Suryaa.co.in

Andhra Pradesh

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య సాయిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల చిత్ర‌ప‌టాల‌కు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి సార‌ధ్యంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై విజ‌య సాయిరెడ్డి మాట్లాడారు. కార్య‌క్ర‌మంలో పార్టీ సీనియ‌ర్ నేత‌లు ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే శ్రీ‌దేవి, ఎమ్మెల్సీలు జంగా కృష్ణామూర్తి, డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌, పోతుల సునీత‌, ఎంపీ మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE