మంత్రి కొడాలి నాని కృషితో జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన

108

– ఇళ్లు నిర్మించుకున్న వారందరికీ విద్యుత్ కనెక్షన్లు ఇస్తాం
– రూ. 2 కోట్లతో మంచినీటి అవసరాలను తీరుస్తాం
– గుడ్లవల్లేరు కాలనీలో విద్యుదీకరణ పనులు ప్రారంభం
– భూమి పూజ చేసిన వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్

గుడివాడ,(గుడ్లవల్లేరు) మార్చి 15: రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కృషితో గుడివాడ నియోజకవర్గంలోని జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన జరుగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ చెప్పారు. మంగళవారం గుడ్లవల్లేరులోని వైఎస్ఆర్ జగనన్న కాలనీలో విద్యుద్దీకరణ పనులను ఆయన
15-PHOTO-4 ప్రారంభించారు. ముందుగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా దుక్కిపాటి శశిభూషణ్ ఎలక్ట్రికల్ డిఈ ఆపరేషన్ రామ కృష్ణ, ఏడీఈ టి. దశరథం, ఏఈ కే. సుబ్బారెడ్డి, కన్స్ట్రక్షన్ ఏడిఈ రవి కిషోర్, ఏఈ సాంబశివ రావుతో మాట్లాడారు. విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. విద్యుదీకరణ పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు.

అనంతరం దుక్కిపాటి శశిభూషణ్ మాట్లాడుతూ గుడ్లవల్లేరులోని జగనన్న కాలనీలో దాదాపు వెయ్యి మంది లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకుంటుంన్నారని తెలిపారు. కాలనీలో విద్యుదీకరణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. మొత్తం ఆరు 600 కేవీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కాలనీ మొత్తం విద్యుత్ స్తంభాలను నెలకొల్పి విద్యుత్ వైర్లను ఏర్పాటు
15-PHOTO-3 చేస్తామన్నారు. నెల రోజులు ఆయా పనులు పూర్తవుతాయని తెలిపారు. ఇల్లు నిర్మించుకునే ప్రతి లబ్దిదారునికి విద్యుత్ కనెక్షన్లు ఇస్తామని చెప్పారు. రూ. 2 కోట్లతో తాగునీటి పైప్లైన్ పనులను కూడా పూర్తి చేసి ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు. ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారుల కోసం రూ. 30 లక్షల వ్యయంతో ఆర్డబ్ల్యుఎస్ అధికారులు మంచినీటి సౌకర్యాన్ని కల్పించారన్నారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా తాత్కాలికంగా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారని తెలిపారు.

భవిష్యత్తులో కాలనీ విస్తీర్ణం పెరిగే లబ్ధిదారులు మరిన్ని గృహాలను నిర్మించుకునే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుదీకరణ పనులను చేపట్టడం జరిగిందని దుక్కిపాటి శశిభూషణ్ చెప్పారు. అనంతరం దుక్కిపాటి శశిభూషణ్ కు పలువురు విద్యుత్ శాఖ అధికారులు పుష్పగుచ్ఛాలను అందించి దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుడ్లవల్లేరు ఎంపీపీ కొడాలి సురేష్, వైసిపి గుడ్లవల్లేరు మండల అధ్యక్షుడు శాయన రవికుమార్, కొండాలమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కనుమూరి రామిరెడ్డి, ట్రస్టు బోర్డు సభ్యులు పడవల వెంకటేశ్వరరావు, వైసిపి నాయకులు టి శంకర్, రంగారావు, పోలాసి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.