-ఒకే రోజు ఏడుగురు లబ్దిదారుల కుటుంబాలకు ప్రయోజనం
-బూస్టర్ డోస్ శిబిరం ఏర్పాటు
దళిత బంధు పధకంలో భాగంగా అడ్డగుట్ట డివిజన్ కు చెందిన అయోధ్య, నర్సింగ్,మరియు సుజాత లకు స్విఫ్ట్ డిజైర్ వాహనాలను ఉప సభాపతి పద్మారావు గౌడ్ అందచేశారు. సీతాఫల్మండి డివిజన్ కు చెందిన ఆనంద్ స్విఫ్ట్ వాహనాన్ని అందచేశారు. అదే విధంగా తార్నాక కు చెందిన కృష్ణవేణి,బలరాం,మరియు ప్రదీప్ కు మారుతి ఎర్టిగా వాహనాన్ని అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత బంధు పధకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోనేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెరాస కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, యువనాయకులు తీగుళ్ల కిషోర్ కుమార్ గౌడ్,కిరణ్ కుమార్ గౌడ్,రామేశ్వర్ గౌడ్ తెరాస డివిజన్ నాయకులు , తదితరులు నాయకులు పాల్గొన్నారు.
బూస్టర్ డోస్ శిబిరం ఏర్పాటు
కరోనా వ్యాధి బారిన పడకుండా ప్రజలు వివిధ స్వీయ జాగ్రత్తలు పాటించాలని, ప్రభుత్వ పరంగా సైతం వివిధ ఏర్పాట్లు జరుపుతున్నామని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ వద్ద బూస్టర్ డోస్ కరోనా వాక్సిన్ శిబిరాన్ని పద్మారావు గౌడ్ గురువారం ప్రారంభించారు. వైద్య అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.