దమ్మున్న ఉక్కు మహిళ ఇందిర

Spread the love

దమ్మున్న ఉక్కు మహిళ. ఎమర్జెన్సీ మచ్చ వల్ల ఈ దేశ అభివృద్ధి కోసం ఆవిడ చేసిన అనేక కార్యాలు మరుగున పడవచ్చు. కానీ సైన్యాన్ని పాక్ మీదకి నడిపించి ముష్కర పాకిస్తాన్ ని తుత్తునియలు చేసి రెండు ముక్కలు చేసిన అపరదుర్గ అని నాడు నాయకులుచే అనిపించుకున్న మేరునగధీరురాలు.

సిక్కిం లాంటి రక్షిత రాజ్యాల/దేశాలను ఇండియాలో విలీనం చేసి ఒక రాష్ట్రంగా ఏర్పరిచిన మన ప్రధాని. ఉపగ్రహాలను మొదటిసారి పంపించినా లేదా దేశంలో అణుపరీక్ష చేసినా అగ్రరాజ్యాలను ధీటుగా ఎదిరించి నిలబడ్డ స్వతంత్ర భారతదేశంలో గట్టి నాయకురాలు. పాకిస్తాన్తో యుద్ధ సమయంలో అమెరికా బెదిరింపులకు వ్యతిరేకంగా మన దేశ సార్వౌమత్వాన్ని కాపాడుకుంటానికి ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇంతకుముందు షేర్ చేశాను చూడండి ఒకసారి. వారి హయాంలో మనమంటే గిట్టని ముష్కర దేశాలు కొన్ని మన ఇండియా వైపు చూడ్డానికే భయపడ్డాయి.

మేము ఒప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే గౌరవనీయులైన గుజరాతి పాలకులు /మోషా గార్లు వచ్చిన తర్వాత వారితో పోలిస్తే ఆవిడ గొప్పతనం ఇంకా కాస్త తెలిసింది . అంతకు ముందు వరకు ఆవిడంటే ఆనాటి ఎమర్జెన్సీ సమయంలో చిన్నప్పుడే మైండ్ పై పడిన భావాల వల్ల ఇష్టపడే వాళ్ళం కాదు. రాజభరణాలు రద్దు చేసనా, ప్రజల కోసం సామాన్యుల కోసం బ్యాంకులు జాతీయకరణ చేసినా ఆవిడకే సాధ్యం. దేశంలో అనేక మేటి ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేశారు. కానీ దురదృష్టం ఏమిటంటే నేడు ఉన్న గుమా వ్యాపారులు పాలకులు ఒక్కోటి అమ్మేస్తున్నారు, అదీ అడ్డంగా.

ఆవిడ గుమా వ్యాపారుల కోసం పనిచేయలేదు, సామాన్యమైన ప్రజల కోసం పనిచేశారు. ఉత్తర భారతీయ బిడ్డగా బతకాలని చూడలేదు, ఆవిడ దక్షిణాదిలో.. ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో కూడా పోటీచేసి నెగ్గారు. ఉత్తరాది మొత్తం 1977లో ఓడిస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 42 పార్లమెంట్ సీట్లకి 41 నెగ్గించి ఆవిడని గుండెల్లో పెట్టుకున్నారు తెలుగుప్రజలు. ఎన్టీఆర్ గారి విషయంలో ఆరోజు ముందుగా పదవి నుంచి దింపేసిన విషయంలో లోపం చేసినా సరే, తిరిగి సరిదిద్దుకున్నారు. కానీ అంతకాలం పరిపాలించిన వారి పాలన, వ్యవహారంలో కొన్ని లోపాలు ఉంటే ఉన్నాయి, ఈ కానీ ఈ దేశానికి చేసిన మేలు చాలా ఉంది.

వారి మతంపై వారి తాతలు వేరే అని వారి పితామహి/మాతృమూర్తికి కళంకం ఆపాదిస్తూ కొన్ని పార్టీల వీరాభిమానులు ఫేక్ న్యూస్ లు కుప్పలుకుప్పలుగా ప్రచారం చేయడం సంస్కారం కాదు. ఆవిడ ఏ రోజూ కూడా అమెరికా లేదా రష్యా లో జరుగుతున్న ఎన్నికల్లో ప్రస్తుత బాచ్ పెట్టినట్లు వేలు పెట్టి అక్కడ కొందరు నాయకులకి ప్రచారం చేసి భంగపాటు తెచ్చుకోలేదు, మన దేశానికి చెడ్డ పేరు తీసుకురాలేదు.

ముష్కరచైనాతో యుద్దసమయంలో ఒక ప్రధానమంత్రి కుమార్తెగా ఆవిడ ఏకంగా చైనా ఆర్మీ దాడి చేస్తున్నా, సామాన్యులకు ధైర్యంగా ఉండటానికి అస్సాంలో తేజ్ పూర్లో చేసిన వీరోచిత సాహస కార్యము మనకి గుర్తుంటే ఆవిడ ఏమిటో అర్థం అవుతుంది. చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. వారి జయంతి నేడు.. గుర్తుచేసుకుంటూ..

-చలసాని

Leave a Reply