Suryaa.co.in

Telangana

భ‌య‌ం వేస్తోంది.. భద్ర‌త పెంచండి

– నా భ‌ద్ర‌త‌పై అనుమానాలు
– నేను సీఎం ఉండే ఏరియాలోనే ఉంటాను… అయినా దుండ‌గులు చొర‌బ‌డుతున్నారు
– హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లోని త‌న నివాసంలో ఆగంతకుడు చొర‌బ‌డిన ఘ‌ట‌న‌పై మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో ఎంపీ డీకే అరుణ‌ అనుమానాలు
– గత‌రాత్రి హైద‌రాబాద్ లోని నా ఇంట్లో జ‌రిగిన ఆగంత‌కుడి చొర‌బాటు ఘ‌ట‌న భ‌యాందోళ‌న‌
– నా భ‌ద్ర‌త‌పై అనుమానాలు
– నేను సీఎం ఉండే ఏరియాలోనే ఉంటాను… అయినా దుండ‌గులు చొర‌బ‌డుతున్నారు
– గ‌త‌రాత్రి ఓ దుండ‌గులు నా ఇంట్లోకి వెన‌క కిచ‌న్ లోకి ప్ర‌వేశించి గంట‌న్న‌ర‌పాటు క‌లియ‌దిరిగి వెళ్లిపోయాడు
– ఇది ముమ్మాటికీ అనుమానాల‌కు తావిస్తోంది
– అస‌లీ దుండ‌గులు నా ఇంట్లోకి ఎందుకు చొర‌బ‌డ్డాడో అన్న‌విష‌యం ఆలోచిస్తేనే భ‌యం వేస్తోంది

హైద‌రాబాద్: 2రోజులుగా నేను మహబూబ్ నగర్ లోనే ఉన్నాము. గత అర్థ రాత్రి 3 గంటలకు కిచెన్ కిటికీ తీసి ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా ఒక గంటన్నర పాటు ఇంట్లో కలియతిరిగారు. ఇవాళ మార్నింగ్ 6 గంటలకు నాకు తెలిసిందే. కిచెన్ లో కెమెరా కట్ చేశాడు, కింద గ్లాస్ తీసేసి ఇంట్లోకి వచ్చాడు. ముఖానికి మాస్క్‌, గ్లౌస్, బ్యాగ్ ,షూ ధ‌రించాడు.

ప‌స్ట్ ఫ్లోర్ లోకి వెనుక భాగం నుంచి కిచన్ కిటికిలోంచి లోనికి ఎంటర్ అయ్యాడు. న‌క్కి న‌క్కి తిరుగుతూ రెక్కీ చేసిన తీరు అనుమానాల‌కు తావిస్తోంది. కిచెన్ లో కెమెరా కట్ చేశాడు డైనింగ్ హాల్ లో కెమెరా తిప్పే.సాడు. డ్రాలు తెరిశాడు, అన్ని చిందర వండర ప‌డేశాడు. ఫ‌స్ట్‌, సెకెండ్ ఫ్లోర్ల‌లోని అన్నిరూములు తిరిగాడు. 2nd ఫ్లోర్ లో కి వెళ్ళాడు అంతా కలియ తిరిగాడు. నక్కుకుంటూ.. నక్కు కుంటు వెళ్ళిపోయాడు.

తెల్ల‌వారు జామున 4:30నిమిషాల‌కు ఇంట్లోంచి వెళ్లిపోయాడు. గంట‌న్న‌ర పాటు వాడు నా ఇంట్లో ఏం రెక్కీ చేశాడో అర్థం కావ‌డం లేదు.
ఈ ఘ‌ట‌న ఊహించుకుంటేనే భ‌యం వేస్తోంది. వాడు వ‌చ్చి న‌ప్పుడు ఇంట్లోవాళ్లు ఎవ‌రైనా చూసి ఉంటే.. చంపేసేవాడేమో.. ఏం జ‌రిగేదో ఊహించుకుంటేనే భ‌యం వేస్తోంది. . నా ఇంట్లోంచి చిన్న‌క‌ర్చిప్‌కూడా పోలేదు. నా ఇంట్లో దొంగ‌తనానికే వ‌చ్చి ఉంటే ఏదోటి తీసుకెళ్లాలి క‌దా. ఈ ఘ‌ట‌న త‌ర్వాత నా ఇంట్లో నుంచి ఎలాంటి వ‌స్తువులు పోలేదు.

ఇంట్లో ఎలాంటి విలువైన వస్తువులు ఏమి పోలేవు. తెర్చి ఉన్న అన్ని రూమ్‌ల‌లోకి తిరిగాడు. దొంగతనం చేయడానికి వస్తె ఎదోటి చేసి పోవాలి. మా మనమరాలి రూమ్ లోకి వెళ్ళాడు. ఆ స‌మ‌యంలో ఆమెకు మెలకువ వచ్చి ఉంటే ఏం చేసే వాడో. నా ఇంట్లో పని చేసే ముగ్గురు కూడా అమ్మాయిలే. వాళ్ల‌కు మెల‌కు వ‌చ్చినా ఏం జ‌రిగేదోన‌ని భ‌యం వేస్తోంది.

అదే లేన్ లో ఉంటాను… అయినా
ముఖ్యమంత్రి ఉండే లేన్ లోనే నేను ఉంటాను. అయినా ఇలా దుండ‌గులు చొర‌బ‌డ‌టం భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. ఈ విష‌యంపై ముఖ్య మంత్రి గారు సీరియ‌స్ గా దృష్టి సారించాలి. జాతీయ రాజ‌కీయాల్లోనూ కీల‌క నేత‌గా ఉన్న నా ఇంట్లోనే ఈ ప‌రిస్థితి ఉంటే … భ‌ధ్ర‌త ఎక్క‌డ‌?

భ‌ద్ర‌త పెంచాల్సిందే
నా ఇంట్లోకి దుండ‌గుడు చొర‌బ‌డిన విష‌యమై ఇప్ప‌టికే పోలీసుల‌కు కంప్టైంట్ ఫైల్ చేశాను. నాకు సెక్యూరిటీపై సీఎం స్పందించాలి. ఇంటెలిజెన్స్ ig గారితో కూడా మాట్లాడను. జ‌రిగిన విష‌యం చెప్పి హైసెక్యూరిటీ భ‌ద్ర‌త‌ క‌ల్పించాల‌ని కోరాను. గత కొన్న రోజుల క్రిత‌మే నా భ‌ర్త‌కు గ‌న్ మెన్స్ విష‌యం కూడా లేఖ రాశాను. సీఎం కూడా ఈ ఘ‌ట‌న‌పై సీరియ‌స్ గా స్పందించాలి. నా ఇంట్లి వ‌ద్ద హై సెక్యూరిటి భ‌ద్ర‌త పెంచాలి.

పోలీసులే తేల్చాలి
అస‌లు నా ఇంట్లోకి చొర‌వ‌బ‌డింది ఎవ‌రు..? ఎందుకొచ్చార‌న్న విష‌యంపై చాలా అనుమానాలు క‌లుగుతున్నాయి. నాకు ఏదైనా ప్రాణ హాణి త‌ల పెట్టాల‌ని చూస్తున్నారా? విష‌యంపై పోలీసులు స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాల్సి ఉంది

LEAVE A RESPONSE