామన్నారు.
చదువుకునే పిల్లలు ఎంతమందిఉంటే, అందరికీ ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.15వేలు ఇస్తాననిచెప్పిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక అందుకువిరుద్ధంగా ప్రవర్తించి, విద్యార్థులచదువుల్ని, తల్లులఆశల్ని నీరుగార్చాడు. అమ్మఒడి పేరుతో అమ్మలకు గుండెకోతమిగిల్చాడు. జగన్ చేసినతప్పలతో నష్టపోయిన ప్రతిఒక్కవిద్యార్థికి, వారితల్లులకు న్యాయంచేయడంకోసం చంద్రబాబునాయుడు ‘తల్లికి వందనం’ కార్యక్రమం ప్రకటించారు.
ఒకఇంట్లో ఎందరువిద్యార్థులుంటే, అందరికీ వారిచదువులకోసం ఏటా రూ.15వేలచొప్పున ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు.
అలానే మహిళలజీవితాలు పొగబారిపోకుండా, దీపంపథకంద్వారా గతంలోనే చంద్రబాబు వారికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించారు. జగన్ వచ్చాక దీపం పథకంపూర్తిగా అటకెక్కింది. రూ.250లు ఉన్నగ్యాస్ సిలిందర్ ధర నేడు రూ.1250లకు పెరిగింది. గ్యాస్ సిలిండర్ ధరపెరగడంతో మహిళలు మరలా పాతపద్ధతి లో కట్టెలపొయ్యిలనే ఆశ్రయించి, కళ్లుచెమర్చుకుంటున్న దుస్థితిని చూసి చలిం చిన చంద్రబాబునాయుడు ప్రతికుటుంబానికి సంవత్సరానికి 3గ్యాస్ సిలిండర్లు ఉ చితంగా ఇవ్వాలని నిర్ణయించారు. అలానేమహిళలకు జిల్లాపరిధిలో ఆర్టీసీబ స్సుల్లో ఉచితప్రయాణ సౌకర్యం కల్పిస్తూనిర్ణయం తీసుకున్నారు.
2. యువత బంగారు భవితకోసం ‘యువగళం’.
జగన్ దుర్మార్గపు పాలనలో రాష్ట్రయువత నిర్వీర్యమైంది. 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుభర్తీచేస్తానన్న పెద్దమనిషి, ఆమాటతప్పి, యువతఆశలపై నీళ్లుచల్లా డు. టీడీపీప్రభుత్వం గతంలో ఉద్యోగాలకోసం నిరీక్షించేయువతకు ఆర్థికసాయం చేయడంకోసం నెలకు రూ.3వేల నిరుద్యోగభృతి అందించింది. జగన్ ముఖ్యమం త్రిఅయ్యాక దాన్నినిలిపేశాడు. యువతబాధలు గ్రహించి, వారి భవిష్యత్ ను తీర్చి దిద్దాలన్నసంకల్పంతోనే చంద్రబాబుగారు మరలా టీడీపీప్రభుత్వం వచ్చిన వెంట నే రూ.3వేల నిరుద్యోగభృతి అందిస్తామని, 20లక్షలఉద్యోగాలిస్తామని హామీ ఇ చ్చారు.
3. రైతుసంతోషమే రాష్ట్రసంతోషంగా భావించి.. ‘అన్నదాతాసుఖీభవ’ పథకం ప్రకటించారు.
జగన్ ఏలుబడిలో రైతుజీవితం నరకప్రాయంగా మారింది. వ్యవసాయం దండగా మారి రైతుఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే నెంబర్-1 స్థానంలో నిలిచింది. జగన్ మోసాలకు దిక్కుతోచనిస్థితిలో పడినరైతుల్ని ఆదుకోవడానికి చంద్రబాబు ముం దడుగు వేశారు. టీడీపీప్రభుత్వం వచ్చినవెంటనే ప్రతిరైతుకి సంవత్సరానికి రూ.20వేల ఆర్థికసాయం అందించి వారికి అండగాఉంటామని ప్రకటించారు.
4. మంచినీరులేక అల్లాడుతున్నవారికోసం ఉచితంగాస్వచ్ఛమైన తాగునీరు.
రాష్ట్రంలోని అనేకప్రాంతాల్లో ప్రజలు తాగునీరులేక అవస్థలుపడుతున్నారు. నాలు గన్నరేళ్లలో జగన్ ఒక్కగ్రామానికికూడా సురక్షితమైన మంచినీరు అందించలేదు. టీడీపీప్రభుత్వంలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ సుజలస్రవంతి వాటర్ ప్లాంట్లను మూ తపడేలాచేశాడు. ఇవన్నీగమనించిన చంద్రబాబు, తానుముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజలకుఉచితంగా సురక్షితమైన మంచినీరు అందిస్తానని ప్రకటించారు.
5. బీసీల రక్షణకోసం ప్రత్యేకచట్టం.
బీసీలరక్షణకోసం చంద్రబాబు తీసుకొస్తానన్న ప్రత్యేకచట్టం అటుబీసీలకు రక్షణ నివ్వడమేకాకుండా, ఇతవర్గాలప్రయోజనాల్ని కాపాడేలా ఉంటుంది. బడుగు బలహీనవర్గాలతో టీడీపీ బంధం అనిర్వచనీయమైంది. దాన్ని మరింత బలోపేతం చేయడానికే చంద్రబాబుగారు బీసీలరక్షణకు ప్రత్యేకచట్టం తీసుకురావాలని నిర్ణ యించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలపైజరిగిన దాడులు, వేధింపులు, అన్నీఇన్నీకావు. జగన్ మాదిరి మరేముఖ్యమంత్రి భవిష్యత్ లో బీసీలను హిం సించకూడదన్న ఆలోచనతోనే టీడీపీ అధినేత ప్రత్యేకచట్టం ఆలోచనచేశారు.
6. పేదల్ని ధనవంతుల్ని చేయడకోసమే ‘పూర్ టూ రిచ్.’
చంద్రబాబు ఆలోచనల్ని, దూరదృష్టిని అర్థంచేసుకోలేని కొందరుమూర్ఖులు పేదల్ని ఎలా ధనవంతుల్నిచేస్తారంటున్నారు. గతంలో విజన్ 2020 అని చంద్ర బాబుప్రకటించినప్పుడు ఇలానే అవహేళనచేశారు. పోలవరం నిర్మిస్తాను.. అమ రావతి కడతాను అన్నప్పుడు బుద్ధిలేనివాళ్లు ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. అలాంటి వారందరి నోళ్లుమూతపడేలా ఆయనచేసి చూపించారు. అలానే 2024 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినవెంటనే రాష్ట్రంలోని పేదల్ని ధనవంతుల్ని చేసే బృహత్తరకార్యక్రమం ప్రారంభమవుతుంది.
చంద్రబాబు ప్రకటించిన భవిష్యత్ కు గ్యారెంటీపథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బస్సుప్రచారం చేపట్టనున్నాం. రాష్ట్రవ్యాప్తంగా జోన్లవారీగా 5బస్సులు 125 నియోజకవర్గాల్లో తిరగనున్నాయి. నియోజకవర్గాలఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు బస్సుల్లో వెళ్లి ప్రజలతో మమేకమవుతారు.
మహిళలు, రైతులు, యువత, బీసీలు, పేదల్ని ఆదుకోవడమే లక్ష్యంగా, వారి సంతోషం, సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ ముందుకు వెళ్లనుంది. వారికోసం చంద్రబా బు, టీడీపీఅమలుచేయబోయే కార్యక్రమాల్ని ప్రతిఒక్కరికీ తెలియచేయడంకోసం బస్సుప్రచారం ప్రారంభించనుంది. జోన్ స్థాయిలో అవుట్ రీచ్ ప్రోగ్రామ్ చేపట్టనుం ది.
అందుకోసం 5బస్సుల్ని అధునాతనహంగులతో తీర్చిదిద్ది 125నియోజకవర్గా ల్లో 30రోజులపాటు తిప్పనుంది. ఒక్కోజోన్ లో ఒక్కోబస్సు కేటాయిస్తున్నాం. ఆ బస్సు ఎంపికచేసిన నియోజవర్గాల్లో తిరుగుతుంది. ఏనియజకవర్గానికి వెళ్లే, అక్కడిక్యాడర్ బస్సులోఉండి, ప్రజలతోమాట్లాడి, వారికష్టసుఖాలు, బాధలు తెలుసుకొని, చంద్రబాబు వారికోసం తీసుకొచ్చిన ‘భవిషత్ కు గ్యారెంటీ’ పథకా లను వివరిస్తారు. అలానే జగన్ పాలనలో వారికిజరిగిన అన్యాయం తెలుసుకొని, రాష్ట్రవ్యాప్తంగా జరిగిన, జరుగుతున్న దోపిడీని, దారుణాలను వారికి తెలియచేస్తా రు.
అలానే ప్రజలతో కలిసిపల్లెనిద్రచేసి, రాష్ట్రపునర్నిర్మాణంలో వారిభాగస్వా మ్యాన్ని బలోపేతంచేస్తారు. ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరిగేలా పార్టీ అధినేత చంద్రబాబుగారు ఎప్పటికప్పుడు సమీక్షచేస్తారు. 19వతేదీన చంద్రబాబు మంగళ గిరిలోని పార్టీజాతీయకార్యాలయంలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జెండా ఊపి 5 బస్సుల్నిప్రారంభిస్తారు. అనంతరం మీడియావారితో ఇష్టాగోష్టిగా మాట్లా డతారు.
రాష్ట్రంలోని తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు జోనల్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని విజయవంతంచేయాలి. ప్రతినియోజకవర్గంలో బస్సులపై తిరిగి, ప్రజలకష్టాలతోపాటు, వారిఅభిప్రాయాలు తెలుసుకొని, భవిష్యత్ లో రాష్ట్రం కోసం మరిన్ని మంచినిర్ణయాలు తీసుకుంటామని తెలియచేస్తున్నాం.
విలేకరుల ప్రశ్నలకు అచ్చెన్నాయుడి సమాధానాలు…
టీడీపీ మేనిఫెస్టో పులిహోర అనడంద్వారా, పులిహోరపేదలకు బలాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుందని జగన్మోహన్ రెడ్డే ఒప్పుకున్నాడు.
టీడీపీమినీ మేనిఫెస్టోని జగన్ పులిహోరగా అభివర్ణించడం అతని అవివేకానికి నిదర్శనం. ఒక్కమాటలో చెప్పాలంటే పులిహోర పేదలకు పౌష్ఠికాహారం. అనేక దేవాలయాల్లో భక్తులునిష్ఠతో స్వీకరించేప్రసాదం పులిహోర. పులిహోర విశిష్టత, రుచిమాటల్లోచెప్పలేనిది. టీడీపీ పథకాలు ప్రజలకు పౌష్ఠికాహారం లాంటివని, వారికిబలాన్ని ఆరోగ్యాన్నిఅందిస్తాయని తనమాటల్తో జగన్మోహన్ రెడ్డే ఒప్పుకున్నాడు.
నాలుగేళ్ల జగన్ పాలనలో ఏపీ అప్పులకోసం దేహి అంటుంటే, తెలంగాణ ఆదాయార్జనలో ముందునిలిచింది.
రాష్ట్ర భవిష్యత్ నాయకుడి సమర్థతపై ఆధారపడి ఉంటుంది. 1995లో ఉమ్మడిరా ష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉద్యోగులకుజీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రజలకు సంక్షేమం దొరకని దుస్థితి. అలాంటిపరిస్థితుల్ని తనఆలోచన లు, దూరదృష్టితో చంద్రబాబు అధిగమించారు. ఆర్థికసంస్కరణలతో ప్రజల్ని, రాష్ట్రాన్ని కొత్తదారిలో నడిపించారు. జగన్ పథకాల్ని తాముతప్పుపట్టలేదు.. వా టిలోని డొల్లతనాన్ని, ప్రజలకుజరుగుతున్న అన్యాయాన్నే ప్రశ్నించాము.
2019 లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయేనాటికి రాష్ట్రఆదాయం సంవత్సరానికి రూ.65వేలకోట్లు. అదేసమయంలో తెలంగాణఆదాయం రూ.63వేలకోట్లు. తెలం గాణకు ఉన్నఆర్థికవనరులు ఏపీకిలేకపోయినా, ఆరాష్ట్రంకంటే మిన్నగా ఆదా యం వచ్చేలా చంద్రబాబుఏపీని తీర్చిదిద్దారు. తెలంగాణకంటే ఏపీజనాభా ఎక్కు వ. అలాంటి పరిస్థితిని కేవలం 4ఏళ్లలో జగన్ తలకిందులుచేశాడు. రాష్ట్రంలోని వ్యవస్థల్ని చిన్నాభిన్నంచేసిన జగన్, ఆర్థికవ్యవస్థను సర్వనాశనంచేశాడు.
నిత్యంఅప్పులకోసం రాష్ట్రం దేహీఅనేలా చేశాడు. ఏపీఅప్పులకోసం అర్రులు చా స్తుంటే, తెలంగాణ ఆదాయంమాత్రం ఇప్పుడు రూ.లక్షా36వేలకోట్లకు పెరిగింది. ఏపీఆదాయం మాత్రం 4ఏళ్లలో రూ.96వేలకోట్లఆదాయానికే పరిమితమైంది. రాష్ట్రానికి ఉన్నవనరులతో ఆదాయంఎలాపెంచాలో చంద్రబాబుగతంలో నిరూపిం చారు. అలానే2024లో చంద్రబాబు తనఆలోచనలతో సంపదసృష్టించి, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతోపాటు, రాష్ట్రాన్నిఅభివృద్ధిచేస్తారు. రాష్ట్ర ఆదాయం పెంచి ప్రజలకు పంచే కార్యక్రమమే ఆయన తీసుకొచ్చిన ‘భవిష్యత్ కు గ్యారెంటీ’ పథకం.
జగన్మోహన్ రెడ్డిని మించిన యాక్టర్ ప్రపంచంలో మరొకరుఉండరు. కేంద్రప్రభుత్వంతో జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉండబట్టే 4ఏళ్లుగా అవినీతికేసుల విచా రణకు కోర్టులకుహాజరుకాకుండా తిరుగుతున్నాడు. బాబాయ్ హత్యకేసులో అసలుముద్దాయిల్ని సీబీఐ అరెస్ట్ చేయకుండా కాపాడగలిగాడు.
జగన్మోహన్ రెడ్డిని మించినడ్రామా యాక్టర్ ప్రపంచంలో ఎవరూఉండరు. ఆయన నటననిప్రజలు గతంలో నమ్మారు. అందుకే మరలాకొత్తడ్రామాలు మొదలెట్టాడు. 2014కి ముందు టీడీపీ రెండుతెలుగురాష్ట్రాలకు న్యాయంచేయాలని ఒకే మాటకు కట్టుబడింది. కానీ ఈ డ్రామా యాక్టర్ బయటరాష్ట్రం ఒకటిగా ఉండాలంటూ, కాంగ్రెస్ తో లోపాయికారీ ఒప్పందంచేసుకొని, తనపై ఉన్నకేసులనుంచి బయట పడటంకోసం బెయిల్ తెచ్చుకున్నాడు. రాష్ట్రంవిడిపోవడానికి ప్రత్యక్షంగా, పరో క్షంగా కారకుడయ్యాడు. ఆనాడుచేసిన డ్రామాల్ని మించిపోయేలా ఇప్పుడు ఏపీ ప్రజలముందు కొత్తనాటకాలు మొదలెట్టాడు. సానుభూతితెచ్చుకోవడానికి నాకు ఎవరూతోడులేరు నేను ఒంటరివాడిని, ప్రజలే నాకుఅన్నీ అంటున్నాడు.
జగన్ 4ఏళ్లలో ఎన్నిసార్లు ఢిల్లీవెళ్లాడు. వెళ్లినప్రతిసారీ బీజేపీతో తనకు, తనపార్టీకి సత్సంబంధాలున్నాయని చెప్పుకున్నాడా లేదా? రాష్ట్రప్రయోజనాలకోసమే ఢిల్లీ వెళ్లినట్టు తనమీడియాలో కట్టుకథలు ప్రసారంచేసి ప్రజల్ని నమ్మించాడాలేదా? ఇదంతా పక్కనపెడితే బాబాయ్ హత్యకేసు సంగతేమిటి?
బాబాయ్ నిఎవరు చంపారో, ఎందుకుచంపారో ముఖ్యమంత్రికి తెలుసు. హత్యకేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడానికి సీబీఐ కడపవెళ్తే, అక్కడేంజరిగిందో, ఈ ప్రభుత్వం, పోలీసులు ఏంచేశారో ప్రజలంతాచూశారు. పోలీసులసహాకారం లేదని సీబీఐ వెనక్కువెళ్లడం బీజేపీ సపోర్ట్ లేకుండానే జరిగిందా అని జగన్ ను ప్రశ్నిస్తున్నాం. తనపై ఉన్న అవినీతికేసులవిచారణకు హాజరుకాకుండా, 4ఏళ్లనుంచి కోర్టుమెట్లుఎక్కకుండా జగన్ ఎలా నిర్భయంగా ఉండగలిగాడు?
బీజేపీ సహకారంతోనే కదా! ఏపీ ప్రభుత్వానికి విపరీతంగా అప్పులుఎందుకిస్తున్నారు? ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితిని మించిపోయి మరీ కేంద్రంవిచ్చలవిడిగా ఏపీకి అప్పులిచ్చింది. ఇదంతా కేంద్రప్రభు త్వసహకారం లేకుండానే జగన్ చేశాడా? విభజనచట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వమని టీడీపీప్రభుత్వం నాలుగేళ్లుమొత్తుకున్నా కేంద్రం రూపాయిఇవ్వలేదు. టీడీపీప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిధుల్ని ఇప్పుడు మొన్న టికి మొన్న జగన్ ప్రభుత్వానికి రూ.12వేలకోట్లు ఇచ్చారు.
బీజేపీకి, జగన్ కుమధ్య ఎంతగొప్ప అండర్ స్టాండింగ్ లేకపోతే ఇదిసాధ్యమైంది? ఇదంతా జగన్, అతనిప్రభుత్వం ఆడుతున్నడ్రామానే. జగన్మోహన్ రెడ్డిపై, అతనిప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతఉంది. జగన్ , అతనిప్రభుత్వం మునిగిపోయే నావల ని అర్థంకావాల్సిన వారికి అర్థమైంది. ప్రధానమంత్రి తరువాత ప్రధానమంత్రిగా కీర్తించబడే అమిత్ షా, జగన్మోహన్ రెడ్డిని మించిన అవినీతిపరుడు దేశంలోనే లేడనిచెప్పాడు.
ఆయనవ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్పందించాలి. కానీ నోరెత్తలే దు. తనపార్టీవారితో ఇష్టమొచ్చినట్లు అమిత్ షాను, టీడీపీని తిట్టించాడు. అమి త్ షా వ్యాఖ్యలతో టీడీపీకి ఏంసంబంధం? ప్రజలు జగన్ డ్రామాలను నమ్మేస్థితి లో లేరు. తనబాబాయ్ ని చంపినవారిని శిక్షిస్తే జగన్ ను ప్రజలు నమ్ముతారు. తన అవినీతికేసుల్లో నిజాయితీగా, చట్టప్రకారం వ్యవహరిస్తే నమ్ముతారు.” అని అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారు.
బీసీ భరోసాలోగో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీడీపీ బీసీ అనుబంధ విభాగాలనేతలు, సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.