Suryaa.co.in

National

ఇండి.. అలయన్స్ అవినీతి అనకొండల నిలయం

– బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అంత్యోదయ స్పూర్తితో సేవ చేస్తుంటే, కాంగ్రెస్ నేతృత్వంలోని I.N.D.I.A ( ఇండి.. అలయన్స్ ) అవినీతి మయం
– ప్రధాని మోదీ సంకల్పం “ వికసిత భారత్ “ అయితే ఇండి… అలయిన్స్ సంకల్పం “ భ్రష్టాచార భారత్ “.
– కాంగ్రెస్ తన నాయకులను అవినీతి ఎటిఎం లుగా మార్చేసింది
– ప్రజల నుండి దోచిన సొమ్ము చిట్టాను చట్టబద్ధంగా బయటకు తీయబడుతుంది, ఇది మోదీ గ్యారంటీ
-బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్

ప్రజల నుండి దోచుకున్న ప్రతి పైసా ప్రజలకు తిరిగి అభివృద్ధి, సంక్షేమం కోసం వినియోగించడం మోదీ ఇచ్చే గ్యారంటీ.

అందులో భాగంగానే ….ఇప్పుడు ఝార్ఖండ్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో దొరికిన రు.200కోట్ల నగదు, కొనసాగుతున్న కౌంటింగ్ పూర్తి అయ్యే సరికి అది 500 కోట్లు దాటే అవకాశం ఉందంటున్నారు.

అసలు విషయం ఏమిటంటే?
ఝార్ఖండ్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుతో సంబంధం ఉన్న వ్యాపార వర్గాల ఇళ్ళపై ఝార్ఖండ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ లలో డిసెంబర్ 6, బుధవారం నాడు ఆదాయపు పన్ను శాఖ చేసిన దాడుల్లో ఇప్పటివరకు రు. 200 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న నగదు లెక్కింపు జరుగుతున్నది. ఈ మొత్తం ఇంకా పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు.

ఈ దాడుల్లో దొరికిన మొత్తం, చట్టబద్ధంగా స్వాధీనం చేసుకున్న అతిపెద్ద మొత్తం అవగలదని అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నోట్లు ఎన్ని ఉన్నాయంటే, వాటిని లెక్కించడానికి తీసుకొని వచ్చిన లెక్కింపు మిషన్లు కూడా చెడిపోయాయి. ఈ రెయిడ్ మొత్తం అతి రహస్యంగా జరిగింది. సంబంధిత వ్యక్తులు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు.

ముఖ్యమైన అంశాలు:
నేడు దేశంలో ఒకవైపు అవినీతి, కమిషన్, దోపిడీ, లంచాలు, దళారీ వ్యవస్థలకు హామీ ఇచ్చే దురహంకార కూటమిగా ఇండి..అలయన్స్, మరోవైపు అవినీతిని సమూలంగా నిర్మూలించడానికి కంకణం కట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భరోసా ఉన్నాయి.

2. ప్రజల నుంచి దోచుకున్న సొమ్ములో ప్రతి పైసా తిరిగి వారికి ఇచ్చి తీరాలి అనేది ప్రధాని మోదీ గ్యారంటీ.

మోదీ గ్యారంటీ కి అర్థం– అవినీతిపరుల నుంచి ప్రతీ పైసా దేశానికి వసూలు చేసి పెట్టడం.

3. ఒక్క కాంగ్రెస్ ఎంపీ వద్దనే 200 కోట్లకు పైగా నగదు ఉంటే, మిగిలిన కాంగ్రెస్ ఎంపీల దగ్గర ఎంత నగదు ఉండాలి?

అంటే ఈ లెక్కన “ గాంధీ “ పేరు చెప్పుకునే కుటుంబం ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుల కుటుంబం అనుకోవచ్చు.

4. రాహుల్ గాంధీ గారూ! ఇంకా ఇటువంటి అవినీతి “కళాకారులు” మీ వద్ద ఎంతమంది ఉన్నారు? ప్రజల నుండి దోచిన సొమ్ముకు ప్రతి రోజూ చిట్టా తీయబడుతుంది. ఇది మోదీ గ్యారంటీ.

5. కాంగ్రెస్ ది ప్రేమ దుకాణం అని రాహుల్ గాంధీ అన్నారు, ఆ దుకాణంలో గుట్టలు గుట్టలుగా అవినీతి నోట్ల కట్టలు పేరుకుంటున్నాయి. వాటి లెక్కింపు జరుగుతోంది. వారు చెప్పిన ప్రేమ దుకాణం యొక్క ఒక ఫ్రాంఛైజీ గల్లాపెట్టెలో 200 కోట్ల రూపాయలు దొరికాయి. అంటే “అమ్మకాలు” పెద్ద ఎత్తునే జరిగాయన్నమాట, వారి వద్ద ప్రేమ మొత్తం అవినీతికి అమ్ముడైపోయింది. నేడు వారి వద్ద హిందుత్వ, సనాతన ధర్మం మీద ద్వేషం మాత్రమే మిగిలి ఉంది.

INDI అలయన్స్ అవినీతిసరుకు:
** బెంగళూరులో కాంగ్రెస్ నాయకుడి బంధువు ఇంట్లో 42 కోట్ల నగదు దొరికింది

** యూపీ శాసనసభ ఎన్నికల సమయంలో ఐటీ దాడుల్లో పీయూష్ జైన్ ఇంట్లో 200 కోట్ల నగదు దొరికింది.

** జులై 2022లో మమతా దీదీ మంత్రి పార్థు ఛటర్జీ నివాసాల్లో 50 కోట్ల నగదు, కోట్లకొద్దీ విలువైన బంగారం దొరికాయి

** చెన్నైలో ఆదాయపు పన్ను దాడుల సమయంలో 142 కోట్ల నగదు స్వాధీనం చేసుకోబడింది.

** జూన్ 2022లో సత్యేంద్ర జైన్ కు చెందిన నివాసాల్లో 2.82 కోట్ల నగదును, 133 బంగారు నాణేలను ఈడీ స్వాధీనం చేసుకుంది.

** మే 2022లో ఝార్ఖండ్ లో ఈడీ దాడుల్లో అధికారుల నివాసాల నుంచి 20కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకోబడింది.

** కాన్పూర్ లో ఐ టి అధికారుల దాడుల్లో 95 కోట్ల విలువైన రద్దు చేయబడిన 500-1000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

** ఝార్ఖండ్ లో ఇండీ ప్రభుత్వం లో ఉపాధి హామీ పథకంలో రు. 500 కోట్లు, బొగ్గు గనుల కేటాయింపు స్కాం, గనుల అక్రమ తవ్వకాలలో రు. 1,500 కోట్లు, గ్రామీణ వికాస నిధిలో రు. 1,500 కోట్లు, భూ స్కాముల్లో రు, 3,000 కోట్లు, లిక్కర్ లో రు. 1,500 కోట్లతో సహా అనేక స్కాములను భారతీయ జనతా పార్టీ ప్రముఖంగా లేవనెత్తింది.

ఇప్పుడు ధీరజ్ సాహూ నివాసంలో ఐటీ విభాగం దాడులు
> ఆదాయపు పన్ను విభాగానికి చెందిన 40 మంది సభ్యుల బృందం బుధవారం ఉదయం 6.30 నుంచి ధీరజ్ సాహూ యొక్క వ్యాపార వర్గాలకు చెందిన 10 నివాసాల్లో — ఒడిశాలోని బౌధ్, బౌలాంగీర్, రాయగడ మరియు సంబల్పూరే కాకుండా, ఝార్ఖండ్ లోని రాంచీ-లోహర్దగా మరియు కలకత్తాలోనూ ఏకకాలంలో దాడులు జరిపారు. దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ధీరజ్ సాహూకి చెందిన లిక్కర్ తయారుచేసే కంపెనీ బలదేవ్ సాహూ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద కూడా ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది.

> సాహూ గ్రూప్లో ఎంపీ గారి బంధువులు కూడా ఉన్నారు:
బలదేవ్ సాహూ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ధీరజ్ సాహూతో పాటుగా, అతని కుతుంబ సభ్యులు రాజ్ కిషోర్ సాహూ, స్వరాజ్ సాహూ, మరియు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ధీరజ్ సాహూ మూడోసారి రాజ్యసభ సభ్యులయ్యాడు.

> ధీరజ్ సాహూ బంధువుల పేరుతో ఒడిశాలో పెద్ద ఎత్తున మద్యం వ్యాపారాలున్నాయి. బలదేవ్ సాహూ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాస్తవానికి లోహర్ దగా కు చెందినది. ఈ కంపెనీ 40 సంవత్సరాల నుంచీ ఒడిశాలో దేశీ మద్యం తయారుచేయడం ప్రారంభించింది. కంపెనీ బౌద్ధ్ డిస్టిల్లరీ ప్రైవేట్ లిమిటెడ్ (BDPL) యొక్క భాగస్వామ్య సంస్థ. అదే కంపెనీకి చెందిన బలదేవ్ సాహూ ఇంఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (ప్లై యాష్ బ్రిక్స్) క్వాలిటీ బాట్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరియు కిషోర్ ప్రసాద్, విజయ ప్రసాద్ బేవెరేజెస్ లిమిటెడ్ (IMFL) బ్రాండ్ల అమ్మకాలు మరియు మార్కెటింగ్ కూడా ఉంది

LEAVE A RESPONSE