Suryaa.co.in

Andhra Pradesh

పంద్రాగస్టు కోసం పంచాయతీలకు నిధులు పెంపు

గణతంత్ర దినోత్సవ వేడుకలకూ నిధులు
మైనర్ పంచాయతీలకు రూ.100 నుంచి రూ.10వేలకు
మేజర్ పంచాయతీలకు రూ.250 నుంచి రూ.25 వేలకు
– డిప్యూటీ సీఎం పవన్

అమరావతి: పంద్రాగస్టు వేడుకల నిర్వహణ కోసం పంచాయతీలకు నిధులు పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించారు. మైనర్ పంచాయతీలకు రూ.100 నుంచి రూ.10వేలకు, మేజర్ పంచాయతీలకు రూ.250 నుంచి రూ.25 వేలకు పెంచారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకూ ఇదే విధంగా నిధులు ఇస్తామన్నారు. స్కూళ్లలో ఫ్రీడమ్ ఫైటర్లను సత్కరించాలని, విద్యార్థులకు క్రీడలతో పాటు క్విజ్ తదితర పోటీలు నిర్వహించాలని ఆదేశించారు.

LEAVE A RESPONSE