రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
అమరావతి : వినియోగదారులకు కావాల్సిన వస్త్రాలు ఆప్కో షో రూమ్ ల్లో అందుబాటులో ఉంచుతూ, అమ్మకాలు పెంచాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం మూడో బ్లాక్ లో ఉన్న ఆప్కో, లేపాక్షి అవుట్ లెట్లను మంత్రి సవిత గురువారం సందర్శించారు. రికార్డులను పరిశీలించి, చేనేత వస్త్రాలు, హస్త కళారూపాల అమ్మకాలపై ఆరా తీశారు. అమ్మకానికి పెట్టిన చేనేత వస్త్రాలను, హస్త కళారూపాలు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సచివాలయ ఉద్యోగులు, సందర్శకుల అభిరుచుల మేరకు చేనేత వస్త్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. షర్ట్స్, నైటీ, ఇతర రెడీమేడ్ చేనేత వస్త్రాలను, హస్త కళారూపాలను ఆకట్టుకునేలా ప్రదర్శనకు పెట్టాలన్నారు. హస్త కళా రూపాల డిస్కౌంట్ సేల్స్ పైనా డిస్ ప్లే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంక్రాంతి పండుగ సమయంలో ఎంతమేర అమ్మకాలు జరిగియో అడిగి తెలుసుకున్నారు. ఆప్కో, లేపాక్షిలో అమ్మకాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత స్పష్టం చేశారు. మంత్రి వెంట బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖాధికారులు, పలువురు కూటమి నాయకులు ఉన్నారు.