Suryaa.co.in

Features

హిందువు గమ్యం భారతదేశం మాత్రమే

ప్రపంచ జనాభాలో క్రైస్తవుల సంఖ్య: 220 కోట్లు
క్రైస్తవ మతాన్ని అధికారికంగా కలిగిన క్రైస్తవ దేశాలు: 33
ప్రపంచ జనాభాలో ముస్లింల సంఖ్య: 180 కోట్లు
ఇస్లాం మతాన్ని అధికారికంగా కలిగిన దేశాలు: 27
ప్రపంచ జనాభాలో యూదుల సంఖ్య: 2 కోట్లు
జూడా మతాన్ని అధికారికంగా కలిగిన దేశాలు: 1
ప్రపంచ జనాభాలో బౌద్ధ మతస్తుల సంఖ్య: 48 కోట్లు
బౌద్ధ మతాన్ని అధికారికంగా కలిగిన దేశాలు: 6
ప్రపంచ జనాభాలో హిందువుల సంఖ్య: 110 కోట్లు
హిందు మతాన్ని అధికారికంగా కలిగిన దేశాలు: 0
అన్ని మతాల వారికి తమ తమ మతాన్ని పాటించే దేశాలున్నాయి ఒక్క హిందువులకు తప్ప. అధికారికంగా ఇది మా హిందూ దేశం అని చెప్పుకోడానికి ప్రపంచంలో ఒక్క దేశం కూడా హిందువులకు లేకపోవడమేంటి?

ఇతర దేశాల నుంచి తమ దేశాల్లోకి చొరబాటుదారులు ప్రవేశించకుండా ఆయా దేశాలు కట్టుదిట్టమైన చట్టాలను రూపొందించుకున్నాయి. కానీ మన దేశంలో మాత్రం చొరబాటుదారులను బయటికి పంపకూడదని దేశ ద్రోహులు ధర్నాలు చేస్తున్నారు, ప్రాంతీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలతో అసెంబ్లీ ల్లో తీర్మానాలు చేస్తున్నారు.

ఇంతకుముందు హిందూ దేశం గా ఉన్న నేపాల్ ని కమ్యూనిస్టుల ఒత్తిడి వల్ల లౌకిక(సెక్యులర్)దేశం గా రాజ్యాంగం లో రాశారు. ఈ ప్రపంచంలో హిందువు అనేవాడు బ్రతకాలనుకుంటే అతని గమ్యం భారతదేశం మాత్రమే. ఎందుకంటే ప్రపంచంలో హిందువులున్న, హిందువులకున్న ఒకే ఒక్క దేశం మన భారతదేశం. ఉన్న ఆ ఒక్క ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులకు లేదంటారా? ఆలోచించండి.
( రచయిత ప్రస్తావించిన అభిప్రాయాలతో సూర్య వెబ్‌సైట్‌కు సంబంధం లేదు. అది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని గమనించగలరు)

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు

LEAVE A RESPONSE