అమెరికాతో సాంకేతిక భాగస్వామ్యం..యూరప్‌తో వాణిజ్య భాగస్వామ్యం…రష్యాతో ఎనర్జీ..రక్షణ భాగస్వామ్యం.
ఈ మూడు దిశల్లో భారత్ ఒకేసారి ప్రయాణిస్తోంది.
అమెరికా ఒత్తిడి పెట్టినా…భారత్ రష్యా నుండి చౌక ఇంధనం..రక్షణ సాంకేతికత..ఎరువులు పొందడం కొనసాగించాలన్న నిర్ణయాన్ని మార్చలేదు.
అసలు కథ రేర్ ఎర్త్ మెటల్స్ దగ్గర ఉంది. ఆయుధాలలో వాడే సెమీకండక్టర్లకు అవసరం అయిన ఖనిజాలు చాలా సెపరేటు.
వాటిని శుద్ధి చేసే సాంకేతికత రష్యా భారత్ పంచుకోబోతున్నాయి. చైనా దీంట్లో నంబర్ వన్.
అమెరికాకు కూడా ఇవి చాలా అవసరం.
అయితే రాను రాను రష్యా టైట్ చేస్తే, భారత్ సహకారం సాంకేతికత మానవ వనరులు అమెరికాకు చాలా ఉపయోగపడతాయి.
చైనాను అవసరం కోసం తప్పితే ఇంకెవరూ పూర్తిగా నమ్మరు.
భారత్ ఏ దేశానికి అయినా ఆధార పడదగ్గ విశ్వసనీయమైన దేశం.
ఈ క్రెడిట్ కి అంతా మన ప్రజలు ఆయా దేశాల్లో తెచ్చుకున్న పేరే కారణం.
మరో వైపు భారత్ మూడు దారుల్లో ముందుకు కదులుతోంది.
స్ట్రాటజిక్ హెడ్జింగ్…అమెరికా, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా, రష్యా, గల్ఫ్ — అందరితోనూ సమతుల్య సంబంధాలు.
ఒక్కరితో కలిస్తే మరొకరిని కోల్పోయే విధానం కాదు.
ముఖ్యంగా ఆర్థిక స్వతంత్రత బాగా పెరిగింది..
మేకిన్ ఇండియా…రక్షణ ఉత్పత్తులు తయారీ…చిప్ ఉత్పత్తి… రెన్యువబుల్ ఎనర్జీ….ఇవి భారత్ బయటి ఆధారాన్ని తగ్గిస్తున్నాయి.
అందరూ క్వాడ్ తో ఇబ్బంది అంటున్నారు గానీ…భద్రతా భాగస్వామ్యాలు పెర్ఫెక్ట్ గ్రూ లో ఉన్నాయి.
క్వాడ్ ..ఇండో–పసిఫిక్ ఒప్పందాలు…యూరప్‌తో సప్లై చైన్ మైత్రి — ఇవన్నీ చైనాను సమతుల్యం చేసే వ్యూహం.
మానవ వనరుల లో యువశక్తి…పెరుగుతున్న మార్కెట్..ప్రపంచ ఐటీ రంగంలో భారత్ ఆధిపత్యం.
స్థిరమైన ఆర్థిక వృద్ధి…స్వతంత్ర విదేశాంగం.
ఇవి పంచ శక్తులు…అయితే…ఇవ్వన్నీ నేను చెబుతున్నవి కాదు. పుతిన్ పర్యటన నేపథ్యంలో ప్రపంచ మీడియా చెబుతున్నవి.
రాయిటర్స్ వార్తా సంస్థ
భారత్ ఒకేసారి అమెరికా–యూరప్ మిత్రత్వాన్ని పెంచుకుంటూనే రష్యాతో బలమైన ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తోంది — దీనివల్ల భారత్ ప్రపంచవ్యాప్తంగా సమతుల్య శక్తిగా ఎదుగుతోంది…
ఫైనాన్సియల్ టైమ్స్
భారత్ యొక్క “multi–alignment” మోడల్‌ను ప్రపంచం అంగీకరిస్తోంది….ఇప్పుడు ప్రపంచం భారత దిశ చూసి కదులుతోంది….
ది ఎకనామిస్ట్
భారత్ తన ప్రయోజనాల కోసం అమెరికా..రష్యా.. గల్ఫ్ త్రిభుజాన్ని సమర్థంగా వాడుకుంటోంది…
ఇంక న్యూయార్క్ టైమ్స్ అయితే స్పష్టంగా…అమెరికా కూడా ఇప్పుడు భారత్‌ను కోల్పోవడానికి రిస్క్ తీసుకోలేని స్థితిలో ఉంది అని వ్యాఖ్యానించింది.
సరే..ఇవ్వన్నీ ఒక ఎత్తు అయితే…
ఎక్కడ రాహుల్ కలిస్తే…మోడీ గ్రాఫ్ పడిపోతుందో అన్న భయంతో పుతిన్ ను కలిసే అవకాశం ఇవ్వలేదని ఖాన్ గ్రేస్ ఉవాచ.
మీకు నవ్వు రాకపోతే…ఆయనను బాగా కనెక్ట్ అయి ఉన్నారని అర్థం.
కానీ రష్యా ఒక్క నిమిషం కూడా టైమ్ వేస్ట్ చేసుకునే పరిస్థితుల్లో లేదు.
ఈయన సరిగ్గా ఆ టైముకి మొబైల్ చూసుకుంటూనో…పుతిన్ పక్కనున్న అందాలు వీక్షించే పనిలోనో ఉంటాడని.. ఒకవేళ ఆ గందరగోళంలో ఏ కన్ను కొట్టడం లాంటి విపరీత చేష్టలకు పాల్పడే అవకాశమో ఉందని అభిజ్ఞ వర్గాల భోగట్టా…
డీప్ స్టేట్ మనుషులను సాధారణంగా రష్యా ఎంగేజ్ చెయ్యదు. మన కంటే రష్యా దగ్గర నిఘా సమాచారం ఎక్కువ ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడ్ని ఎంపిక చేసుకోవడంలోనే ఖాన్ గ్రేస్ పొరబాటు చేసిందని ఇలాంటి సందర్భాలలో అనిపిస్తుంది.
మనకి వంశాల మీద ప్రేమ వల్ల కొన్ని అర్థం కాకపోవచ్చు గానీ….రష్యా లాంటి దేశాలకు తెలియవా?
బాధ కలిగినా కొన్నింటిని దిగమింగుకోవాలి…దేశ ప్రతిష్ఠ కంటే ఏదీ ముఖ్యం కాదు మనకి!
– అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యం