– అది జగన్ బినామీ కంపెనీ
– విశ్వేశ్వరరెడ్డి, అరబిందోరెడ్డి జగన్ బినామీలే
– అక్రమంగా వందలాది ఎకరాలు కట్టబెట్టారు
– ఇండ్‌సోల్‌పై విచారణ జరపాల్సిందే
– నా కేసులో నాటి గుంటూరు కలెక్టర్‌నూ విచారించండి
– సునీల్‌ను ఈపాటికే సస్పెండ్ చేసి ఉండాల్సింది
– గుంటూరు ఎస్పీని కలసిన అనంతరం మీడియాతో ఉండి టిడిపి ఎమ్మెల్యే రఘరామకృష్ణంరాజు
గుంటూరు: గత జగన్‌రెడ్డి ప్రభుత్వంలో షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వరరెడ్డి, విజయసాయి బంధువు అరబిందో రెడ్డిగారు కలసి జగన్ బినామీలతో ఇండ్‌సోల్ కంపెనీకి కట్టబెట్టిన.. వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకోవాలన్న మీడియా కథనాలను తాను బలపరుస్తున్నానని ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అన్నారు.
ఇండ్‌సోల్‌కు సంబంధించి మీడియాలో కథనాలు రాకముందే, తాను ఆ కుంభకోణం గుట్టు విప్పానని గుర్తు చేశారు. ఆ కంపెనీకి అన్ని వందల భూములు కేటాయించే అర్హత లేదన్నారు. షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు అవసరం లేకపోయినా ప్రజాధనాన్ని జగన్‌రెడ్డి ఏవిధంగా దోచిపెట్టారో తాను అప్పుడే ప్రపంచానికి వెల్లడించానని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఆ భూములు స్వాధీనం చేసుకుని, ఇండ్‌సోల్‌పై విచారణ జరిపిస్తుందన్న నమ్మకం తనకుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
తన కస్టోడియల్ టార్చర్‌కు సంబంధించిన కేసులో, నాటి గుంటూరు జిల్లా కలెక్టర్ పాత్రపైనా విచారించాలని డిమాండ్ చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదయినందున నాటి సీఐడీ సునీల్‌ను ఈపాటికే సస్పెండ్ చేసి ఉండాల్సిందన్నారు. 307 కేసులో ఇద్దరు డీజీ స్థాయి అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం చరిత్రలో ఇదే ప్రధమమని గుర్తు చేశారు.
గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో తన న్యాయవాది ఉమేష్‌చంద్రతో కలసి మాట్లాడిన రఘురామరాజు మీడియాతో ఏమన్నారంటే..
మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ తో పాటు ఐదుగురి పై ఫిర్యాదు చేశాం.గత నెలలో చేసిన ఫిర్యాదు పై ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. నా దగ్గర ఉన్న సమాచారాన్ని, ఆధారాలను ఎస్పీ కి ఇవ్వటానికి వచ్చాను. ఎటువంటి ఆలస్యం లేకుండా విచారణ చేస్తామన్నారు.
307 కేసులో డిజి స్థాయి అధికారులు, మాజీ సిఎం ఉండటం ఇప్పటి వరకూ జరగలేదు. హత్యాయత్నం కేసు నమోదైనప్పుడు అధికారులను సస్పెండ్ చేయాలి. ఈ కేసు లో ఇప్పటి వరకూ ఇది చేయలేదు. కొద్ది రోజుల తర్వాత అయినా సస్పెండ్ చేస్తారని భావిస్తున్నాను.పి వి సునీల్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పోల్చితే నేనే దళిత బంధువును.దళితులపై దాడి జరిగినప్పుడు నేనే స్పందించాను.వాళ్ళెప్పుడూ స్పందించిన దాఖలాలు లేవు.
కేసు నమోదైన వారందరిని అరెస్ట్ చేస్తారని నమ్ముతున్నాను. డిజి స్థాయి అధికారులు కాబట్టే అరెస్టులో జాప్యం అవుతుందని భావిస్తున్నాను. అప్పటి గుంటూరు కలెక్టర్ ను కూడా ప్రశ్నించాలి. డాక్టర్ శ్రీకాంతే అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఎందుకు రాశాడో తేల్చాల్సి ఉంది.
సాక్షిగా బోరుగడ్డ అనిల్ సంతకం తీసుకున్నారు.వీరంతా అప్పటికే సిద్ధంగా ఉన్నారంటే ఒక కుట్ర ప్రకారమే జరిగింది. గుంటూరు సిఐడి కార్యాలయంలో నన్ను చంపేందుకు కుట్ర పన్నారు మీడియా వల్లనే నేను బతికి పోయాను. నామీద రాజద్రోహం కేసు పెట్టారు.