Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో పరుగులు పెడుతున్న పారిశ్రామిక అభివృద్ధి

విశాఖపట్నం, జూలై 11: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా మంగళవారం ఆయన పలు అంశాలు వెల్లడించారు. కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ కేంద్రంగా పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు.

టెక్నోడోం, (టీవీ యూనిట్) వర్చువల్ ఇమేజ్ సంస్థలకు శంకుస్థాపన, టెక్నోడోం (వాషింగ్ మెషీన్ యూనిట్), ఛానల్ ప్లే సంస్థలతో ఎంఓయూలు, కొప్పర్తిలో అల్ డిక్సన్ నూతన యూనిట్ ప్రారంభం వంటివి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దికి పరుగులు తీస్తోందనడానికి సాక్ష్యాలని ఆయన అన్నారు.

సీఎం అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగిందని అన్నారు. జీఐఎస్ (గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్) లో చేసుకున్న ఎంఓయూల గ్రౌండింగ్ దిశగా చర్చ జరిగిందని, ఇప్పటికే 59 భారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించగా, రూ.3,39,959 కోట్లు పెట్టుబడులు వాస్తవరూపంలోకి వచ్చాయని అన్నారు. అదే విధంగా మరిన్ని ప్రాజక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించిందని అన్నారు.

ఓబరాయ్ హోటల్ల శంకుస్థాపనతో టూరిజం అభివృద్ధి
7 స్టార్ రేటింగ్ గల ప్రఖ్యాత ఒబరాయ్ గ్రూప్ హోటల్లు విశాఖపట్నం, తిరుపతి, గండికోటలో నిర్మాణం కానుండడంతో రాష్ట్రంలో పర్యాటక రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిచే శంకుస్థాపన జరిపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వేల సంఖ్యలోని స్థానికులకు ఉద్యోగాలు లభించడంతో పాటు టూరిజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

వరదల్లో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
ఉత్తర భారతదేశంలో ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏర్పడ్డ వరదలకు 61 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని విజయసాయి రెడ్డి అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 39 ఎన్ డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని అన్నారు. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల ఏర్పడటానికి ప్రధాన కారణాలను అన్వేషించి వాటికి పరిష్కార మార్గాలు వెతకాలని విజయసాయిరెడ్డి అన్నారు.

LEAVE A RESPONSE