(అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం)
రష్యా అద్యక్షుడు పుతిన్ భారత పర్యటన సందర్భంగా మొత్తం 15 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇవి రెండు దేశాల మధ్య ఉద్యోగాలు, ఆరోగ్యం,పరిశోధన, సముద్ర రవాణా, వ్యవసాయ్, వాణిజ్యం, మీడియా, విద్య రంగాల్లో గొప్ప మార్పులు తీసుకు రానున్నాయి. ఉద్యోగాలు, వలసపై ఒప్పందాలు.
రెండు దేశాల పౌరులు పరస్పర దేశాలలో చట్టబద్దంగా పని చేయ డానికి, ఉద్యోగ మార్పిడికి ప్రత్యేక కార్మిక ఒప్పందం కుదిరింది.
దీనివల్ల భారత యువతకు రష్యాలో అవకాశాలు పెరుగు తాయి. ముఖ్యంగా నౌకాయాన, సమాచార సాంకేతికం, వైద్యరంగం నిర్మాణరంగాలలో అవకాశాలు విస్తరించనున్నాయి. అక్రమ వలసలు. మానవ అక్రమ రవాణా, నకిలీ పత్రాలతో వల సలు వంటి అంశాలపై సంయుక్త చర్య, డేటా పంచుకోవడం, దర్యాప్తు వ్యవస్థ ను బలపరచడం కోసం. ఆరోగ్యం,ఆహార భద్రత పై ఒప్పందాలు.
క్యాన్సర్ చికిత్స, కృత్రిమ మేధస్సు ఆధారిత నిర్ధా రిత పద్దతులు, అవరవ మార్పిడి విధానాలు. ఆహార భద్రత, నాణ్యత, పరీక్షా పద్దతులు, వినియోగదారుల రక్షణ, రేడియేషన్ తనిఖీ వ్యవస్థలను కలిపి మెరుగుపరచడం. నౌకాయాన, సముద్ర రవాణా, పోలార్ జలాలపై ఒప్పందాలు.
పోలార్ ప్రాంతాల్లో నడిపే నిపుణు లకు శిక్షణ ఇవ్వడం. ఈ శిక్షణ తో భారత నౌకాయాన రంగం ప్రపంచ స్థాయిలో అభివృద్ది చెందుతుంది. పోలార్ మార్గం ద్వారా ఆసియా- యూరప్ సరుకు రవాణా సమయం సుమారు 40 శాతం తగ్గుతుంది. దీనివల్ల భారత ఎగుమతుల ఖర్చు తగ్గి, పోటీ సామర్థ్యం పెరుగుతుంది. రష్యా-బెలారస్ ప్రపంచ పొటాష్ ఉత్పత్తిలో 40శాతం భాగ స్వామ్యం కలిగి ఉండటంతో ఈ ఒప్పందం భారత రైతులకు ఎరు వుల లోటు సమస్య ను తగ్గిస్తుంది.
భారత పోస్టల్ వ్యవస్థ, రష్యా పోస్టల్ వ్యవస్థ మధ్య లాజిస్టిక్ సహకారం కోసం ఒప్పందం. దీని వల్ల ఆన్ లైన్ వాణిజ్యం, , చేతివృత్తుల ఉత్పత్తులు, ఆయుర్వేద ఉత్పత్తులకు రష్యా మార్కెట్ సులభం అవుతుంది. విద్య,శాస్త్రీయ పరిశోధన సహకారం. మీడియా రంగంలో సహకారం. జియో పొలిటికల్ ప్రాముఖ్యత.
ప్రపంచ రాజకీయాల్లో భారత్ ఇక పాశ్చాత్య దేశాల అనుకూలం కాదు. వైట్ హౌజ్ లోని గోడల మధ్య నిశ్శబ్ద ఆందోళన వ్యాపించింది. ఈ పర్యటన ఒక ప్రోటోకాల్ కాదు. ప్రపంచ సమీకరణాలను మార్చగల పెద్ద అడుగు. చాలా ఏళ్ళుగా అమెరికా ప్రపంచం లో మోనోపలీ అనే నమ్మకం తో
జీవించింది. భారత్-రష్యా భాగస్వామ్యం ఆశక్తి పఠాన్ని తిరగరాస్తుందనే భయం వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది.
భారత్ భారీగా రష్యన్ చమురు కొనుగోలు చేస్తుంది. రక్షణ ఒప్పందాలు, టెక్నాలజీ సమాచారం వేగంగా పెరుగుతున్నాయి. BRICS విస్తరణ &డీ-డాలరైజేషన్ ప్రయత్నాలు. అమెరికా ఆధిపత్యానికి సవాలు. పాశ్చాత్య ఒత్తిడిని భారత్ పట్టించుకోవడం లేదు.
INDIA changing the rules, What now?
అమెరికా ఇంకా రష్యా నుండి న్యూ క్లియర్ ఇంధనం కొనుగోలు చేస్తోంది. అమెరికా కు హక్కు ఉంటే, భారత్ కు ఎందుకు ఉండకూడదు?- ఈ ఒక్క వ్యాక్యం అమెరికా ద్వందనీతిని ప్రపంచం ముందుంచింది. అది భారత్ కోసం ఒక గర్వ క్షణం. మోదీజీ నాయకత్వంలో భారత్ గర్వంతో నిలుస్తోంది.
ఇప్పటి భారత్– ఎవరో ఆదేశించేది కాదు.
ఎవరి చేత ఒత్తిడికి లోబడేది కాదు
ప్రపంచానికి మోడల్ గా మారే దేశం. స్వాతంత్య్రం అంటే కేవలం రాజ్య మేలిన హక్కు కాదు. జాతీయ నిర్ణయాలను స్వయంగా తీసుకునే శక్తి పుతిన్-మోదీ భేటీ దేశ ప్రయోజ నాల ముందు ప్రపంచ ఒత్తిడిని పక్కన బెట్టే దైర్యానికి ఉదాహరణ.
ఇది దేశ స్వాభిమానం & న్యాయాధికారిక స్వతంత్ర కు గుర్తు. -భవిష్యత్ దిశ. ఈ ఒక్క భేటీతో ఇండియా ప్రపంచ శక్తుల సమీకరణాల్లో కీలక పాత్ర పోషిస్తుంది.
మా నిర్ణయాలు మేమే తీసు కుంటాం- ఇదే న్యూ ఇండియా విజన్
జైహింద్!